వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీఆర్ఎస్ అంటే: బాధ్యతలు స్వీకరించిన కేటీఆర్‌కు హరీష్ ఆలింగనం, తిలకం దిద్దిన కవిత

|
Google Oneindia TeluguNews

Recommended Video

KTR Takes Charge as TRS Working President | Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కల్వకుంట్ల తారక రామారావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. వేద పండితుల ఆశీర్వాదాల మధ్య ఆయన బాధ్యతలను తీసుకున్నారు. ఈ క్రమంలో తెలంగాణ భవన్ వద్ద పండుగ వాతావరణం కనిపించింది. పార్టీ కార్యకర్తలు, నాయకులు సంబరాలు చేసుకున్నారు.

<strong>రేపటి నుంచి ఇక మీకన్నీ కేటీఆర్, అందుకే వర్కింగ్ ప్రెసిడెంట్: కేసీఆర్ కీలక వ్యాఖ్యలు</strong>రేపటి నుంచి ఇక మీకన్నీ కేటీఆర్, అందుకే వర్కింగ్ ప్రెసిడెంట్: కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, పలువురు మాజీ మంత్రులు, అసెంబ్లీకి నూతనంగా తెరాస తరఫున ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు. హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, పట్నం మహేందర్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

 ఆటాపాటలతో తెలంగాణ భవన్‌కు

ఆటాపాటలతో తెలంగాణ భవన్‌కు

బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి నుంచి కళాకారుల ఆటపాటలు, నృత్యాల మధ్య కేటీఆర్ తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం తనకు కేటాయించిన చాంబర్‌లో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ బాధ్యతలు స్వీకరించారు. కేటీఆర్‌కు పార్టీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు, ప్రముఖ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.

నుదుట తిలకం దిద్దిన కవిత

నుదుట తిలకం దిద్దిన కవిత

ప్రగతి భవన్ నుంచి తెలంగాణ భవన్‌కు బయల్దేరే ముందు కేటీఆర్ తన కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తీసుకున్నారు. తల్లిదండ్రులు కేసీఆర్, శోభా ఆశీర్వాదం తీసుకున్నారు. తన సోదరి, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆయన నుదుట తిలకదిద్ది శుభాకాంక్షలు తెలిపారు. పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించబోతున్న తన ప్రియమైన సోదరుడికి శుభాకాంక్షలు అని కవిత ట్వీట్ కూడా చేశారు. కవితతో పాటు తల్లి శోభ, కేటీఆర్ భార్య శైలిమ కూడా ఆయన నుదుట తిలకం దిద్దారు. అనంతరం ప్రగతి భవన్ నుంచి తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు.

ప్రజలు అఖండ మెజార్టీ ఇచ్చారు

ప్రజలు అఖండ మెజార్టీ ఇచ్చారు

వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన కేటీఆర్ మాట్లాడారు. అందరి మద్దతుతో ముఖ్యమంత్రి కేసీఆర్ తన పైన ఉంచిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని చెప్పారు. పార్టీని అజేయశక్తిగా మాలిచే క్రమంలో మీ ఆశీర్వాదం కోరుకుంటున్నానని పార్టీ కేడర్‌తో అన్నారు. భగవంతుడు తనకు ఇచ్చిన శక్తిని మీ కోసం వినియోగిస్తానని చెప్పారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు అఖండ మెజార్టీ ఇచ్చారని చెప్పారు.

 టీఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తిగా మలిచే బాధ్యత అప్పగించారు

టీఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తిగా మలిచే బాధ్యత అప్పగించారు

కుల, మతాలకు అతీతంగా తెరాసను ఆశీర్వదించారని కేటీఆర్ చెప్పారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటానని చెప్పారు. తెరాస అంటే తిరుగులేని రాజకీయ శక్తిగా మల్చడానికి కేసీఆర్ తనకు ముఖ్యమైన బాధ్యత అప్పగించారని చెప్పారు. తనపై ఉంచిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని చెప్పారు. పార్టీని అజేయమైన శక్తిగా మలిచే క్రమంలో మీ ఆశీర్వాదం తీసుకుంటున్నానని పార్టీ కేడర్‌ను ఉద్దేశించి చెప్పారు.

బంగారు తెలంగాణ కోసం పనిచేస్తా

బంగారు తెలంగాణ కోసం పనిచేస్తా

బంగారు తెలంగాణ కోసం సవ్యంగా పని నిర్వర్తిస్తానని కేటీఆర్ చెప్పారు. పార్టీ కార్యాలయాల నిర్మాణం, శిక్షణ, సంస్థాగత నిర్మాణం కోసం కృషి చేస్తానని చెప్పారు. ప్రజలకు వందేళ్లు సేవ చేసేలా పార్టీ కార్యక్రమాలను తీర్చిదిద్దుతానని చెప్పారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య పార్టీ ఉండేలా కృషి చేస్తానని అన్నారు. భగవంతుడు తనకు ఇచ్చిన శక్తిని మీకోసం వినియోగిస్తానని చెప్పారు.

మీలో ఒకడిగా, సోదరుడిగా

మీలో ఒకడిగా, సోదరుడిగా

మీలో ఒకడిగా, సోదరుడిగా అన్ని రంగాల పార్టీల వారికి అండగా ఉంటానని కేటీఆర్ చెప్పారు. పార్టీని అజేయశక్తిగా మారుస్తానని చెప్పారు. కేసీఆర్ తన పైన పెట్టిన బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తానని చెప్పారు. కాగా, కేటీఆర్, కేసీఆర్ అభిమానులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. జెండాలు, పార్టీ నాయకుల చిత్రపటాల ప్రదర్శనతో తెలంగాణ భవన్ ప్రాంతమంతా గులాబీమయంగా మారింది. డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసం, బాణా సంచా కాల్పుల మధ్య ఆయన బాధ్యతలు స్వీకరించారు.

English summary
Telangana Rashtra Samithi (TRS) leader KT Rama Rao officially took over the reins of the party from his father and state Chief Minister K Chandrasekhar Rao on Monday. It was announced last Friday that KTR, as he is more popularly known, was appointed as the party Working President.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X