వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ లేడీ కండక్టర్ భలే మంచిది: ప్రాణం కాపాడింది

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గుండెపోటుకు గురైన ప్రయాణికుడిని సకాలంలో ఆస్పత్రికి చేర్చి ప్రాణాలు కాపాడిన మహిళా కండక్టర్ నీలిమను తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ గురువారం అభినందించారు. ఆమెకు నగదు పురస్కారం అందించారు.

హైదరాబాదులోని ముషీరాబాద్-1 డిపోలో నీలిమ కండక్టర్‌గా పని చేస్తున్నారు. ఇటీవల 1జె రూట్ బస్సులో ఒక ప్రయాణికుడికి గుండెపోటు వచ్చింది. అదే బస్సులో విధి నిర్వహణలో ఉన్న నీలిమ ఆ ప్రయాణికుడిని వెంటనే హాస్పిటల్‌కు తీసకెళ్లి సత్వరమే చికిత్స అందేలా చూశారు.

 Lady conductor saves life of a passanger

దాంతో అతడి ప్రాణం నిలిచింది. ఈ విషయం తెలుసుకున్న ఆర్టీసీ చైర్మన్ సత్యనారాయణ గురువారం ఆమెను బస్‌భవన్‌లోని తన చాంబర్‌కు పిలిపించి అధికారుల సమక్షంలో నగదు పురస్కారం అందజేసి ప్రశంసించారు. ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఎం రవీందర్, నాగరాజు, పురుషోత్తం నాయక్, సత్యనారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

English summary
A lady conductor of Telangana RTC Neelima had been felicitted for saving a passenger's life in Hyderabad
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X