హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పెట్టుబడులకు ఓకే: కెటిఆర్‌తో సైరస్ మిస్త్రీ(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు టాటా కంపెనీ సంసిద్ధత వ్యక్తం చేసింది. టాటా చైర్మన్ సైరస్ మిస్ట్రితో పాటు టాటా కంపెనీలకు చెందిన తొమ్మిది మంది సిఈఓలను తెలంగాణ ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మంగళవారం ముంబైలో కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులకు టాటా గ్రూప్ ఆసక్తి చూపించింది. మంత్రి కెటిఆర్ టాటా కంపెనీల సిఈఓలతో కలిసి తెలంగాణలో పెట్టుబడులకు గల అవకాశాల గురించి, నూతన పారిశ్రామిక విధానం గురించి వివరించారు.

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సైరస్ మిస్ట్రీ సుముఖత వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టి- హబ్‌తో పాటు ఇన్నోవేషన్ ఫండ్‌తో భాగస్వామ్యం అయ్యేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. అఫర్డబుల్ హౌసింగ్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు టాటా కంపెనీ ఒక ప్రతినిధి బృందాన్ని తెలంగాణకు పంపనుంది. టాటా గ్రూప్ మహబూబ్‌నగర్ సోలార్ పార్క్‌లో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు కూడా సంసిద్ధత వ్యక్తం చేసింది.

స్మార్ట్‌సిటీ ఏర్పాటు, ఎలక్ట్రికల్ పార్క్‌లో పెట్టుబడులకు టాటా గ్రూప్ ఆసక్తి వ్యక్తం చేసింది. వంద మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. బంజరు భూముల్లో బయోమాస్ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులపట్ల, తెలంగాణలో పవన విద్యుత్‌కు అవకాశాల గురించి ఆసక్తి చూపించారు. గ్రీన్‌ఫీల్డ్ ఇండస్ట్రియల్ టౌన్‌షిప్ ప్రాజెక్టు అభివృద్ధికి అంగీకారం తెలిపారు. ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ పార్క్ ఏర్పాటు చేయాలనే తెలంగాణ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు, ఈ పార్కు అభివృద్ధికి టాటాలు చేయూత నిస్తారని తెలిపారు.

హైదరాబాద్‌లో ట్రాన్స్‌పోర్ట్ సిస్టంను అధ్యయనం చేసేందుకు టాటా సన్స్ ఆసక్తి చూపించింది. మెట్రో రైలుకు అనుబంధంగా లైట్ రైల్ ప్రాజెక్టులో పని చేసేందుకు ఆసక్తి చూపించారు. తెలంగాణలో ఇప్పటికే పలు ప్రాజెక్టులు చేపట్టినట్టు, మరిన్ని ప్రాజెక్టులను ప్రారంభిస్తామని టాటా కంపెనీలు తెలిపాయి. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పై ఆసక్తి చూపించారు. ముంబైలోని మురికి వాడల అభివృద్ధికి కృషి చేసిన టాటా హౌసింగ్ ప్రాజెక్టు ఇదే తరహాలో హైదరాబాద్‌లో ప్రాజెక్టు చేపట్టేందుకు ఆసక్తి చూపించింది.

ఐటి కార్యదర్శి హరిప్రీత్ సింగ్, పరిశ్రమల శాఖ కమిషనర్ జయేష్ రంజన్, హౌసింగ్ సిఈ ఈశ్వరయ్య తదితరులతో కలిసి మంత్రి కెటిఆర్ ముంబై లోని బొంబాయి హౌస్‌లో టాటా కంపెనీల సిఈఓలతో చర్చించారు. చైర్మన్ సైరస్ మిస్త్రీ, అనీల్ సర్‌దానా( టాటా పవర్), సంజయ్ ఉబాలే(టాటా రియాల్టీ అండ్ ఇన్‌ఫాస్ట్రక్చర్), వినాయక్ దేశ్ పాండే(టాటా ప్రాజెక్ట్), పునీత్ శర్మ( టాటా క్యాపిటల్), సుకరన్ సింగ్( టాటా అడ్వాన్స్‌డ్ సిస్టం) సుమిత్ సప్రు(టాటా హౌసింగ్) రవి పిశోడ్రి( టాటా మోటార్స్), శ్రీనాథ్( టాటా టెలీ సర్వీసెస్) సిఈఓలు పాల్గొన్నారు.

టాటా గ్రూప్ సిఈఓలతో కెటిఆర్

టాటా గ్రూప్ సిఈఓలతో కెటిఆర్

తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు టాటా కంపెనీ సంసిద్ధత వ్యక్తం చేసింది. టాటా చైర్మన్ సైరస్ మిస్ట్రితో పాటు టాటా కంపెనీలకు చెందిన తొమ్మిది మంది సిఈఓలను తెలంగాణ ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మంగళవారం ముంబైలో కలిశారు.

టాటా గ్రూప్ సిఈఓలతో కెటిఆర్

టాటా గ్రూప్ సిఈఓలతో కెటిఆర్

ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులకు టాటా గ్రూప్ ఆసక్తి చూపించింది. మంత్రి కెటిఆర్ టాటా కంపెనీల సిఈఓలతో కలిసి తెలంగాణలో పెట్టుబడులకు గల అవకాశాల గురించి, నూతన పారిశ్రామిక విధానం గురించి వివరించారు.

టాటా గ్రూప్ సిఈఓలతో కెటిఆర్

టాటా గ్రూప్ సిఈఓలతో కెటిఆర్

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సైరస్ మిస్ట్రీ సుముఖత వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టి- హబ్‌తో పాటు ఇన్నోవేషన్ ఫండ్‌తో భాగస్వామ్యం అయ్యేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు.

టాటా గ్రూప్ సిఈఓలతో కెటిఆర్

టాటా గ్రూప్ సిఈఓలతో కెటిఆర్

అఫర్డబుల్ హౌసింగ్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు టాటా కంపెనీ ఒక ప్రతినిధి బృందాన్ని తెలంగాణకు పంపనుంది. టాటా గ్రూప్ మహబూబ్‌నగర్ సోలార్ పార్క్‌లో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు కూడా సంసిద్ధత వ్యక్తం చేసింది.

English summary
Mr KT Rama Rao, Minister for IT & PR’s meeting with Chairman TATA Sons Mr Cyrus Mistry and 9 other TATA company CEOs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X