హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీడీపీలోకి మాజీ మంత్రులు, రేవంత్ తన్నిపోయాడు, ఊహించలేదు: రమణ ఆసక్తికరం

తెలుగుదేశం పార్టీ విధానాలు చూసి, చేసిన అభివృద్ధిని చూసి కొంతమంది సీనియర్ నాయకులు తమ పార్టీలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షులు ఎల్ రమణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఆయన శనివా

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ విధానాలు చూసి, చేసిన అభివృద్ధిని చూసి కొంతమంది సీనియర్ నాయకులు తమ పార్టీలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షులు ఎల్ రమణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఆయన శనివారం మాట్లాడారు.

చదవండి: టీడీపీ షాక్: రేవంత్‌పై ఎల్ రమణ సంచలనం, రాజీనామాపై ఊహించని ట్విస్ట్

మాజీ మంత్రులు సంప్రదిస్తున్నారు

మాజీ మంత్రులు సంప్రదిస్తున్నారు

మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పార్టీలో చేరేందుకు తమను సంప్రదిస్తున్నారని రమణ చెప్పారు. ఇది తమను సంప్రదిస్తున్నది వాస్తవమే అన్నారు. డిసెంబర్ 15లోపు అన్ని కమిటీలను పూర్తి చేయాలని పార్టీ నేతలకు సూచించారు. ఈ మేరకు అధినేత చంద్రబాబు ఆదేశించారన్నారు.

ఎద మీద తన్నిపోతారని ఊహించలేదు

ఎద మీద తన్నిపోతారని ఊహించలేదు

ఆయన సంగారెడ్డి, మహబూబాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడారు. పార్టీలో ఎదిగిన వారు ఎదమీద తన్నిపోతారని ఊహించలేదని రేవంత్‌ను ఉద్దేశించి అన్నారు. వచ్చే ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకుని పార్టీ పునర్నిర్మాణం చేపట్టామన్నారు.

అన్నిస్థానాల్లో పోటీ, సత్తా చూపుతాం

అన్నిస్థానాల్లో పోటీ, సత్తా చూపుతాం

వచ్చే జనవరి 18న ఎన్టీఆర్‌ వర్థంతి పురస్కరించుకుని సహపంక్తి భోజనం వంటి కార్యక్రమాలు చేపడతామని రమణ చెప్పారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వచ్చే 29న ప్రతీ గ్రామంలో పార్టీ జెండా ఆవిష్కరణ చేపట్టాలన్నారు. అన్నీ శాసనసభ, లోకసభ స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుందని ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి టీడీపీ శక్తి ఏమిటో చూపుతామన్నారు.

ఓటుకు నోటుతో టీడీపీ ప్రతిష్ట దెబ్బతిన్నది

ఓటుకు నోటుతో టీడీపీ ప్రతిష్ట దెబ్బతిన్నది

ఓటుకు నోటు కేసుతో తెలుగుదేశం పార్టీ ప్రతిష్ట దెబ్బతిన్నదని మోత్కుపల్లి నర్సింహులు వేరుగా అన్నారు. రేవంత్ రెడ్డి లాంటి చీడపురుగును రాజకీయాల్లో లేకుండా ఏరిపారేయాలని ఆయన తీవ్రంగా మండిపడ్డారు.

English summary
Telangana Telugu Desam Party chief L Ramana says leaders touch with TDP and He fired at at Congress leader and Kodangal MLA Revanth Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X