ktr kt rama rao survey pre poll survey republic tv telangana ys jagan ys jagan mohan reddy andhra pradesh కేటీఆర్ కేటీ రామారావు mood of the nation lok sabha elections 2019 opinion poll
రిపబ్లిక్ టీవీ ప్రీపోల్ సర్వే, కేటీఆర్ స్పందన: 'వెనక్కితిరిగి' చూసుకోవాలని నెటిజన్ల కౌంటర్
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోని పదిహేడు లోకసభ స్థానాలకు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) 17 సీట్లు గెలుచుకుంటుందని, మజ్లిస్ 1 స్థానం గెలుచుకుంటుందని రిపబ్లిక్ టీవీ - సీ ఓటరు ప్రీపోల్ సర్వేలో వెల్లడైంది. టీఆర్ఎస్ పార్టీకి 42.1 శాతం, మజ్లిస్ పార్టీకి 7.7 శాతం, ఇతరులకు 8.2 శాతం ఓట్లు వస్తాయని తేలింది. దీనిపై తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ట్విట్టర్ ద్వారా స్పందించారు.
ఇండియా టుడే సర్వే: బీజేపీకి ఓటమి తప్పదు, జగన్-కేసీఆర్ కలిసినా మోడీని కాపాడలేరు?
కేటీఆర్ ట్వీట్
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అద్భుత విజయం సాధిస్తుందని రిపబ్లిక్ టీవీ - సీ ఓటరు ప్రీపోల్ సర్వేలో తేలిందని, ఇది ఎంతో హర్షించదగ్గ విషయమని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ మేరకు రిపబ్లిక్ టీవీ - సీవోటరు సర్వే క్లిప్పింగ్‌ను పోస్ట్ చేశారు.

సీ ఓటరు తప్పు చెప్పింది.. ఇప్పుడే సెలబ్రేట్ చేసుకోకండి
కేటీఆర్ ట్వీట్‌కు నెటిజన్లు స్పందించారు. ఏపీలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి 19 సీట్లు వస్తున్నాయని, టీఆర్ఎస్ 16 సీట్లు, వైసీపీ 19 సీట్లు, మజ్లిస్ 1 సీటు.. ఇలా ఫెడరల్ ఫ్రంట్‌కు 36 సీట్లు అప్పుడే వచ్చాయని మరో నెటిజన్ పేర్కొన్నారు. ఇదే సీ ఓటరు గత అసెంబ్లీ ఎన్నికల్లో తప్పుడు ఎగ్జిట్ పోల్స్ చెప్పిందని మరో నెటిజన్ గుర్తు చేశారు. కాబట్టి ఇప్పుడే సెలబ్రేట్ చేసుకోకండి అని కేటీఆర్‌కు సూచించారు. ఇదే రిపబ్లిక్ టీవీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెరాసకు 33 శాతం, కాంగ్రెస్ పార్టీకి 32 సాతం అని చెప్పిందని, ఇప్పుడు మీకు ఫేవర్‌గా చెప్పిందని ట్వీట్స్ పెట్టడమా, మీకు 16 సీట్లు రావొచ్చు.. కానీ క్రెడిబులిటీ లేని సర్వేలను ఎంకరేజ్ చేయడం కరెక్ట్ కాదని మరో నెటిజన్ పేర్కొన్నారు.

ప్రాంతీయ పార్టీలదే హవా
ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే తెలంగాణలో యూపీఏకు 29 శాతం, ఎన్డీయేకు 12.7 శాతం, టీఆర్ఎస్ పార్టీకి 42.4 శాతం, మజ్లిస్ పార్టీకి 7.7 శాతం ఓట్లు వస్తాయని ఈ సర్వే తెలిపింది. తెరాసకు 16 సీట్లు, మజ్లిస్‌కు 1 సీటు వస్తుందని, యూపీఏ, ఎన్డీయేలకు సీట్లేమీ రావని తేల్చింది. అలాగే, ఏపీలో వైసీపీకి 19 సీట్లు, టీడీపీకి 6 సీట్లు, వైసీపీకి 41.3 శాతం ఓట్లు, టీడీపీకి 33.1 శాతం ఓట్లు, ఇతరులకు 8.6 శాతం ఓట్లు వస్తాయని ఈ సర్వే తేల్చింది.