సిద్దిపేట వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మా మధ్య విభేదాల్లేవు, 15 ఏళ్లు కేసీఆరే సీఎం: హరీష్-కేటీఆర్ పరస్పర పొగడ్తలు

|
Google Oneindia TeluguNews

సిరిసిల్ల: తాను, హరీష్ రావు అన్నదమ్ముల్లా పెరిగామని ఆపద్ధర్మ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గురువారం వెల్లడించారు. సిరిసిల్ల నియోజకవర్గం కార్యకర్తలతో హరీష్ రావు, కేటీఆర్‌లు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. కరీంనగర్‌లో 1991 హరీష్ ఇంట్లో ఉన్నప్పటి నుంచి కలిసి పెరిగామని చెప్పారు.

తామిద్దరం అభివృద్ధిలో మాత్రమే పోటీ పడుతున్నామని చెప్పారు. మా మధ్య ఎలాంటి పొరపొచ్ఛలు లేకుండా కలిసి కట్టుగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. హరీష్ రావు కాలంతో పోటీపడి కాళేశ్వరం ప్రాజెక్టును పరుగెత్తిస్తున్నారని చెప్పారు. కేసీఆర్ అప్పచెప్పిన బాధ్యతల్లో తాము భాగస్వామ్యం అవుతున్నామని తెలిపారు.

అడ్డమైన దొంగ చంద్రబాబుతో పొత్తా, తూ.. మీ బతుకు చెడా: కేసీఆర్ తిట్లదండకంఅడ్డమైన దొంగ చంద్రబాబుతో పొత్తా, తూ.. మీ బతుకు చెడా: కేసీఆర్ తిట్లదండకం

 మా మధ్య పొరపొచ్చలు లేవు

మా మధ్య పొరపొచ్చలు లేవు

కేసీఆర్ మరో పదిహేనేళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని తాను, హరీష్ రావు కోరుకుంటున్నామని కేటీఆర్ తెలిపారు. హరీష్ రావుకు, తనకు మధ్య ఎలాంటి పొరపొచ్ఛలు లేవని చెప్పారు.

కేటీఆర్ పైన హరీష్ రావు ప్రశంసల జల్లు

కేటీఆర్ పైన హరీష్ రావు ప్రశంసల జల్లు

మంత్రి కేటీఆర్ పైన మంత్రి హరీష్ రావు కూడా ప్రశంసలు కురిపించారు. ఆత్మహత్యల సిరిసిల్లను సిరుల సిరిసిల్లగా మార్చిన ఘనత కేటీఆర్‌దేనని చెప్పారు. సిద్దిపేట రికార్డ్ మెజార్టీని కేటీఆర్ దాటేలా అందరూ పని చేయాలని సూచించారు. సిరిసిల్ల అభివృద్ధి వెనుక 30 ఏళ్ల శ్రమ ఉందని చెప్పారు.

 సిద్దిపేట రికార్డ్‌ను దాటి కేటీఆర్‌ను గెలిపించాలి

సిద్దిపేట రికార్డ్‌ను దాటి కేటీఆర్‌ను గెలిపించాలి

ఓ వైపు తెలంగాణ రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడుల కోసం దేశ విదేశాల్లో పర్యటిస్తూ విజయవంతంగా తన శాఖను నిర్వర్తిస్తూనే మరోవైపు సిరిసిల్లను అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిపారని హరీష్ రావు కొనియాడారు. కేసీఆర్ అప్పగించిన బాధ్యతలను తాము నిర్వర్తిస్తున్నామని చెప్పారు. సిద్దిపేటతో పోటీ పడేలా కేటీఆర్‌ను అత్యధిక ఓట్లతో గెలిపించాలన్నారు. తాము అభివృద్ధిలో పోటీ పడుతున్నట్లుగా కార్యకర్తలు కూడా పోటీ పడి ఓటింగ్ శాతం పెరిగేలా చూడాలన్నారు.

 విభేదాల ప్రచారం నేపథ్యంలో

విభేదాల ప్రచారం నేపథ్యంలో

సిరిసిల్లలో ఒకే వేదికపై హరీష్ రావు, కేటీఆర్ కనిపించడంతో తెరాస కార్యకర్తల ఆనందానికి అంతేలేదు. వారిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారం నేపథ్యంలో పరస్పరం ప్రశంసలు కురిపించుకోవడం గమనార్హం. ఇటీవల హరీష్ రావు పార్టీ కార్యకర్తల భేటీలో ఉద్వేగానికి లోనై కంటతడి పెట్టడం కూడా చర్చనీయాంశంగా మారింది.

English summary
Telangana Care Taker Ministers Harish Rao and KT Rama Rao praised each other in Siricilla TRS party meeting on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X