వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా ఎఫెక్ట్: పాతబస్తీలో షాపులు 15 రోజులు బంద్..?, స్వచ్చందంగా ముందుకొచ్చిన వ్యాపారులు..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. రోజుకు 500 కన్నా ఎక్కువ పాజిటివ్ కేసులు వస్తున్నాయి. శుక్రవారం గ్రేటర్ పరిధిలోనే 774 పాజిటివ్ కేసులు రావడంతో ఆందోళన నెలకొంది. దీంతో పాతబస్తీలో కొందరు వ్యాపారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వైరస్ ప్రబలుతోన్న నేపథ్యంలో షాపులను 15 రోజులపాటు మూసివేయాలని డిసిషన్ తీసుకున్నారు. దీంతో వైరస్ వ్యాప్తిని అరికట్టొచ్చని భావిస్తున్నారు. కాగా వారి నిర్ణయం వైరస్ స్ప్రెడ్ అవుతోన్న మిగతా ప్రాంతాలకు ఆదర్శంగా నిలుస్తోంది.

పాతబస్తీ చార్మినార్ సమీపంలోని లాడ్ బజార్ మర్చంట్ అసోసియేషన్ స్వచ్చందంగా 15 రోజులపాటు దుకాణాలను మూసివేసి బంద్ పాటిస్తున్నారు. చార్మినార్ చుట్టు ఉన్న ఇస్లామిక్ బుక్స్ షాపు యజమానులు కూడా షాపులను మూసివేశారు. పత్తర్ ఘట్టి ప్రాంతంలో కొందరు షాపు యజమానులు షాపులు తెర‌వ‌డం లేదు. దీంతో చార్మినార్ ఏరియాలో జన సముదాయం భారీగా తగ్గింది. అత్య‌వ‌స‌ర ప‌నులు ఉన్నవారు మాత్రం బ‌య‌ట‌కు వస్తున్నారు. ఆదివారం నుంచి జులై 5తేదీ వ‌ర‌కు బేగంబ‌జార్ మూసివేస్తున్న‌ట్లు వ్యాపారులు ప్ర‌క‌టించారు.

laad bazaar merchants association announces bandh for 15 days..

Recommended Video

Bihar Lightning : పిడుగుల వానతో ఏకంగా 83 మంది మృతి, పెను విషాదం...!! || Oneindia Telugu

కరోనా వైరస్‌తో శుక్రవారం 78 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 4766కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 7436 యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో 4374 నమూనాలను పరీక్షించారు. ఇప్పటి వరకు మొత్తం 75,308 మందిని పరీక్షించారు.

English summary
laad bazaar merchants association announces bandh for 15 days due to spread of coronavirus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X