హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీలో ‘డీలింక్’: తైవాన్‌లో కెటిఆర్ బిజీ(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వైర్‌లెస్ కంపెనీల్లో ప్రపంచ దిగ్గజం డీలింక్ కంపెనీ తెలంగాణలో తమ కంపెనీని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం, డీలింక్ మధ్య ఒప్పందం కుదిరింది. తైవాన్‌లో జరిగిన ఇండియా తైవాన్ కోఆపరేషన్ ఫోరమ్‌లో రాష్ట్ర ఐటీ మంత్రి కే తారకరామారావు సమక్షంలో డీలింక్ కంపెనీ ప్రతినిధితో ప్రభుత్వం తరఫున ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ ఈ ఒప్పందంపై సంతకం చేశారు.

ఈ ఎంవోయూ ద్వారా డీలింక్ కంపెనీ రూ.350 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దీని వల్ల 1000 మందికి ప్రత్యక్ష ఉపాధి, అంతకు ఎన్నోరెట్లు పరోక్షంగా ఉద్యోగాల కల్పన జరగనుంది. ఎంవోయూ కుదుర్చుకునేందుకు డీలింక్ కంపెనీ సీఈవో డగ్లస్ ఓసియోతో సమావేశమైన మంత్రి కేటీఆర్ కంపెనీ ఏర్పాటుకు అన్నివిధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు.

ఒప్పందం అనంతరం కెటిఆర్ మాట్లాడుతూ.. ప్రపంచ ఐటి, ఎలక్ట్రానిక్స్ దిగ్గజాలకు తెలంగాణ పెట్టుబడుల కేంద్రంగా మారుతోందని, ఈ రోజు డీలింక్‌తో కుదిరిన ఒప్పందం దీనికి నిదర్శనమని అన్నారు. ఈ ఒప్పందం ద్వారా డీలింక్ ఇండియా హైదరాబాద్‌లోని తన కార్యకలాపాలను విస్తృత పరచడంతోపాటు, ప్రపంచ స్థాయి పరిశోధనా కేంద్రాన్ని(ఆర్ అండ్ డి) ఏర్పాటు చేస్తుందని తెలిపారు.

వీటితోపాటు నెట్ వర్కింగ్ ట్రైయినింగ్ సెంటర్ పేరుతో ఒక అకాడమీ ఏర్పాటు చేసి స్థానిక యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తుందని తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా తెలంగాణ ప్రభుత్వం డీ లింక్ కంపెనీ వైఫై ఏర్పాట్లలో పని చేస్తుందని తెలిపారు. అంతేగాక, ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయాల్లో అధునాతన సైబర్ సెక్యూరిటీ ప్రమాణాలతో వైర్‌లెస్ సేవలను అందించేందుకు అవకాశం లభిస్తుందని తెలిపారు.

ప్రపంచ వ్యాప్తంగా పేరున్న తమ కంపెనీ 1990లో భారత్‌లోకి ప్రవేశించిందని, 2001లో స్టాక్ ఎక్సెంజ్‌లో నమోదు అయిందని రెండువేల మంది ఉద్యోగులు ఉన్నట్టు కంపెనీ సిఇఓ డగ్లాస్ తెలిపారు. హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్ హబ్ అని, ఇక్కడ నూతన అవకాశాలు, ప్రెష్ టాలెంట్, మౌలిక వసతులు తమను హైదరాబాద్ పై దృష్టి సారించేలా చేశాయని డగ్లాస్ హోసియా తెలిపారు.

తైవాన్ ప్రతినిధులతో కెటిఆర్

తైవాన్ ప్రతినిధులతో కెటిఆర్

వైర్‌లెస్ కంపెనీల్లో ప్రపంచ దిగ్గజం డీలింక్ కంపెనీ తెలంగాణలో తమ కంపెనీని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం, డీలింక్ మధ్య ఒప్పందం కుదిరింది.

