వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాకైతే సమాచారం లేదు: మెట్రో ప్రారంభంపై బాంబుపేల్చిన మంత్రి కేటీఆర్

మెట్రో రైలు ప్రాజెక్టుపై తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బుధవారం బాంబు పేల్చారు! మెట్రో ప్రారంభానికి అంతా సిద్ధమైందని, ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించి, ప్రయాణిస్తారని వార్తలు వచ్చ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మెట్రో రైలు ప్రాజెక్టుపై తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బుధవారం బాంబు పేల్చారు! మెట్రో ప్రారంభానికి అంతా సిద్ధమైందని, ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించి, ప్రయాణిస్తారని వార్తలు వచ్చాయి.

Recommended Video

Hyderabad Metro : HYD మెట్రో తరువాతే ఏదయినా ! ఎందుకో తెలుసా ? | Oneindia Telugu

చదవండి: హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించనున్న మోడీ: రేట్లు ఇలా, ఏటా ధరలు పెంచవచ్చు!

షాకిచ్చిన కేటీఆర్

షాకిచ్చిన కేటీఆర్

దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆయన వ్యాఖ్యలను బట్టి మెట్రో రైలు ఈ నెల 28న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించే విషయంలో సందిగ్ధత కనిపిస్తోంది. మెట్రో ప్రారంభంపై ఎలాంటి సమాచారం లేదని వ్యాఖ్యానించడం గమనార్హం.

ఇదీ కేటీఆర్ మాట

ఇదీ కేటీఆర్ మాట

ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు హాజరయ్యేందుకు వస్తున్న ప్రధాని మోడీ మెట్రో రైలును ప్రారంభిస్తారని ప్రచారం జరుగుతోందని, కానీ ఇప్పటి వరకు మెట్రో రైలు ప్రారంభంపై పీఎంవో నుంచి తమకు సమాచారం లేదని కేటీఆర్‌ అన్నారు.

ఎస్పీజీకి వచ్చిన వివరాలతోనే

ఎస్పీజీకి వచ్చిన వివరాలతోనే

ఎస్పీజీకి (స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్) వచ్చిన వివరాలతోనే తాము మెట్రో ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు కేటీఆర్‌ స్పష్టం చేశారు. కానీ ప్రధాని కార్యాలయం నుంచి మాత్రం స్పష్టత లేదన్నారు.

ఇదీ ప్రచారం

ఇదీ ప్రచారం

కాగా, నవంబర్ 28న, మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని, అక్కడి నుంచి హెలికాప్టర్లో మియాపూర్ రైల్వే స్టేషన్ వచ్చి అక్కడ మెట్రోను ప్రారంభించి, ఆ తర్వాత అందులో ప్రయాణిస్తారని ప్రచారం సాగుతోంది.

చదవండి: హైదరాబాద్ మెట్రో ఎఫెక్ట్: అనూహ్యంగా పెరిగిన ధరలు, మియాపూర్ టు నాగోల్

చదవండి: మోడీ చేతుల మీదుగా మెట్రో సస్పెన్స్: అమీర్‌పేట స్టేషన్ అదుర్స్, విమానస్థాయి వసతులు ఇవీ..

English summary
Telangana Rastra Samithi leader and Minister KT Rama Rao shocking comments on Metro train inauguration.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X