వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేటీఆర్ పుత్రోత్సాహం ..కేటీఆర్ కంటే ఎత్తుకు ఎదిగిన హిమాన్షు ..

|
Google Oneindia TeluguNews

పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె కలగదు. కొడుకు తనకంటే గొప్పగా ఎదిగి అన్నింటా విజయాలు సాధించిన నాడు తండ్రికి నిజమైన పుత్రోత్సాహం కలుగుతుంది. తండ్రీ తనయుల అనుబంధం మాటలకు అతీతమైనది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే తన తనయుడు హిమాన్షు ను గట్టిగా ఆలింగనం చేసుకుని టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ అనుభూతిని ఆస్వాదిస్తున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

<strong>చంద్రబాబుపై తలసాని తిట్ల పర్వం ... అయ్యలానే కొడుకు డ్రామాలు చేస్తున్నాడని ఫైర్ </strong>చంద్రబాబుపై తలసాని తిట్ల పర్వం ... అయ్యలానే కొడుకు డ్రామాలు చేస్తున్నాడని ఫైర్

గతంలోనే తండ్రికి తగ్గ తనయుడిగా జాతీయస్థాయిలో గోల్డ్ మెడల్ పొందిన హిమాన్షు

గతంలోనే తండ్రికి తగ్గ తనయుడిగా జాతీయస్థాయిలో గోల్డ్ మెడల్ పొందిన హిమాన్షు

తండ్రికి తగ్గ తనయుడు, తాతకు తగ్గ మనవడుగా గతంలోనే నిరూపించుకున్నాడు కేటీఆర్ తనయుడు హిమాన్షు రావు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడు హిమాన్షు ఒక జాతీయ స్థాయి పోటీలో అగ్ర స్థానం లో నిలిచి గోల్డ్ మెడల్ సాధించాడు.డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రమెరికా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ సంస్థ తాజాగాబెహతర్‌ ఇండియా క్యాంపెయిన్‌నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పర్యావరణ విభాగంలో హైదరాబాద్‌ ఓక్రిడ్జ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ విద్యార్థి గా హిమాన్షు రావు బంగారు పతకం సాధించాడు.కేటీఆర్‌ తనయుడు కల్వకుంట్ల హిమాన్షురావు వ్యక్తిగత విభాగంలో 29,482 కిలోల రీసైకిలబుల్‌ వేస్ట్‌ , పునరుత్పాదక వ్యర్ధాలను సేకరించి అగ్రస్థానంలో నిలిచాడు.

తాత తెలివి, తండ్రి నేర్పరితనం రెండూ హిమాన్షుకు ఉన్నాయని చర్చ

తాత తెలివి, తండ్రి నేర్పరితనం రెండూ హిమాన్షుకు ఉన్నాయని చర్చ

బెహతర్‌ ఇండియా క్యాంపెయిన్‌ గ్రాండ్‌ ఫినాలే సందర్భంగా ఢిల్లీలో క్యాంపెయిన్‌ బ్రాండ్‌ అంబాసిడర్, సినీ నటి పరిణితీ చోప్రా చేతుల మీదుగా పతకాలను ప్రదానం చేశారు. ఓక్రిడ్జ్‌ పాఠశాల యాజమాన్యాన్ని, వ్యక్తిగత విభాగంలో పతకం సాధించిన హిమాన్షును డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రమెరికా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఎండీ అనూప్‌ పెబ్బీ అభినందించారు. హిమాన్షు రావు జాతీయస్థాయిలో గోల్డ్ మెడల్ సంపాదించడంతో ఇప్పుడు అందరూ తాత కేసీఆర్ తెలివి, తండ్రి కేటీఆర్ నేర్పరితనం రెండు హిమాన్షు కు వచ్చాయని పెద్ద చర్చే జరిగింది.

హిమాన్షును ఆలింగనం చేసుకున్న ఫోటో ట్విట్టర్ లో వైరల్

హిమాన్షును ఆలింగనం చేసుకున్న ఫోటో ట్విట్టర్ లో వైరల్

ట్విట్టర్ వేదికగా కేటీఆర్ అటు రాజకీయ అంశాలతో పాటు, రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాల గురించి తన అభిప్రాయాలను ట్వీట్ చేస్తూ ఉంటారు. అంతేకాదు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలను సైతం ట్విట్టర్ వేదికగా తెలియజేసి తన సంతోషాన్ని నెటిజన్లతో పంచుకోండి. అదే క్రమంగా హిమాన్షు రావును ఆలింగనం చేసుకున్న కేటీఆర్ "13 ఏళ్లకే మీ కుమారుడు ఎత్తులో మిమ్మల్ని మించిపోతే గట్టిగా ఓ హగ్ కాకుండా ఇంకేం కోరుకుంటారు" అని ట్వీట్ చేశారు. అంతేకాదు కుమారుడి ఆలింగనంలో సేదతీరుతున్న ఫోటోను షేర్ చేశారు. దీంతో ఇది నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఇటీవల జాతీయస్థాయిలో గోల్డ్ మెడల్ సంపాదించినప్పుడు అందరూ తండ్రికి తగ్గ తనయుడు అంటే, ఇక ఇప్పుడు కేటీఆర్ చేసిన ట్వీట్ చూసి తండ్రిని మించిన తనయుడు అంటున్నారు.

English summary
TRS Working President KTR's son Himanshu and KTR's photo viral in social media . KTR tweeted in twitter about his bonding with his son . "when you are just 13 son stands taller than you all you want is a bearhug" KTR Tweeted. In privious Himanshu also won a gold medal in a national level competition. DHFL Primerika Life Insurance Company Limited organized the ecological competitions as part of the Behatareen India Campaign. In this competition Himanshu Rao acquired the first place and he collected 29,482 kg recyclable wastes in the personal section.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X