వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉద్యోగం పోతే.. ఏడాదిపాటు నిరుద్యోగ భృతి: దత్తాత్రేయ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: సెప్టెంబర్ 17న విశ్వకర్మ దినోత్సవాన్ని నిర్వహించాలని కేంద్రం నిర్ణయించిందని, ఆ రోజును జాతీయ కార్మిక దినోత్సవంగా పరిగణిస్తామని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు.
ఈ సందర్భంగా కార్మికులకు అవార్డులను ప్రదానం చేస్తామని, కార్మిక పథకాలను అమల్లోకి తీసుకువస్తామని చెప్పారు

గురువారం హైదరాబాద్‌లోని ఈఎస్‌ఐసీ ప్రాంతీయ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కార్మికరాజ్య బీమా సంస్థలో సభ్యునిగా ఉండి, ఏదేని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థ మూతపడినపుడు, సంస్థలో ఉద్యోగులను తగ్గించినపుడు, ప్రమాదం కారణంగా నిరుద్యోగిగా మారితే రాజీవ్‌ శ్రామిక్‌ కళ్యాణ యోజన కింద ఏడాదిపాటు సగం వేతనాన్ని నిరుద్యోగ భృతి ఇవ్వనున్నట్లు తెలిపారు.

Labour Ministry to celebrate Vishwakarma

ఈ పథకం కింద ఉద్యోగి ఈఎస్‌ఐసీలో కనీసం రెండేళ్ల సభ్యుడిగా ఉండి, నిరుద్యోగిగా మారినపుడు ఏడాదిలోగా క్లెయిమ్‌ చేయాలని పేర్కొన్నారు. మహిళా ఉద్యోగులు, కార్మికులకు ప్రసూతి సెలవుల్ని 13 వారాల నుంచి 26 వారాలకు పెంచామని, తద్వారా 85 లక్షల మంది మహిళా కార్మికులకు లబ్ధిచేకూరనుందని వివరించారు.

త్వరలోనే ఖమ్మం, విజయవాడ, కర్నూలులో ఈపీఎఫ్‌వో ప్రాంతీయ కార్యాలయాలు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. వచ్చే ఈపీఎఫ్‌వో ట్రస్టీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు.

English summary
The Ministry of Labour and Employment will celebrate September 17 as ‘Vishwakarma Dinotsav’ in commemoration of Vishwakarma and the role of handicrafts men, toolmen, labourers and industrialists, Union Minister Bandaru Dattatreya said today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X