వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణా చరిత్రలోనే భారీగా 20వేల కోట్లకు పైగా పెట్టుబడితో అమెజాన్ డేటా సెంటర్లు ..

|
Google Oneindia TeluguNews

ప్రపంచ ప్రఖ్యాత ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తెలంగాణలో భారీగా పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిందని తెలంగాణా ఐటీ శాఖామంత్రి కేటీఆర్ పేర్కొన్నారు . ప్రపంచంలోనే అతిపెద్ద క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్‌ఫామ్‌లలో ఒకటైన అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఎడబ్ల్యుఎస్) 20,761 కోట్ల రూపాయల పెట్టుబడితో రాష్ట్రంలో బహుళ డేటా సెంటర్లను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిందని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. తెలంగాణా రాష్ట్రంలో దాదాపు 20వేల కోట్ల పెట్టుబడితో మూడు డేటా సెంటర్లు నిర్మించేందుకు సిద్ధమైందని తెలంగాణా మణిహారంలో మరో దిగ్గజ సంస్థ చేరిందని కేటీఆర్ పేర్కొన్నారు .

హైదరాబాద్, విజయవాడ నగరాల మధ్య హైస్పీడ్ రైలు ...అభివృద్ధే లక్ష్యం : మంత్రి కేటీఆర్హైదరాబాద్, విజయవాడ నగరాల మధ్య హైస్పీడ్ రైలు ...అభివృద్ధే లక్ష్యం : మంత్రి కేటీఆర్

 తెలంగాణ చరిత్రలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు స్వాగతం అన్న మంత్రి కేటీఆర్

తెలంగాణ చరిత్రలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు స్వాగతం అన్న మంత్రి కేటీఆర్

తెలంగాణ చరిత్రలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ప్రకటించినందుకు సంతోషంగా ఉందని , వరుస సమావేశాల తరువాత, తెలంగాణలో బహుళ డేటా సెంటర్లను ఏర్పాటు చేయడానికి అమెజాన్ వెబ్ సర్వీసెస్ రూ .207.61 బిలియన్ (77 2.77 బిలియన్) పెట్టుబడిని ఖరారు చేసిందని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు . అమెజాన్ డేటా సెంటర్లు 2022 మధ్య నాటికి ప్రారంభించబడతాయని ఆయన పేర్కొన్నారు. హ్యాపెనింగ్ హైదరాబాద్ అంటూ ముఖ్యమంత్రి కెసీఆర్ కుమారుడు సమాచార సాంకేతిక, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ ట్వీట్ చేశారు.

హైదరాబాద్ శివార్లలో డేటా సెంటర్ల నిర్మించేందుకు అమెజానా డేటా సర్వీసెస్ రెడీ

హైదరాబాద్ శివార్లలో డేటా సెంటర్ల నిర్మించేందుకు అమెజానా డేటా సర్వీసెస్ రెడీ

హైదరాబాద్ శివార్లలో డేటా సెంటర్ల నిర్మించేందుకు అమెజానా డేటా సర్వీసెస్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు . హైదరాబాద్‌లో అమెజాన్ మూడు జోన్లను ప్రాంతాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేటీఆర్ కార్యాలయం నుండి అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఆసియా-పసిఫిక్ ప్రాంతం 2022 మధ్య నాటికి హైదరాబాద్‌లో కార్యకలాపాలను ప్రారంభిస్తుందని భావిస్తున్నారు. అమెజాన్ జోన్లు హైదరాబాద్ లో మూడు చోట్ల బహుళ డేటా సెంటర్లను ప్రారంభించనుంది.

