హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రెక్కల కారులోనే పర్యటన, ప్రత్యేకతలు: వ్యాలీలో కెటిఆర్ బిజీ(ఫొటోలు)

|
Google Oneindia TeluguNews

సిలికాన్ వ్యాలీ/హైదరాబాద్‌: పర్యావరణానికి మేలుచేసే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వీలైనంత త్వరలోనే మన దేశంలో కూడా ప్రవేశపెట్టాలని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. పెట్టుబడుల సేకరణే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి కెటి రామారావు అక్కడ అనేక వినూత్న టెక్నాలజీలు, ఆవిష్కరణలను పరిశీలిస్తున్నారు.

సిలికాన్‌ వ్యాలీలోని నగరపాలన పద్ధతులను అధ్యయనం చేశారు. ప్రత్యేకించి పర్యావరణహిత ఉత్పత్తులపై ఆసక్తి చూపిన మంత్రి.. నిశితంగా వాటి గురించి అధ్యయనం చేస్తున్నారు. అలాంటివాటిని ఇక్కడ వినియోగించే అవకాశాల గురించి యోచిస్తున్నారు.

అమెరికా మిడ్ వెస్ట్ పర్యటనలో భాగంగా మున్సిపల్, నగర పరిపాలన వంటి పాలనా పద్ధతులను అధ్యయనం చేసిన మంత్రి, సిలికాన్ వ్యాలీ పర్యటనలో భాగంగా సంప్రదాయేతర ఇంధన వనరులపై ఆసక్తికర నూతన ఆవిష్కరణలను స్వయంగా పరిశీలించారు.

KTR visits Silicon Valley, drives electric car

ఈ సందర్భంగా మంత్రి సంప్రదాయేతర ఇంధన వనరులకు సంబంధించిన నూతన ఆవిష్కరణలకు ఆసక్తిగా గమనించారు. తొలుత కాలిఫోర్నియా రాష్ట్రంలో ఏర్పాటు చేసిన క్లీన్‌టెక్‌ ఇంక్యుబేటర్‌ ఐ-హబ్‌లో నెలకొల్పిన సంప్రదాయేతర ఇంధన వనరుల అంకుర పరిశ్రమను తిలకించారు.

అక్కడ ఔత్సాహిక పరిశోధకులతో చర్చించారు. ఈ అంకుర పరిశ్రమ రూపొందించిన బయోడీగ్రేడబుల్‌ ప్లాస్టిక్‌ గ్లాసు మంత్రి దృష్టిని అమితంగా ఆకర్షించింది. కేవలం ఆరు నెలల కాలంలోనే మట్టిలో కలిసిపోయే గుణం ఉన్న ఈ ప్లాస్టిక్‌ గ్లాసు గురించి ఇతర వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఇలాంటి పర్యావరణహిత పరిజ్ఞానం మన దేశంలో ముఖ్యంగా హైదరాబారాద్‌లాంటి నగరాల్లో సాధ్యమైనంత త్వరగా ప్రవేశపెట్టాలని కేటీఆర్‌ ఆకాంక్షించారు. హైదరాబాద్‌ను ప్లాస్టిక్‌ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ఇలాంటి నూతన ఆవిష్కరణలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.

KTR visits Silicon Valley, drives electric car

టెస్లా ఎలక్ట్రిక్ కారులో పర్యటన

సిలికాన్ వ్యాలీలో అనేక పేరున్న కంపెనీలతో చర్చలు సాగించిన మంత్రి పర్యటన ఆసాంతం ఎలక్ట్రిక్ కారు.. టెస్లా మోడెల్ ఎక్స్‌లోనే సాగింది. ఈ-కారును పరిశీలన కోసం మంత్రి స్వయంగా నడిపి చూశారు. 2003లో ప్రారంభం అయిన టెస్లా కంపెనీ సంప్రదాయేతర ఇంధన రంగంలో సంచలనం సృష్టిస్తోంది.

సిలికాన్ వ్యాలీలో యువ ఇంజినీర్ ఎలాన్ మస్క్ నేతృత్వంలో నడుస్తున్న టెస్లా మోటార్స్ తయారుచేస్తున్న ఎలెక్ట్రిక్ కార్లు, వాటిలో ఉన్న ఫీచర్లు ప్రపంచవ్యాప్తంగా అనేకమంది దృష్టిని ఆకర్షిస్తున్నాయని మంత్రి అన్నారు.
తాజాగా రిలీజయిన టెస్లా మోడల్ ఎక్స్ ఎలెక్ట్రిక్ కారుకు విహంగంలా రెక్కల ఆకారంలో డోర్లున్నాయి.

కారు ముందు విండ్ షీల్డ్ కూడా పనోరమిక్ వ్యూతో అన్ని దిక్కులను, ఆకాశాన్నీ చూసే వెసులుబాటు కలిగిస్తుంది. ఈ కారు స్టార్ట్ అయిన నాలుగు సెకండ్లలోపే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. తన చుట్టూ ఉన్న వాహనాల గురించి, ట్రాఫ్రిక్ సూచనల గురించి ఎప్పటికప్పుడు డ్రైవర్‌కు సమాచారం ఇస్తుంది. అమెరికన్ రోడ్ల మీద కూడా అతి తక్కువగా కనిపించే టెస్లా మోడల్ ఎక్స్ కారులో మంత్రి కేటీఆర్ ప్రయాణిస్తుండటాన్ని అనేకమంది ఆసక్తిగా గమనించారు.

అద్భుతమైన ఆలోచనలు, విభిన్నంగా ఆలోచించే తత్వం ద్వారా ప్రపంచగతిని మార్చే ఫలితాలు వస్తాయని మంత్రి అన్నారు. టెస్లా ఆవిష్కరణ ఇలాంటిదేనని ఆయన చెప్పారు. సిలికాన్‌వ్యాలీలో జరుగుతున్న పరిశోధనలకు, టీహబ్ లాంటి చోట్ల ఉన్న ఔత్సాహిక పరిశోధకులకు టెస్లా విజయప్రస్థానం స్ఫూరినిస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.

English summary
​Silicon Valley: Minister for Industries, IT and MAUD K Taraka Rama Rao has visited Silicon Valley and witnessed the new innovations in non-conventional energy resources.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X