వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లక్ష్మణ్ అడిగింది మంచి ప్రశ్నేనట .. కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం శ్రమించిన హరీష్ రావు ఎక్కడ ?

|
Google Oneindia TeluguNews

Recommended Video

కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం శ్రమించిన హరీష్ రావు ఎక్కడ..?? || Oneindia Telugu

తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు జూన్ 21వ తేదీన ప్రారంభోత్సవం జరగనుంది. ఇక ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం అహర్నిశలు కష్టపడిన హరీష్ రావు ఎక్కడ అని ప్రశ్నిస్తున్నారు బీజేపీ నాయకులు. అలాగే ప్రజలు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ సమయానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం అహర్నిశలు కృషి చేసిన హరీష్ రావు కు మంత్రి పదవి ఇవ్వాలని హరీష్ అభిమానుల నుండి పెద్ద ఎత్తున డిమాండ్ వినిపించింది. ఆయనకు ఇరిగేషన్ మినిస్టర్ గా అవకాశం ఇచ్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించాలని లేఖ సోషల్ మీడియాలలో వైరల్ అయ్యింది. ఇక తాజాగా బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు లక్ష్మణ్ సైతం కాళేశ్వరం కోసం కేంద్రం చుట్టూ చక్కర్లు కొట్టిన హరీష్ రావు ఎక్కడ అని ప్రశ్నించారు .

కాళేశ్వరానికి నీళ్ళు ... బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు కన్నీళ్లు .. బాల్క సుమన్ సెటైర్లుకాళేశ్వరానికి నీళ్ళు ... బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు కన్నీళ్లు .. బాల్క సుమన్ సెటైర్లు

కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం అహర్నిశలు కష్టపడిన హరీష్ విషయంలో కేసీఆర్ సైలెంట్

కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం అహర్నిశలు కష్టపడిన హరీష్ విషయంలో కేసీఆర్ సైలెంట్

కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం అహర్నిశలు కృషి చేసి, రాత్రనకా పగలనకా శ్రమించిన శ్రామికుడు అయిన హరీష్ రావు అన్న విషయం తెలంగాణా ప్రజలందరికీ తెలిసిందే. కానీ రెండో సారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ సర్కార్ లో హరీష్ రావుకు ఇప్పటి వరకు మంత్రిగా అవకాశం దక్కలేదు. ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం దగ్గర పడుతున్నా ఆ ప్రాజెక్ట్ కోసం కష్టపడిన హరీష్ ఊసే లేదు. నీటి పారుదల శాఖ మంత్రిగా ప్రకటించి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆహ్వానించాల్సిందిగా ఓ డిమాండ్ లేఖ రూపంలో ప్రస్తుతం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారినా, ప్రతిపక్ష పార్టీలు వేలెత్తి చూపుతున్నా కేసీఆర్ లో మాత్రం చలనం లేదు. హరీష్ విషయంలో కేసీఆర్ సైలెంట్ గానే ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం హరీష్ రావ్ ఎంతగా కృషి చేశాడో తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే. అలాంటి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం రోజు హరీష్ రావు లేకుంటే అది లోటుగానే ఉంటుందని భావించిన హరీష్ అభిమానులు ఇప్పుడు కేసీఆర్ ముందు ఒక కొత్త డిమాండ్ పెట్టారు.

కాళేశ్వరం గురించి మాట్లాడుతూ హరీష్ ప్రస్తావన తెచ్చిన లక్ష్మణ్ .. అది కాళేశ్వరం పై హరీష్ మార్క్

కాళేశ్వరం గురించి మాట్లాడుతూ హరీష్ ప్రస్తావన తెచ్చిన లక్ష్మణ్ .. అది కాళేశ్వరం పై హరీష్ మార్క్