 అమెజాన్ వెబ్ సర్వీసెస్ నుండి రూ .20,761 కోట్ల పెట్టుబడి

అమెజాన్ వెబ్ సర్వీసెస్ నుండి రూ .20,761 కోట్ల పెట్టుబడి

అమెజాన్ వెబ్ సర్వీసెస్ నుండి రూ .20,761 కోట్ల పెట్టుబడి కారణంగా , ముందు భవిష్యత్తులో రాష్ట్రంలో డేటా సెంటర్లను ఏర్పాటు చేయాలని చూస్తున్న ఇతర సంస్థలను తెలంగాణా రాష్ట్రం ఆకర్షిస్తుందని ఒక అంచనా. అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్ల స్థాపన తెలంగాణ యొక్క డిజిటల్ ఎకానమీ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) రంగానికి అనేక రకాలుగా తోడ్పడుతుందని కెటిఆర్ ఉటంకిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేశారు . ఒక ప్రాంతంలో డేటా సెంటర్లను స్థాపించడం వల్ల ఇ-కామర్స్, ప్రభుత్వ రంగం, బ్యాంకింగ్ మరియు ఆర్థిక సేవలు మరియు బీమా (బిఎఫ్‌ఎస్‌ఐ), ఐటి తదితర రంగాల కార్యకలాపాలు పెరుగుతాయని తెలుస్తుంది .

తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు అయినప్పటి నుండి అతిపెద్ద పెట్టుబడి

తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు అయినప్పటి నుండి అతిపెద్ద పెట్టుబడి

ఐటి రంగంలో హైదరాబాద్ అత్యధిక వృద్ధి రేటును నమోదు చేసిందని, అనేక వినూత్న స్టార్టప్‌లు, సంస్థలు మరియు నైపుణ్యం కలిగిన యువతకు హైదరాబాద్ కేరాఫ్ గా ఉందని కెటిఆర్ చెప్పారు.అందుకే అమెజాన్ వెబ్ సర్వీసెస్ హైదరాబాద్ ను ఎన్నుకుందని అన్నారు . తెలంగాణ ప్రభుత్వం అందించిన మద్దతు, బలమైన ఇండస్ట్రియల్ పాలసీ , మరియు అమెజాన్ అవసరాలు అందుకు తగిన విధంగా ఉన్నాయని చెప్పారు . జూన్ 2014 లో తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు అయినప్పటి నుండి రాష్ట్రం ఆకర్షించిన అతిపెద్ద పెట్టుబడి అమెజాన్ వెబ్ సర్వీసెస్ నుండి కావటం విశేషం .

మూడు చోట్ల భూకేటాయింపులకు స్థల పరిశీలన

మూడు చోట్ల భూకేటాయింపులకు స్థల పరిశీలన

ఈ పెట్టుబడి ఇతర సాంకేతిక పెట్టుబడులను ఆకర్షించడానికి బలమైన సాధనంగా పనిచేస్తుందని చెప్తున్నారు . ఈ పెట్టుబడి హైదరాబాద్‌లో అతిపెద్ద కార్యాలయాన్ని కలిగి ఉన్న అమెజాన్‌తో తెలంగాణకు ఉన్న సంబంధాన్ని మరింత బలపరుస్తుందని కేటీఆర్ భావిస్తున్నారు .శంషాబాద్ మండలంలోని చందన్‌వల్లిలో, కందుకూరు మండలంలోని మీర్‌ఖాన్‌పేట గ్రామంలో, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని రవిర్యాల వద్ద అమెజాన్ డేటా సెంటర్ లకు భూమిని కేటాయించేందుకు తెలంగాణా సర్కార్ నిర్ణయించింది. దీంతో శరవేగంగా అమెజాన్ తమ డేటా సెంటర్లను ఏర్పాటు చెయ్యనుండటం నిజంగా తెలంగాణా రాష్ట్రానికి గుడ్ న్యూస్ .

English summary
The Telangana government on Friday announced that Amazon Web Services (AWS), one of the largest cloud computing platforms in the world, has come forward to set up multiple data centres in the state at an estimated investment of Rs 20,761 crore.“Happy to announce the largest Foreign Direct Investment (FDI) in the history of Telangana! After a series of meetings, AWS has finalised investment of Rs 207.61 bn ($ 2.77 bn) to set up multiple data centres in Telangana. KTR said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X