వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెజారీటి స్థానాలు గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు : కేటీఆర్

|
Google Oneindia TeluguNews

టీఆర్ఎస్ పార్టీకి మెజారీటి స్థానాల్లో గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈనేపథ్యంలోనే ప్రజలే అంతిమ నిర్ణేతలు కాబట్టి, వారీ తీర్పును గౌరవిస్తామని ఆయన చెప్పారు. ఇక కవిత ఓటమికి సంబంధించి అడిగిన నేపథ్యంలో ఇంకా రెండు చోట్ల లెక్కింపు జరుగుతుందని దానిపై ఇప్పుడే మాట్లాడని ఆయన స్పష్టం చేశారు..ఇక ఆంధ్రప్రదేశ్‌లో గెలిచిన వైఎస్ జగన్‌కు ఇదివరకే అభినందనలు తెలిపామని చెప్పారు.

అయితే ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓటమిపై వ్యాఖ్యానించేందుకు ఆయన నిరాకరించారు. తమకు ఎవరిపైన వ్యక్తిగతంగా ద్వేషాలు లేవని అన్నారు. మరోవైపు ఓటమిపాలైన వారి గురించి మాట్లాడడం భావ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. 16 సీట్లు సాధించాలని భావించామని అందుకు అనుగుణంగా పార్టీ నేతలు కార్యకర్తలు కష్టపడ్డారని అన్నారు. అయితే పలు చోట్ల ఓటమికి గల కారణాలను త్వరలో సమీక్షస్తామని కేటీఆర్ చెప్పారు.

 కేసీఆర్ కు దిమ్మతిరిగే షాక్ .. మల్కాజ్ గిరిలో రేవంత్ రెడ్డి విజయం కేసీఆర్ కు దిమ్మతిరిగే షాక్ .. మల్కాజ్ గిరిలో రేవంత్ రెడ్డి విజయం

KTR says thanks to the people for winning

కాగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన పార్లమెంట్ స్థానాల్లో ప్రచారంపై ద‌ృష్టి సారించారు. ఈనేపథ్యంలోనే అన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల పర్యటనలు చేశారు. దీంతో పాటు సారు..కారు...పదహారు నినాదంలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.కాగా పార్లమెంట్ ఎన్నికల్లో కేటీఆర్ చెల్లెలు నిజమాబాద్ ఎంపీ కవిత మాత్రం ఓటమి అంచున ఉండడంతో కేటీఆర్ పెద్దగా స్పందించలేదు. దీంతోపాటు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్నికైన తర్వాత అటు టీచర్ ఎమ్మెల్సీల ఓటమితో పాటు పార్లమెంట్ స్థానాలను కోల్పోయారు.

English summary
TRS Working President KTR said thanks to the people who elected the trs mp's and he did not agree to talk about ap cm chandrababu naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X