తెలంగాణ ప్రాజెక్టుల కోసం అహరహం శ్రమించిన హరీష్ రావు ఎక్కడా కనిపించడం లేదే అంటూ లక్ష్మణ్ కేసీఆర్ పై వ్యంగాస్త్రాలు సంధించి మంచి ప్రశ్న వేశారని అంతా భావిస్తున్నారు . టీఆర్ ఎస్ ముందస్తు ఎన్నికల్లో రెండోసారి అధికారంలోకి వచ్చాక హరీష్ రావుకు కనీసం మంత్రి పదవి ఇవ్వలేదు. కేటీఆర్ కు ఇచ్చినట్టు పార్టీ కీలక పదవి కూడా ఇవ్వలేదు తనకు తన కుటుంబానికి పదవులు దక్కితే చాలనుకునే వ్యక్తి కేసీఆర్ అంటూ లక్ష్మణ్ విమర్శించారు . కేంద్రం తెలంగాణకు ఏం చేయలేదని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సమాధానంగా బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందో ఆ ప్రాజెక్టు కోసం కేంద్రమంత్రుల చుట్టూ తిరిగిన హరీష్ రావును అడిగి తెలుసుకోవాలని లక్ష్మణ్ కేసీఆర్ కు సూచించారు. మోడీ సహకరించకపోతే కాళేశ్వరం పూర్తయ్యేదా?అని ప్రశ్నిస్తూనే హరీష్ ప్రస్తావన తెచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి ఎవరు మాట్లాడినా సరే వచ్చేది ముందు హరీష్ రావు ప్రస్తావనే. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం ఇరిగేషన్ మంత్రిగా హరీష్ చేసిన కృషి అంతటిది. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై ఆయన మార్క్ ఎవరూ కాదనలేనిది .

రేపే ప్రారంభోత్సవం .. హరీష్ పరిస్థితి ఏంటో ?

రేపే ప్రారంభోత్సవం .. హరీష్ పరిస్థితి ఏంటో ?

కాళేశ్వరం కలల ప్రాజెక్టు కర్తవ్యాన్ని బాధ్యతగా, తన ఇంటి సొంతపనిగా భావించిన నాయకుడు హరీష్ రావు ప్రాజెక్టు ప్రారంభానికి కానరావడం లేదు. ఇక ఆయన ఎక్కడా ఆహ్వానాలలో కేసీఆర్ తో పాటుగా కూడా లేరు .కాళేశ్వరం ప్రాజెక్టు కష్టజీవిగా, ఇరవైనాలుగు గంటలు అక్కడ ఉండి పనులను పర్యవేక్షిస్తూ చేదోడు వాదోడుగా నిలిచినా హరీష్‌రావు ఎక్కడనేది అందరూ అడుగుతున్న ప్రశ్న. ఇక రేపు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం సందర్భంగా ఊరూరా పెద్దఎత్తున ఉత్సవాలు జరగాలని , ఊళ్లలో బాణాసంచా పేల్చాలని చెప్పారు కేసీఆర్. మిఠాయిలు పంచాలని, ఊరేగింపులు, ర్యాలీలు నిర్వహించాలని కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించాని కేసీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇదంతా బాగానే ఉన్నా హరీష్ ను రేపు ఆహ్వానిస్తారా ? రేపు కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంలో ఆయన స్థానం ఏంటి ? హరీష్ మంత్రి కాదు కాబట్టి కాళేశ్వరం శిలాఫలకం మీద ఆయన పేరు కూడా ఉండని పరిస్థితి. హరీష్ ఏం చేస్తారో..? కేసీఆర్ హరీష్ విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటారో మరి వేచి చూడాలి .

English summary
The most prestigious Kaleshwaram project in Telangana state will be inaugurated on June 21st. Leader Harish Rao, who considers himself responsible for the work of the Kaleshwaram dream project, does not start the project. He is no where besides KCR in the invitations. In the wake of the inauguration of the Kaleshwaram Project, Harish Rao has been demanding the post of Minister .Harish Rao wants to be the Minister for Heavy Irrigation as the Minister of State . A letter to CM urging him to invite the Kaleshwaram project to start as a minister is now viral on social media. now the question is Will Harish be invited tomorrow? What will be his place at the inauguration of Kaleshwaram Project tomorrow? Since Harish is not a minister, his name does not even bear on the Kaleeswaram inscription. What will Harish do? What will be KCR decide in the issue of Harish.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X