హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆంధ్రా యువకుడి అభిమానానికి ఫిదా! కేటీఆర్ ధన్యవాదాలు, అసలేం చేశారంటే.?

|
Google Oneindia TeluguNews

Recommended Video

ఆంధ్రా యువకుడి కి కేటీఆర్ ధన్యవాదాలు

హైదరాబాద్: ఓ ఆంధ్రా యువకుడు చేసిన పనికి తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత కల్వకుంట్ల తారక రామారావు అభినందించకుండా ఉండలేకపోయారు. తెలంగాణలో మరోసారి టీఆర్ఎస్ పార్టీయే అధికారంలోకి రావాలని, కేసీఆరే ముఖ్యమంత్రి కావాలని రోహిత్ కుమార్ రెడ్డి అనే ఆంధ్రా యువకుడు విజయవాడ నుంచి హైదరాబాద్‌కు పాదయాత్ర చేస్తున్నారు.

మీ ప్రేమకు, అభిమానానికి..

మీ ప్రేమకు, అభిమానానికి..

ఈ విషయం తెలిసిన కేటీఆర్ ఫిదా అయ్యారు. ట్విట్టర్ వేదికగా అతనికి ధన్యవాదాలు తెలిపారు. ‘రోహిత్ రెడ్డి నీ ప్రేమకు, అభిమానానికి ధన్యవాదాలు' అని కేటీఆర్ పేర్కొన్నారు.

విజయవాడ-హైదరాబాద్

అంతేగాక, ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రోహిత్.. కేసీఆర్, టీఆర్ఎస్‌కు మద్దతుగా విజయవాడ నుంచి పాదయాత్ర చేస్తున్నారు' అని కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించారు.

కేటీఆర్ రీట్వీట్..

కాగా, రోహిత్ రెడ్డి.. కేసీఆర్, టీఆర్ఎస్‌కు మద్దతుగా మాట్లాడిన వీడియోను శ్రీనివాస్ నారాయణ్ అనే నెటిజన్ ట్వీట్ చేయగా దాన్ని కేటీఆర్ రీట్వీట్ చేస్తూ ధన్యవాదాలు తెలిపారు.

 యువకుడి ఛాతీపై కేటీఆర్ టాటూ

యువకుడి ఛాతీపై కేటీఆర్ టాటూ

తెలంగాణ కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని, టీఆర్ఎస్సే అధికారంలోకి రావాలని రోహిత్ తన వీడియోలో ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తన ఛాతిపై వేసుకున్న కేటీఆర్ టాటూను కూడా అతడు వీడియోలు చూపిస్తూ తన ఆకాంక్షను తెలియజేశారు.

English summary
TRS senior leader KT Rama rao on Monday says special thanks Andhra Pradesh youngster.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X