వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏ మొహంతో వచ్చావ్, రామాలయం మాటేమిటి: అమిత్ షాను దులిపేసిన కేటీఆర్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా కరీంనగర్‌లో బహిరంగ సభ పెట్టి, గతంలో చెప్పిందే పల్లె వేశారని టీఆర్ఎస్ నేత కేటీఆర్ గురువారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన నిన్న (బుధవారం) వచ్చి నోటికి వచ్చినట్లు మాట్లాడారన్నారు. భారత దేశానికి ఈ నాలుగున్నరేళ్లలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏం చేసిందంటే, చెప్పడానికి బీజేపీకి ఏమీ లేదన్నారు. పేదలకు ఏమీ చేయలేదన్నారు.

ఎవరైనా మరిచిపోతారా, మోడీని అభిమానిస్తారనే కేసీఆర్ అంగీకరించలేదు: అమిత్ షాఎవరైనా మరిచిపోతారా, మోడీని అభిమానిస్తారనే కేసీఆర్ అంగీకరించలేదు: అమిత్ షా

రాష్ట్రాలు లేనిది కేంద్రం లేదని, రాష్ట్రాలు పన్నులు కట్టనిది కేంద్రానికి నిధులు లేవని, కేంద్రం మిథ్య అని ఎన్టీఆర్ ఎప్పుడో చెప్పారని కేటీఆర్ అన్నారు. ఇంకో అడుగు ముందుకేసి చెప్పాలంటే కేంద్రం ఈ రోజు మాకు ఇస్తున్న దానికంటే, ఓ రాష్ట్రంగా తెలంగాణకు రావాల్సిన నిధులు వస్తున్నాయని, వాటికి అదనంగా ఒక్క రూపాయి ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రాలు పన్నులు కట్టకపోతే కేంద్రానికి మనుగడే లేదన్నారు. అమిత్ షా కేసీఆర్ ప్రభుత్వంపై మాట్లాడిన మాటలు గర్హణీయమన్నారు.

చంద్రబాబు గిల్లి కజ్జాలు, కేసీఆర్ మెచ్యూరిటీపై మోడీయే చెప్పారు

చంద్రబాబు గిల్లి కజ్జాలు, కేసీఆర్ మెచ్యూరిటీపై మోడీయే చెప్పారు

చంద్రబాబు చిల్లర పంచాయతీలు పెట్టుకుంటే, గిల్లికజ్జాలు పెట్టుకుంటే, కేసీఆర్ మాత్రం మెచ్యూరిటీగా వ్యవహరిస్తున్నారని ప్రధాని మోడీ లోకసభలో చెప్పారని, కానీ అమిత్ షా మాత్రం ఇలా చెబుతున్నారని, ఇక్కడకు వచ్చి నోటికి వచ్చినట్లు మాట్లాడారన్నారు. మోడీ మెదక్ జిల్లాకు వచ్చినప్పుడు, ఇతర కేంద్రమంత్రులు కూడా కేసీఆర్ పైన ప్రశంసలు కురిపించారన్నారు.

 మీ తల ఎక్కడ పెట్టుకుంటారు, ఏం మొహం పెట్టుకొని వచ్చారు

మీ తల ఎక్కడ పెట్టుకుంటారు, ఏం మొహం పెట్టుకొని వచ్చారు

మీరు ఇచ్చిన హామీలు ఎన్నో అమలు చేయలేదని, వాటిని తవ్వితే మీరు తల ఎక్కడ పెట్టుకుంటారని కేటీఆర్ ప్రశ్నించారు. నీతి ఆయోగ్‌ను ప్రారంభించింది మోడీయే అని, ఇందులో భాగంగా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథల కోసం నిధులు ఇవ్వాలని నీతి అయోగ్‌కు సిఫార్స్ చేస్తే మూడేళ్లలో ఏమైనా ఇచ్చిందా అని ప్రశ్నించారు. ఏ మొహం పెట్టుకొని ఇక్కడకు వచ్చి కేసీఆర్ ఏం చేయలేదని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకు రావాల్సిన దాని కంటే ఒక్క రూపాయి ఎక్కువగా ఇచ్చారా అమిత్ షా చెప్పాలన్నారు.

వీటి మాటమిటి?

వీటి మాటమిటి?

విభజన చట్టంలో తెలంగాణకు న్యాయంగా రావాల్సినవి కూడా రాలేదని కేటీఆర్ అన్నారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏమయిందన్నారు. దీని కోసం వందలసార్లు దరఖాస్తు చేసుకున్నామన్నారు. లక్షలాదిమంది టెక్కీలకు ఆధారంగా ఉన్న ఐటీఐఆర్‌ను విస్తరించేందుకు నిధులు అడిగితే ఇవ్వలేదన్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఎన్ని కేంద్ర ప్రభుత్వాలు వెళ్లినా రావడం లేదన్నారు.

