హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రతిష్టాత్మక కంపెనీల డెస్టినేషన్‌గా హైదరాబాద్, దుర్గం చెరువు మీదుగా వేలాడే వంతెన: కేటీఆర్ (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా మార్చేందుకు పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు సీఎం కేసీఆర్ రూపకల్పన చేస్తున్నారని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ముఖ్యంగా మౌలిక వసతుల కల్పన రంగంలో హైదరాబాద్ మొదటి స్ధానంలో ఉందన్నారు.

మాదాపూర్ ఇనార్బిట్ మాల్ ఎదురుగా మై హోం నిర్మాణ సంస్థ కొత్తగా నిర్మించిన 'మైహోం అభ్ర' నివాస సముదాయాన్ని సోమవారం మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ హైటెక్ సిటీ ప్రాంతంలోని దుర్గం చెరువు మీదుగా వేలాడే వంతెన నిర్మించనున్నట్లు తెలిపారు.

దుర్గం చెరువు మీదుగా వేలాడే వంతెన: కేటీఆర్

దుర్గం చెరువు మీదుగా వేలాడే వంతెన: కేటీఆర్

ఇది హైదరాబాద్ నగరానికే మణిహారం అవుతుందన్నారు. ఈ వేలాడే వంతెన నిర్మాణం ద్వారా ఈ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీ కూడా బాగా తగ్గుతోందని తెలిపారు. మైహోం లాంటి సంస్ధ తన ప్రాజెక్టులను ఇతర నగరాలకు సైతం విస్తరించాలని ఆకాంక్షించారు.

దుర్గం చెరువు మీదుగా వేలాడే వంతెన: కేటీఆర్

దుర్గం చెరువు మీదుగా వేలాడే వంతెన: కేటీఆర్

16 నెలల తమ ప్రభుత్వ హయాంలో ఎన్నో ప్రతిష్టాత్మక కంపెనీలు హైదరాబాద్‌ను తమ డెస్టినేషన్‌గా చేసుకున్నాయన్నారు. వెనుకబడిన పాలమూరు జిల్లా నుంచి వచ్చిన జూపల్లి రామేశ్వర్‌రావు ఎంతో కష్టపడి ఉన్నత స్థానానికి చేరుకోవడం అభినందనీయమన్నారు.

దుర్గం చెరువు మీదుగా వేలాడే వంతెన: కేటీఆర్

దుర్గం చెరువు మీదుగా వేలాడే వంతెన: కేటీఆర్

బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ మాట్లాడుతూ మైహోం సంస్థతో తనకు మంచి అనుబంధం ఉందన్నారు. అంతక ముందు గోపిచంద్‌తో కలిసి మంత్రి కేటీఆర్ బ్యాడ్మింటన్ ఆడారు. చివరగా మైహోం సంస్ధ అధినేత జూపల్లి రామేశ్వర్ రావు మాట్లాడుతూ హైదరాబాద్‌లో స్థిరాస్తి రంగానికి మంచి భవిష్యత్తు ఉందన్నారు. హైదరాబాద్ విశ్వనగరంగా ఎదిగేందుకు అన్ని అవకాశాలున్నాయన్నారు.

దుర్గం చెరువు మీదుగా వేలాడే వంతెన: కేటీఆర్

దుర్గం చెరువు మీదుగా వేలాడే వంతెన: కేటీఆర్

బెంగుళూరు, హైదరాబాద్‌లతో పోలిస్తే హైదరాబాద్‌లో స్థిరాస్తి విలుత తక్కువగా ఉందన్నారు. ఇక తాజాగా నిర్మించిన 'మైహోం అభ్ర'లో లగ్జరీ సౌకర్యాలు ఉన్నాయన్నారు. పుష్పాల గూడ వద్ద 2500 ఆపార్ట్‌మెంట్ ప్లాట్స్, మాదాపూర్‌లోనే 36 అంతస్తులతో 7 సిగ్నేచర్ టవర్లు నిర్మించబోతున్నామన్నారు.

English summary
KTR Speech at My Home Abhra apartments inauguration at Madhapur.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X