వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ. 10 క్ష బంగారు ఆభరణాల చోరీ: క్లూస్‌టీంతో ఆధారాలు సేకరించిన పోలీసు

రూ. 10 క్ష విలువైన నగలు, లక్ష్మీ విగ్రహం చోరీ అయ్యాయని మానుకోట డీఎస్పీ రాజమహేంద్రనాయక్‌ తెలిపారు.

|
Google Oneindia TeluguNews

మహబూబాబాద్‌ : మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని శ్రీనగర్‌ కాలనీకి చెందిన అంకతి సురేందర్‌ ఇంట్లో ఆదివారం తెల్లవారుజామున రూ. 10 క్ష విలువైన బంగారు నగలు, వెండితో తయారు చేయించినన లక్ష్మీ విగ్రహం చోరీ అయ్యాయని మానుకోట డీఎస్పీ రాజమహేంద్రనాయక్‌ తెలిపారు.

డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం- శ్రీనగర్‌ కానీలో అంకాతి మల్లయ్య మూడు రోజు క్రితం చివరి శ్రావణ శుక్రవారం రోజు కావడంతో హైదరాబాద్‌లోని తన పెద్ద కుమార్తె సుష్మను పిలిపించి ఇంట్లో లక్ష్మీదేవి వ్రతం నిర్వహించారు. వ్రతం చేస్తున్న క్రమంలో ఇంట్లో ఉన్న 13 తులాల మూడు వరుస గొలుసు, ఆరు తులా గుండ్ల హారం, రెండు తులాల సాధారణ గొలుసు, రెండు తులాల చెవి కమ్మలు, బుట్టు, రెండు తులాల చెంపచేరాలు, 5 తులాల నల్లపూస గొలుసు అమ్మవారికి అలంకరించారు. 8 తులా వెండితో లక్ష్మీదేవి విగ్రహాన్ని అమ్మవారి వద్ద ఉంచారు.

Lakshmidevi statue stolen from a house in Mahabobababad

హిందువు సాంప్రదాయం ప్రకారం లక్ష్మీదేవికి అలంకరించిన నగలు మూడు రోజు వరకు అలాగే ఉంచాలి. ఆదివారం రోజు గడిస్తే నగలను అమ్మవారి విగ్రహం నుంచి తీసకొనేవారు. శనివారం రాత్రి భార్య గీత పెద్ద కుమార్తె సుష్మ, చిన్న కుమార్తెతో పాటు 12 గంట వరకు టీవీ చూస్తూ గడిపారు. అనంతరం సురేందర్‌ రాత్రి తెల్లవారుజామున 3 గంట వరకు టీవీ చూస్తూ మెలుకువగానే ఉన్నాడు.

ఆ తర్వాత నిద్రకు ఉపక్రమించిన సురేందర్‌ తెల్లవారుజామున 6 గంటకు బాత్‌ రూంకు వెళ్లేందుకు బయటకు వచ్చాడు. ఈ క్రమంలోనే పూజగది తలుపు తెరిచి ఉండం విగ్రహానికి నగలు లేకపోవడంతో భార్య గీతను నగలు తీశావా అని అడిగాడు. దీంతో భార్య గీత తీయలేదని చెప్పడంతో అమోమయానికి గురయ్యారు. వెంటనే కాలనీవాసులను పిలిచి విషయాన్ని తెలిపారు. దీంతో సురేందర్‌ పోలీసుకు సమాచారం అందించారు.

దీంతో డీఎస్పీ రాజమహేంద్రనాయక్‌, టౌన్‌ సీఐ జబ్బార్‌, ఎస్సై తిరుపతితో రంగప్రవేశం చేసి సంఘటన స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, ఇంటికి ఎవరెవరు వచ్చారనే కోణంలో విచారణ చేపట్టారు. కేసును ఛేదించేందుకు వరంగల్‌ నుంచి క్లూస్‌టీంను రప్పించి వివరాలను సేకరించారు.

ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. ఇప్పటికి కొంత సమాచారం లభించిందని, క్లూస్‌టీం సేకరించిన వివరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టి త్వరలోనే కేసును ఛేదిస్తామని తెలిపారు.

English summary
Rs 10 lakks value Gold and Silver ornaments and Lakshmidevi statue stolen from a house in Mahabobababad district of Telangana
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X