 కనీసం సంస్కారం లేకుండా ఏడు మండలాలు కలిపేశారు

కనీసం సంస్కారం లేకుండా ఏడు మండలాలు కలిపేశారు

చంద్రబాబుతో బీజేపీ కలిసి ఉన్న సమయంలో తమకు కనీసం సమాచారం ఇవ్వకుండా, కనీసం సంస్కారం లేకుండా ఏడు మండలాలను ఓ ఆర్డినెన్స్ ద్వారా దుర్మార్గంగా, అప్రజాస్వామికంగా ఏపీలో కలిపింది బీజేపీ ప్రభుత్వమేనని అమిత్ షా పైన నిప్పులు చెరిగారు. కేంద్రం సహకరించకున్నా విద్యుత్ సంక్షోభాన్ని పరిష్కరించుకున్నామని, ఐటీలో ముందుకు సాగామన్నారు. ప్రతిపక్షాలు పనికి రాని విమర్శలు చేస్తున్నాయన్నారు.

 అయోధ్యలో రామాలయం మాటేమిటి, దేవుడ్నీ మోసం చేశారు

అయోధ్యలో రామాలయం మాటేమిటి, దేవుడ్నీ మోసం చేశారు

ఈ సందర్భంగా కేటీఆర్ రామజన్మభూమి, రామాలయ నిర్మాణం అంశంపై స్పందించారు. అమిత్ షాకు నేను సవాల్ చేస్తున్నానని, అయోధ్యలో రామాలయం కడతానని చెప్పి, హిందువుల ఓట్లు వేయించుకొని ఇప్పటి వరకు కట్టలేదన్నారు. మీరు మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని, దేవుడైన రాముడిని కూడా మోసం చేశారన్నారు. బీజేపీ రామమందిరం కట్టలేదని, కానీ మేం యాదాద్రి కడుతున్నామని, వేములవాడను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. హిందుత్వ పార్టీగా చెప్పుకునే బీజేపీ కంటే హిందువులకు, హిందూ దేవాలయాలకు మేం ఎక్కువ చేసామన్నారు. హైందవ ధర్మం విషయంలో కేసీఆర్ ఎవరూ చేయనంత గొప్పగా ఆ ధర్మాన్ని ముందుకు తీసుకు వెళ్తున్నారని చెప్పారు. తెలంగాణ సెక్యులర్ రాష్ట్రమన్నారు. పూజారులు, ఇమామ్‌లు, పాస్టర్లకు గౌరవ వేతనం ఇస్తున్నామని చెప్పారు. బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్‌లను సమానంగా చూస్తున్నామన్నారు.

 అమిత్ షా చాలా ఊహించుకుంటున్నారు

అమిత్ షా చాలా ఊహించుకుంటున్నారు

బీజేపీ చేతకానీ హామీలు ఇచ్చిందని చెప్పారు. కరీంనగర్‌లో కొంతమంది జనాలు వచ్చినందుకే అమిత్ షా అంత ఉబ్బితబ్బిబ్బవుతున్నారని ఎద్దేవా చేశారు. 119 స్థానాల్లో పోటీ చేస్తామని అమిత్ షా చెప్పారని, అసలు ఎన్ని స్థానాల్లో డిపాజిట్ వస్తాయో చూద్దామని, ఆ లెక్క మీకు పంపుతామన్నారు. అమిత్ షా చాలా ఊహించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని, సెక్యులర్ భావాలు కలిగిన వారు అన్నారు. మీ మాతల ఆధారంగా రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటామంటే కుదరదని, మీరు ఈ ఎన్నికల్లో 5 సీట్లు తిరిగి నిలబెట్టుకుంటే గొప్ప అన్నారు.

ఫిర్ ఏక్ బార్ కేసీఆర్

ఫిర్ ఏక్ బార్ కేసీఆర్

అమిత్ షా మాటలు బంద్ చేసి, మీరు తెలంగాణకు ఇచ్చిన ప్రతి హామీని ఈ తొమ్మిది నెలల కాలంలో అమలు చేయాలని సవాల్ విసిరారు. ఎన్నికలపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని చెప్పారు. తమ నియోజకవర్గంలో ఒకరు వచ్చి పోటీ చేస్తానని చెప్పారని, తాము సర్ది చెప్పామని, ఓ నియోజకవర్గంలో పోటీ విషయంలో అది సహజమే అన్నారు. త్వరలో మేనిఫెస్టో అద్భుతంగా రాబోతుందని, ఫిర్ ఏక్ బార్ కేసీఆర్ నినాదంతో ముందుకు వెళ్తామన్నారు.

English summary
Telangana IT minister KT Rama Rao fired at BJP national president Amit Shah for blaming KCR in Karimnagar public meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X