వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేటీఆర్ తార‌క మ‌ంత్రం..! అసంత్రుప్తుల‌ను బుజ్జ‌గించ‌డంలో కీలక పాత్ర‌..!!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Telangana Elections 2018 : కేటీఆర్ కార్యకర్తలకు వార్నింగ్

హైద‌రాబాద్: త‌ప్పుదు. కొన్ని సంద‌ర్బాల్లో శ‌క్తికి మించి బాద్య‌త‌ల‌ను బుజాన వేసుకోక త‌ప్ప‌దు. ప‌రిస్థితుల ఒత్తిడి మేర‌కు ఆమాత్రం బాద్య‌త పోషించాల్సి ఉంటుంది. అది రాజ‌కీయ పార్టీ ఐతే ఇక చెప్పాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. అదికారాన్ని కాపాడుకోవ‌డానికి ఎంత పెద్ద టాస్క్ నైనా చేసి తీరాల్సిన ప‌రిణామాలు త‌లెత్తుతాయి. ఇప్పుడు అదికార గులాబీ పార్టీలో ఇలాంటి ప‌రిస్థితులే త‌లెత్తాయి. ముంద‌స్తు ఎన్నిక‌ల్లో భాగంగా పోటీ చేసే అభ్య‌ర్ధుల‌ను ఆప‌ధ‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌టించ‌డంతో ఆయా జిల్లాల్లో అసంత్రుప్త సెగ‌లు భ‌గ్గుమ‌న్నాయి. కొన్ని నియోజ‌క వ‌ర్గాల్లో కేసీఆర్ ప్ర‌క‌టించిన అభ్య‌ర్థుల‌ను ఓడించేందుకు టీఆర్ఎస్ పార్టీలోనే అస‌మ్మ‌తి వ‌ర్గం కాలుదువ్వుతుండ‌డంతోమంత్రి కేటీఆర్ రంగంలోకి దిగి బుజ్జ‌గింపు చ‌ర్య‌ల‌ను చేప‌డుతున్నారు. ఇది త‌ల‌కు మించిన భారం అయిన‌ప్ప‌టికి కేసీఆర్ వార‌సుడిగా అనివార్య‌మ‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

నేత‌ల అస‌మ్మ‌తి గ‌ళం..! బుజ్జ‌గించేందుకు రంగంలోకి కేటీఆర్..!!

నేత‌ల అస‌మ్మ‌తి గ‌ళం..! బుజ్జ‌గించేందుకు రంగంలోకి కేటీఆర్..!!

తెలంగాణ రాజ‌కీయం వేడెక్కుతోంది. పార్టీల‌న్ని విజ‌యం కోసం వ్యూహ ర‌చ‌న‌లు చేస్తున్నాయి. ఇప్ప‌టికే కేసీఆర్ టిఆర్ఎస్‌ నుంచి 107 మంది అభ్య‌ర్ధుల జాబితాను విడుద‌ల చేశారు. ఎన్నిక‌ల ముందు జాబితా ప్ర‌క‌టించ‌డంతో టీఆర్ఎస్ ఓ మెట్టు ఎక్కిన‌ట్టు అయింది. అయితే అభ్య‌ర్ధుల విష‌యంలో కొన్ని చోట్ల అభ్యంత‌రాలు వ్య‌క్తం అవుతున్నాయి. నేత‌లు అస‌మ్మ‌తి గ‌ళం వినిపిస్తునే్నారు. ఇది పార్టీని దెబ్బ‌తీస్తుందని భావించిన కేటీఆర్ స్వ‌యంగా రంగంలోకి దిగారు.

ఓప‌క్క బుజ్జ‌గింపు..! మ‌రోప‌క్క సున్నిత హెచ్చ‌రిక‌లు.! ఇదే కేటీఆర్ తార‌క మంత్రం..!

ఓప‌క్క బుజ్జ‌గింపు..! మ‌రోప‌క్క సున్నిత హెచ్చ‌రిక‌లు.! ఇదే కేటీఆర్ తార‌క మంత్రం..!

అసంత‌ృప్తి వాదుల‌ను చ‌ల్ల‌బ‌ర్చేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు. గ్రేట‌ర్‌లో నేత‌ల మ‌ద్య స‌యోద్య కుదిర్చేందుకు చ‌క్రం తిప్ప‌డం మొద‌లుపెట్టారు. ముందుగా అభ్య‌ర్ధుల పై అస‌మ్మ‌తితో ఉన్న కార్పొరేట‌ర్ల‌తో ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గాల వారిగా స‌మావేశ‌మ‌వుతున్నారు. టికెట్టు ఇచ్చిన పార్టీ పై విశ్వాసం చూపించే స‌మ‌యం వ‌చ్చింద‌ని హిత‌బోద చేస్తున్నారు. ఒక‌వేళ పార్టీ నిర్ణ‌యాన్ని దిక్క‌రిస్తే తీవ్ర ప‌రిణామాల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని సున్నిత హెచ్చ‌రిక‌లు కూడా జారీ చేస్తున్నారు కేటీఆర్.

తెలంగాణ వ్యాప్తంగా కేటీఆర్ ప్ర‌య‌త్నాలు..! ఎన్నిక‌ల నాటికి రెబ‌ల్స్ ని లేకుండా చేయాలి..!

తెలంగాణ వ్యాప్తంగా కేటీఆర్ ప్ర‌య‌త్నాలు..! ఎన్నిక‌ల నాటికి రెబ‌ల్స్ ని లేకుండా చేయాలి..!

దీంతో కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రిస్థితులు మెరుగుప‌డ్డాయి. ఇక ఉప్ప‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో త‌లెత్తిన వివాదాన్ని కూడా ఆయ‌న స‌ర్ధుబాటు చేశారు. ఈ టికెట్టును కేటీఆర్ మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌కు ఇప్పించాల‌ని భావించాడు. కాని కేసీఆర్ సుభాష్‌రెడ్డికి కేటాయించారు. నియోజ‌క‌వ‌ర్గంలో సుభాష్ రెడ్డికి వ్య‌తిరేకంగా నిర‌స‌న‌లు వ్య‌క్తం అయ్యాయి. చివ‌ర‌కు కేటీఆర్ క‌లుగ‌చేసుకొని ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దారు.

కేటీఆర్ త‌ల‌కు మించిన బాద్య‌త‌..! త‌ప్ప‌దంటున్న పార్టీ శ్రేయోభిలాషులు..!

కేటీఆర్ త‌ల‌కు మించిన బాద్య‌త‌..! త‌ప్ప‌దంటున్న పార్టీ శ్రేయోభిలాషులు..!

ఇక వ‌రంగ‌ల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో రాజ‌య్య‌కు టికెట్టు కేటాయించారు. కాని అక్క‌డ కూడా కొంత వ్య‌తిరేక‌త త‌లెత్తింది. రాజయ్య సమక్షంలోనే నియోజకవర్గ నేతల అభిప్రాయాలను కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. రాజయ్య వైఖరిపై అసంతృప్తి వెళ్లగక్కిన నియోజకవర్గ నేతలకు కేటీఆర్ స‌ర్థి చెప్పారు. మొత్తానికి టీఆర్ఎస్‌లో ఉన్న అస‌మ్మ‌తిని అంతం చేసి పార్టీని విజ‌య‌తీరాల‌కు చేర్చే క్ర‌మంలో కేటీఆర్ తార‌క మంత్రాన్ని జ‌పిస్తున్న‌ట్టు పార్టీ శ్రేణుల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.

English summary
In some places of telangana, objections are expressed. Leaders are in a disagreement. KTR, who feels that it hurts the party, has gone into his own rescue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X