వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

త్వరలో కేటీఆర్ సీఎం! హరీశ్ రావు పక్కకే, కేసీఆర్ రాజీనామాపై అనుమానాలు: విజయశాంతి కీలక వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తెలంగాణ పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ విజయశాంతి సంచలన విమర్శలు చేశారు. మంత్రి హరీశ్ రావును పక్కన పెట్టేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. అంతేగాక, కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు రంగం సిద్ధం చేశారన్నారు.

హరీశ్‌కు కేసీఆర్ ఆల్టిమేటం! ఫాంహౌస్‌లో ఓట్లు లెక్కిస్తారా?: విజయశాంతి ఫైర్, కాంగ్రెస్‌లోనే..హరీశ్‌కు కేసీఆర్ ఆల్టిమేటం! ఫాంహౌస్‌లో ఓట్లు లెక్కిస్తారా?: విజయశాంతి ఫైర్, కాంగ్రెస్‌లోనే..

కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేసేందుకు కేసీఆర్ ప్లాన్..

కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేసేందుకు కేసీఆర్ ప్లాన్..

దుబ్బాక శాసనసభ ఉప ఎన్నికలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు డిపాజిట్లు కూడా రాకుండా చేయాలని ఆర్థిక మంత్రి హరీశ్ రావు కంటి మీద కునుకు లేకుండా పనిచేస్తున్నారని.. కానీ ఎన్నిక తర్వాత సీఎం కేసీఆర్ ఆయనకు షాక్ ఇవ్వబోతున్నారని విజయశాంతి అన్నారు. దుబ్బాక ఉపఎన్నిక తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలను నిర్వహించి, ఆ ఫలితాలు రాగానే, కేటీఆర్‌కు సీఎం పదవి కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసినట్లు టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోందన్నారు. ఈ వాదనకు బలం చేకూర్చేలా గతంలో ఎప్పుడూ లేని విధంగా తొలిసారి కేసీఆర్ నోట రాజీనామా మాట వచ్చిందన్నారు.

బీజేపీ మీద నెపం పెట్టి కేసీఆర్ రాజీనామా..!

బీజేపీ మీద నెపం పెట్టి కేసీఆర్ రాజీనామా..!

బీజేపీ మీద నెపం పెట్టి.. సీఎం పదవికి రాజీనామా చేస్తానని కేసీఆర్ సంకేతాలిస్తున్నారని, ఇది భవిష్యత్ రాజకీయాలకు అద్దం పడుతోందన్నారు విజయశాంతి. తనపైన, సర్కారుపైనా నిరాధార ఆరోపణలు చేస్తే విపక్ష నేతల్ని జైలుకు పంపిస్తానని బెదిరించిన కేసీఆర్.. ఇప్పుడు సీఎం పదవికి రాజీనామా చేస్తానంటూ కొత్త విషయాన్ని ఎందుకు తెరమీదకు తెచ్చారని విజయశాంతి నిలదీశారు.

హరీశ్ రావు పక్కకే.. కేసీఆర్ రాజీనామాపై అనుమానాలు

హరీశ్ రావు పక్కకే.. కేసీఆర్ రాజీనామాపై అనుమానాలు

‘ఓవైపు హరీష్ రావు దుబ్బాకలో ప్రచారం చేస్తూ బీజేపీ నేతల మీద విరుచుకు పడుతున్న తరుణంలో.. ఆయన ప్రచారాన్ని డామినేట్ చేసే విధంగా కెసిఆర్ బిజెపి నేతలకు సవాల్ విసరడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ ప్రకటన బిజెపి నేతలకే కాదు.. పరోక్షంగా హరీష్ రావుకి కూడా సంకేతం ఇచ్చినట్టే అని తెలంగాణ సమాజం భావిస్తోంది. మొత్తం మీద కెసిఆర్ రాజీనామా ప్రకటన చూస్తుంటే.. దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించిన తర్వాత(ఒకవేళ గెలిస్తే) హరీష్ రావుకి ఆయన మామ కేసీఆర్ బంపర్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారని... ఆ గిఫ్ట్ ఏమిటంటే.. తాను సీఎం పదవికి రాజీనామా చేసి, కేటీఆర్‌ను సీఎం గద్దెపై కూర్చోబెట్టబోతున్నారన్న వాదన వినిపిస్తోంది. ఎంతైనా నమ్మినవారిని గొంతు కోయడంలో కెసిఆర్ అనుసరించే స్టైలే వేరు...' అంటూ విజయశాంతి ఎద్దేవా చేశారు.

English summary
ktr will soon telangana CM: vijayashanti slams kcr and harish rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X