తైవాన్ ప్రతినిధులతో కెటిఆర్

తైవాన్ ప్రతినిధులతో కెటిఆర్


తైవాన్‌లో జరిగిన ఇండియా తైవాన్ కోఆపరేషన్ ఫోరమ్‌లో రాష్ట్ర ఐటీ మంత్రి కే తారకరామారావు సమక్షంలో డీలింక్ కంపెనీ ప్రతినిధితో ప్రభుత్వం తరఫున ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ ఈ ఒప్పందంపై సంతకం చేశారు.

తైవాన్ ప్రతినిధులతో కెటిఆర్

తైవాన్ ప్రతినిధులతో కెటిఆర్

ఈ ఎంవోయూ ద్వారా డీలింక్ కంపెనీ రూ.350 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దీని వల్ల 1000 మందికి ప్రత్యక్ష ఉపాధి, అంతకు ఎన్నోరెట్లు పరోక్షంగా ఉద్యోగాల కల్పన జరగనుంది.

తైవాన్ ప్రతినిధులతో కెటిఆర్

తైవాన్ ప్రతినిధులతో కెటిఆర్

ఎంవోయూ కుదుర్చుకునేందుకు డీలింక్ కంపెనీ సీఈవో డగ్లస్ ఓసియోతో సమావేశమైన మంత్రి కేటీఆర్ కంపెనీ ఏర్పాటుకు అన్నివిధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు.

తైవాన్ ప్రతినిధులతో కెటిఆర్

తైవాన్ ప్రతినిధులతో కెటిఆర్

ఒప్పందం అనంతరం కెటిఆర్ మాట్లాడుతూ.. ప్రపంచ ఐటి, ఎలక్ట్రానిక్స్ దిగ్గజాలకు తెలంగాణ పెట్టుబడుల కేంద్రంగా మారుతోందని, ఈ రోజు డీలింక్‌తో కుదిరిన ఒప్పందం దీనికి నిదర్శనమని అన్నారు.

కంపెనీల ప్రతినిధులతో మంత్రి కెటిఆర్ భేటీ

తైవాన్ పర్యటనలో ఉన్న కెటిఆర్ పలు కీలక సమావేశాల్లో పాల్గొన్నారు. ప్రపంచంలో మూడో అతి పెద్ద ఒరిజినల్ ఏక్విప్‌మెంట్ తయారీదారు న్యూ కిన్సో కంపెనీ సిఇఓ సిమెన్ షెన్‌తో భేటీ అయ్యారు. సుమారు 40 బిలియన్ డాలర్ల టర్నోవర్ కలిగిన ఈ కంపెనీ హార్డ్ డిస్క్‌లు, ప్రింటర్లు, మదర్ బోర్డుల తయారీలో అగ్రగ్రామిగా ఉంది.

ప్రపంచ వ్యాప్తంగా ఆరు ఫ్యాక్టరీలు ఉన్న ఈ కంపెనీ ఇప్పటి వరకు ఇండియాలో ప్రవేశించలేదు. తెలంగాణలో కంపెనీ కార్యకలాపాలు నిర్వహించాలని ఆహ్వానించినట్టు కెటిఆర్ తెలిపారు. వోల్ ట్రెక్ కంపెనీ అధ్యక్షుడు జెమ్స్ చెన్‌తోను కెటిఆర్ భేటీ అయ్యారు.

ఎలక్ట్రానిక్ పరికరాలు, వైఫై రౌటర్లు తయారు చేసే ఈ కంపెనీ పరికరాలను తైవాన్ నుంచి దిగుమతి చేసుకుంటుందని ఇలాంటి కంపెనీ తెలంగాణలో అసెంబ్లింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని కోరినట్టు కెటిఆర్ తెలిపారు.

తెలంగాణలో ఉన్న పరిస్థితులు, అవకాశాలను వివరించడంతో తమ కంపెనీ ప్రతినిధి బృందాన్ని త్వరలోనే హైదరాబాద్ పంపించనున్నట్టు కంపెనీ తెలిపింది. తరువాత తైవాన్ కో ఆపరేషన్ ఫోరమ్ సమావేశానికి హాజరైన మంత్రి ఎలక్ట్రానిక్ సంస్థల ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు.

English summary
The investments are flowing in to the state of Telangana following KTR's foreign tours and now Taiwan's multinational company D-Link has signed an MoU with the Telangana Government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X