అక్కడ చిరంజీవిని చూసి ఆశ్యర్యపోయిన కేటీఆర్.!గర్వపడుతున్నానంటూ ట్వీట్.!
హైదరాబాద్ : దేశం కాని దేశం, అందులో అదికూడా కూడా ఓ మారుమూల నగరం. ఆ నగరంలో మనకు సుపరిచితులైన వ్యక్తులు తారసపడితే.. మన మాతృభషనే మాట్లాడితే.. ఇంకేముందు.. ఎగిరి గంతేయాలనిపిస్తుంది. అంతే కాకుండా మన తెలుగు సెబ్రిటీ పోస్టర్లను విశేశాల్లో, అదికూడా ఓ మారమూల పట్టణాల్లో గోడకు అతికించుకుంటే, ఆ దృశ్యం మన కంటపడితే ఆ క్షణంలోపొందే అనుభూతి మాటల్లో చెప్పలేని విధంగా ఉంటుంది.
అక్కడి వాళ్లను సంప్రదించి ఈ పోస్టర్ ఎవరిది.?ఎందుకు పెట్టుకున్నారో తెలుసుకోవాలనే ఆసక్తి క్షణాల్లో ఉద్బవిస్తుంది. భాష తెలియకపోయినా పోస్టర్ లోని వ్యక్తి గురించి, ఎందుకు గోడకు ప్రతిష్టించుకున్నారో తెలుసుకోవాలనే ఉబలాటం కలుగుతుంది. తెలంగాణ ఐటి, పురపాలక శాఖా మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు అచ్చం ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది. అందరిక సెల్పీలిచ్చే కేటీఆర్ ఆ పోస్టర్ తో సెల్ఫీ తీసుకోకుండా ఉండలేకపోయారు. ఇంతకీ ఆ పోస్టర్ లో ఉన్నది ఎవరు.?

తెలంగాణ యువ మంత్రి కేటీఆర్ ను అంతగా ఆశ్చర్యానికి గురిచేసిన ఆ సెలబ్రిటీ ఎవరు.?దేంశం కాని దేశంలో అక్కడ ఎందుకు ఆ దేశ ప్రజలు గోడకు తగిలించుకున్నారు.?తెలుసుకుందాం.! జపాన్ దేశం, షిజోక రాష్ట్రం లోని హమమత్సు నగరంలో ఉన్న సుజుకీ మ్యూజియంను సందర్శించారు మంత్రి కేటీఆర్. అక్కడ తాను చూసిన ఫోటో ఎవరిదో మీకు తెలుసా అంటూ ఆసక్తికంగా ట్వీట్ చేసారు కేటీఆర్. మన సొంతమైన మెగాస్టార్ చిరంజీవి గారిదని, అక్కడి చిరంజీవిని చూడడం ఆశ్చర్యంతో పాటు గర్వంగా అనిపించిందన్నారు.

మన మాతృభూమికి చెందిన వారు జపాన్ లోని ఓ మారు మూల గ్రామంలో గుర్తింపు పొందడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని ట్వీట్ చేసారు కేటీఆర్. అంతే కాకుండా అక్కడ వెలిసిన మెగాస్టార్ చిరంజీవి పోస్టర్ దగ్గరుకు వెళ్లి చూపుడు వేలు చిరంజీవి వైపు చూపిస్తూ సెల్ఫీ దిగారు. అదే సెల్ఫీని ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ కామెంట్ కూడా పోస్టు చేసారు కేటీఆర్. ఎంతైనా మన మెగాస్టార్ మెగాస్టారే మరి అన్నంత రేంజ్ లో కేటీఆర్ స్పందించారు.