వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేటీఆర్‌ను సీఎం చేయాలి.. మొన్న మంత్రివర్గ సమావేశం, నేడు బోధన్ ఎమ్మెల్యే కామెంట్స్

|
Google Oneindia TeluguNews

కేసీఆర్ తర్వాత సీఎం అభ్యర్థి ఎవరు.. దీనిపై గతకొంతకాలంగా చర్చ జరుగుతోంది. కానీ పార్టీ, నేతలు మాత్రం మరో పదేళ్లు కేసీఆర్ సీఎంగా ఉంటారని చెబుతూ వస్తోన్నారు. ఇటీవల కేటీఆర్.. సహచర మంత్రులకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. పేరు అది అయినా.. మంత్రివర్గ సమావేశం జరిగినట్టు 8 గంటలపాటు చర్చించారు. ఇదిలా ఉంటే బోధన్ ఎమ్మెల్యే షకీల్ తన మనసులోని మాటను బయటపెట్టారు.

కేటీఆర్‌ను సీఎం చేయండి..

కేటీఆర్‌ను సీఎం చేయండి..

కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్‌ను సీఎం చేయాలని కొందరు కోరుతున్నారు. ఆ వరసలో బోధన్ ఎమ్మెల్యే షకీల్ చేరారు. కరోనా వైరస్ నిర్మూలనలో భాగంగా రెండు అంబులెన్సులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేటీఆర్‌ను సీఎం చేయాలని కామెంట్ చేశారు. షకీల్ కామెంట్స్ రాష్ట్రవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. ఇటు టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

 ప్రజంటేషన్.. మంత్రివర్గ సమావేశమా..?

ప్రజంటేషన్.. మంత్రివర్గ సమావేశమా..?


ఈ నెల 12వ తేదీన ప్రగతి భవన్‌లో ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్ పాలసీలపై మంత్రులకు కేటీఆర్ ప్రజంటేషన్ ఇచ్చారు. కేసీఆర్ ఆదేశాలతో ప్రజంటేషన్ ఇచ్చానని కేటీఆర్ చెప్పిన.. మంత్రివర్గ సమావేశం మాదిరిగా 8 గంటలపాటు భేటీ జరిగింది. మంత్రులు, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, అధికారులు పాల్గొనగా.. ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్ పాలసీలపై మంత్రులకు కేటీఆర్ వివరించారు. ఆ సమయంలో కేసీఆర్ ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఉన్నారు.

సీఎం లేకుండా.. మంత్రివర్గ సమావేశమా..?

సీఎం లేకుండా.. మంత్రివర్గ సమావేశమా..?

దీనిని విపక్షాలు తప్పుపట్టాయి. సీఎం లేకుండా మంత్రివర్గ సమావేశమా.. అని మండిపడ్డాయి. మంత్రివర్గ సమావేశం కుటుంబ వ్యవహారమా అని ప్రశ్నిస్తున్నారు. దీనిపై అధికార పార్టీ పెద్దగా స్పందించలేదు. కానీ కేసీఆర్ తర్వాత సీఎం కేటీఆర్ అనే సంకేతాలను ఇచ్చినట్టు ప్రవర్తిస్తోంది. ఇది చిన్న విషయం అని.. కామెంట్ చేసి రచ్చ రచ్చ చేయడం ఎందుకని మిన్నకుండి పోయిందనే వారు కూడా ఉన్నారు.

గులాబీ దళపతి మదిలో ఏముంది..?

గులాబీ దళపతి మదిలో ఏముంది..?

కేటీఆర్ తనకంటూ ఒక టీమ్ రూపొందించుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఆ గ్రూపులోని వారే కొందరు కామెంట్లు పెడుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. షకీల్ వంతు రాగా.. ఆయన కామెంట్ చేశారని పేర్కొంటున్నారు. కానీ రకరకాలుగా జరుగుతోన్న ఊహాగానాలపై గులాబీ దళం మాత్రం స్పందించడం లేదు. దీంతో మౌనం అర్థాంగీకారం అనే చర్చ కూడా జరుగుతోంది. ప్రస్తుతం అయితే సీఎం మార్పు ఉండకపోవచ్చునని.. కానీ ముందు జాగ్రత్తగా గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. మొత్తానికి అయితే ఈ ఎపిసోడ్ ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే ఉంది.

English summary
trs leader, minister ktr should be chief minister bodhan mla shakeel comment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X