వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేటీఆర్ సీఎం అయితే.. మొన్న షకీల్, నేడు దానం నాగేందర్.. పెరుగుతోన్న మద్దతు

|
Google Oneindia TeluguNews

తెలంగాణ సీఎంగా కేటీఆర్‌ను చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. మొన్న బోదన్ ఎమ్మెల్యే షకీల్ కామెంట్ చేయగా.. నేడు దానం నాగేందర్ స్పందించారు. కేటీఆర్‌ సీఎం అయితే తప్పేంటి అని వ్యాఖ్యానించారు. దీంతో కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేయాలనే వారి మద్దతు పెరుగుతోంది. కేటీఆర్‌ను సీఎం చేయాలనే డిమాండ్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

త్వరలోనే మంత్రి కేటీఆర్ తెలంగాణలో ముఖ్యమంత్రి పదవీ చేపట్టబోతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాటికి మరింత బలం చేకూర్చేలా నేతలు మాట్లాడుతున్నారు. టీఆర్ఎస్ నేత దానం నాగేందర్ కూడా కామెంట్ చేశారు. ముఖ్యమంత్రి కావడానికి కావాల్సిన అన్ని అర్హతలు కేటీఆర్‌కు ఉన్నాయని చెప్పారు. కేటీఆర్ సీఎం అయితే తప్పేంటన్న దానం.. ముఖ్యమంత్రి కావాలని ఆ భగవంతున్ని కోరుకున్నానని తెలిపారు.

ktr should be cm, danam nagender comments..

వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్ వినాయకుడిని దానం నాగేందర్ దర్శించుకున్నారు. 9 అడుగుల విగ్రహం ఏర్పాటుకు అనుమతి ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కరోనా వైరస్ వ్యాక్సిన్‌ తొందరగా రావాలని దానం నాగేందర్ ఆకాంక్షించారు. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలన్నారు. దేశంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుందని వివరించారు.

Recommended Video

Telangana Floods : KTR Announces Rs 25 Crore For Warangal!

మంత్రి కేటీఆర్‌ను సీఎం చేయాలని కొందరు టీఆర్ఎస్ నేతలు కోరుతున్నారు. ఆ వరసలో బోధన్ ఎమ్మెల్యే షకీల్ చేరారు. కేటీఆర్‌ను సీఎం చేయాలని వారం క్రితం తన నియోజకవర్గంలో కామెంట్ చేశారు. షకీల్ కామెంట్స్ రాష్ట్రవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. ఇటు టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

English summary
minister ktr should be cm, trs leader danam nagender comment. he have all qualities of chief minister post.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X