వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చిన కోర్టు ... బెయిల్ పిటీషన్ కొట్టివేత

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ పార్టీ నేత, ఫైర్ బ్రాండ్ మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి కేటీఆర్ ఫాం హౌస్ వ్యవహారంలో చర్లపల్లి జైలులో ఉన్న విషయం తెలిసిందే . ఇక నేడు ఆయన బెయిల్‌ పిటిషన్‌పై కోర్టు ఝలక్ ఇచ్చింది . రేవంత్ రెడ్డికి కూకట్ పల్లి కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను నేడు కోర్టు కొట్టివేసింది. జన్వాడలో డ్రోన్ ఎగురవేసిన కేసులో రేవంత్ కు బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. బెయిల్ పిటిషన్‌పై నిన్న విచారణ పూర్తి చేసిన కోర్టు నేడు తీర్పు వెలువరించింది. బెయిల్ పిటిషన్ ను కొట్టేసింది.

రేవంత్ రెడ్డి బెయిల్ పిటీషన్ పై తీర్పు రేపటికి వాయిదా: బెయిల్ పై డైలమాలో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి బెయిల్ పిటీషన్ పై తీర్పు రేపటికి వాయిదా: బెయిల్ పై డైలమాలో కాంగ్రెస్

కేటీఆర్ ఫాంహౌస్‌పై డ్రోన్ వివాదంలో రేవంత్ పై కేసు

కేటీఆర్ ఫాంహౌస్‌పై డ్రోన్ వివాదంలో రేవంత్ పై కేసు

జన్వాడ దగ్గర మంత్రి కేటీఆర్ ఫాంహౌస్‌పై నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ కెమెరాలను వినియోగించారనే ఆరోపణలపై రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు కొండల్ రెడ్డి సహా మొత్తం 8 మందిపై నార్సింగి పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే . ఈ కేసులో ఉప్పర్‌ పల్లి కోర్టు రేవంత్ కు 14 రోజుల రిమాండ్ విధించగా.. పోలీసులు చర్లపల్లి జైలుకి తరలించారు. చర్లపల్లి జైల్లో రేవంత్ రెడ్డి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇక ఆయన బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు .

బెయిల్ కోరిన రేవంత్ ... పీటీ వారెంట్ ఉందన్న పోలీసుల వాదన

బెయిల్ కోరిన రేవంత్ ... పీటీ వారెంట్ ఉందన్న పోలీసుల వాదన


కేటీఆర్‌ ఫామ్‌హౌస్‌పై డ్రోన్‌ ఎగురవేసిన కేసులో నార్సింగి పోలీసులు 8 మందిని నిందితులుగా చేర్చి అరెస్ట్‌ చెయ్యగా గత విచారణలో ఆరుగురికి రాజేంద్రనగర్‌ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న రేవంత్‌ రెడ్డికి కూడా నేడు బెయిల్‌ వస్తుందని భావించారు . కానీ బెయిల్ రాకుండా ప్రభుత్వం సర్వ ప్రయత్నాలు చేసింది. రేవంత్ రెడ్డిపై గతంలో ఉన్న అభియోగాలపై కూడా కేసులు నమోదు చేసి పీటీ వారెంట్ ఉందని ఆయనకు బెయిల్ ఇవ్వటానికి వీలు లేదని పోలీసుల తరపు లాయర్ వాదనలు వినిపించారు. .

Recommended Video

Telangana Budget 2020 : Women Not Satisfied With Budget | Oneindia Telugu
 రేవంత్ రెడ్డికి బెయిల్ నిరాకరించిన కోర్టు .. పిటీషన్ కొట్టివేత

రేవంత్ రెడ్డికి బెయిల్ నిరాకరించిన కోర్టు .. పిటీషన్ కొట్టివేత

తమ క్లయింట్ పై ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు పెట్టారని రేవంత్ తరపు లాయర్ వాదనలు వినిపించారు. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా రేవంత్ పై కేసులు పెట్టారని కోర్టుకు తెలిపారు. అదే సాకుతో పీటీ వారెంట్ ఇష్యూ చేస్తున్నారని వాపోయారు. రేవంత్ కు బెయిల్ మంజూరు చెయ్యాలని వాదనలు వినిపించారు. అయినప్పటికీ కోర్టు బెయిల్ పిటిషన్ కొట్టివేసింది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

English summary
The court refused to give bail to Revanth Reddy. Bail petition of Revanth Reddy dismissed The kukatpalli court refused to grant bail to Revanth in a drone hoisting case in Janwada near KTR fram house . The court, which completed yesterday's hearing on the bail petition, ruled today. The bail petition was struck down.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X