వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బతుకమ్మ వేడుకల్లో న్యూజిలాండ్ ప్రధాని జసిండా: థ్యాంక్సంటూ కేటీఆర్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ఆడపడచుల పండగ బతుకమ్మ. ఈ పండగను తెలంగాణతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో, ప్రపంచంలో ఎక్కడవున్న ఇక్కడి ఆడపడచులు ఎంతో సంబరంగా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ ఏడాది కూడా దసరా నవరాత్రుల ఉత్సవం సందర్భంగా ఘనంగా బతుకమ్మ పండగను జరుపుకుంటున్నారు.

తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతిరూపంగా నిలిచే బతుకమ్మ పండుగను అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, తదితర దేశాల్లోని తెలంగాణ ఆడపడచులు వేడుకగా నిర్వహిస్తున్నారు. న్యూజిలాండ్‌లో జరిగిన బతుకమ్మ సంబరాల్లో ఆ దేశ ప్రధాని కూడా పాల్గొనడం విశేషం. తెలంగాణ ఆడపడుచులతో కలిసి న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు.

KTR Thank New Zealand PM Jacinda Ardern For Participating In Bathukamma Celebrations

జెసిండా నుదుటన బొట్టు పెట్టుకొని.. బతుకమ్మ చుట్టూ తిరిగి గౌరమ్మకు పూజ చేశారు. అక్కడి తెలంగాణ ఆడపడుచులతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఆమె పండగ శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సంస్కృతీ, సాంప్రదాయాలంటే తనకు ఇష్టమని తెలిపారు. న్యూజిలాండ్ చరిత్రలో ప్రధాన మంత్రిగా ఉంటూ బిడ్డకు జన్మనిచ్చిన తొలి మహిళగా ఆమె రికార్డులకెక్కిన విషయం తెలిసిందే.

ప్రపంచ చరిత్రలోనే బతుకమ్మ సంబురాల్లో ఓ దేశ ప్రధాని ఆడిపాడటం ఇదే తొలిసారి కావడం విశేషం. న్యూజిలాండ్‌లో బతుకమ్మ వేడుకల నిర్వహణపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సాక్షాత్తూ న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనడం గొప్ప విషయం అని అన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను న్యూజిలాండ్ ప్రధాని గౌరవించారు. బతుకమ్మ ఆడిన ప్రధాని జెసిండాకు ధన్యవాదాలు అని కేటీఆర్ పేర్కొన్నారు.

English summary
Telangana minister KTR Thanked to New Zealand PM Jacinda Ardern For Participating In Bathukamma Celebrations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X