• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

లలిత జ్యువెలర్స్ గుండుబాస్ పాయె..మెగాస్టార్ వచ్చే..కరోనా అవగాహన కోసం టీవిల్లో తరచూ కనిపిస్తున్న చిరు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తమ ఉత్పత్తులను ప్రమోట్ చేసుకునేందకు ఎంతగానో శ్రమిస్తుంటారు యజమానులు. వారు మార్కెట్ లోకి విడుదల చేసే ప్రాడక్టుల గురించి ప్రజలకు తెలియజెప్పేందుకు టీవి ప్రసార మాద్యమాన్నే ఎక్కువగా ఉపయోగించుకుంటారు పారిశ్రామిక వేత్తలు. కొన్ని ఉత్పత్తులను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, అవి ప్రజల మనసుల్లో నాటుకునేలా చేసేందుకు అందమైన మోడల్స్ చేత తమ ప్రాడక్ట్ విశిష్టతను చెప్పించే ప్రయత్నం చేస్తుంటారు. ఒక్క సారి ఆ ప్రాడక్టు క్లిక్కైయ్యిందంటే ఆ ప్రాడక్టుతో పాటు అందులో నటించిన మోడల్ ను ప్రజలు శాశ్వతంగా గుర్తు పెట్టుకుంటారు.

కరోనా వైరస్ ప్రభావం.. టీవీల్లో రద్దైన ప్రకటనలు..

కరోనా వైరస్ ప్రభావం.. టీవీల్లో రద్దైన ప్రకటనలు..

ఆ ప్రాడక్టుకు అంత గుర్తింపు కూడా సదరు మోడల్ తోనే వస్తుందనేది జగమెరిగిన సత్యం. ఇదే కోవలో ఇటీవల టీవిల్లో ఉరుములా వచ్చి మెరుపులా హిట్టయిన ప్రకటన లలితా జ్యువెలర్స్. లలితా జ్యువెలర్స్ ప్రకటన అంత హిట్ అవ్వడానికి కారణం అందులో నటించిన గుండుబాస్ దే. నిగనిగ మెరిసే నున్నటి గుండుతో, ఎవరికైనా డబ్బులు ఊరికే రావని సదరు గుండుబాస్ చెప్పే విధానం తెలుగు ప్రజానికానికి బాగా కనెక్టు అయ్యింది.

బాగా కనెక్టు ఐన లలిత జ్యువెలర్స్ .. లాక్ డౌన్ పాటిస్తున్న గుండుబాస్..

బాగా కనెక్టు ఐన లలిత జ్యువెలర్స్ .. లాక్ డౌన్ పాటిస్తున్న గుండుబాస్..

టీవీల్లో ప్రతి నిమిషానికి ఏదో ఒక ఛానల్ లో ఠకీమని ప్రత్యక్షమయ్యే ఆ గుండుబాస్ అకస్మాత్తుగా కనిపించడం ఆగిపోయింది. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ ఆంక్షలు కొనసాగుతున్న తరుణంలో గుండుబాస్ కూడా స్వీయ నియంత్రణలోకి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. ఆంక్షల నేపథ్యంలో ప్రకటనలు ఇచ్చినా ఉపయోగం ఉండదు కాబట్టి టీవిల్లోని అన్ని రకాల ప్రకటనలను గుండుబాస్ నిలిపేసినట్టు తెలుస్తోంది. ఐతే గుండుబాస్ స్థానాన్ని మెగాస్టార్ చిరంజీవి భర్తి చేస్తున్నట్టు తెలుస్తోంది.

గంటకోసారి కనిపించే గుండుబాస్.. అకస్మాత్తుగా టీవిల్లోంచి మాయం..

గంటకోసారి కనిపించే గుండుబాస్.. అకస్మాత్తుగా టీవిల్లోంచి మాయం..

కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని, అందుకు తీసుకోవాల్సిన అవగాహనా కార్యక్రమాల గురించి మెగాస్టార్ వినూత్నంగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. దేశ ప్రజలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలెవ్వరూ కూడా కరోనా మహామ్మారి బారిన పడకుండా ఉండాలని మెగాస్టార్ చిరంజీవి పరితపిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో బాగంగా ప్రతి గంటకోసారి ఏదో ఒక టీవీలో తను చెప్పాలనుకున్న ముందు జాగ్రత్తలను చెప్పుకొస్తున్నారు చిరంజీవి. ఐతే గతంలో ఏ టీవి పెట్టినా లలితా జ్యువెలర్స్ గుండుబాస్ ప్రత్యక్షం అయ్యేవారు.

TikTok Users Beware, TikTok Addiction Leads To Lost Life
గంటగంటకూ ప్రత్మక్షవుతున్న చిరంజీవి.. అదే సామాజిక బాద్యత అంటున్న ప్రజలు..

గంటగంటకూ ప్రత్మక్షవుతున్న చిరంజీవి.. అదే సామాజిక బాద్యత అంటున్న ప్రజలు..

ప్రస్తుతం లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో ప్రధాన అడ్వర్టైస్ మెంట్లన్నీ తాత్కాలికంగా రద్దైనట్టు తెలుస్తోంది. అందులో భాగంగా లలితా జ్యువెలర్స్ గుండుబాస్ కూడా బుల్లి తెరకు దూరమయ్యారు. ఇప్పుడు ఆ లోటును మెగాస్టార్ చిరంజీవి భర్తీ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే వ్యాపారాత్మకంగా లలితా జ్యువెలర్స్ గుండుబాస్ టీవి తెర మీదకు వస్తే ఓ సామాజిక బాద్యతతో, ప్రాణ నష్టం సంభవించ కుండా ఉండేందుకు తన వంతు కృషి చేసారు చిరంజీవి. అందులో బాగంగా నిత్యం టీవీలో కనిపిస్తున్నారు మెగాస్టార్.

English summary
Currently, all major adverts seem to be temporarily canceled due to the lock-down restrictions. Lalitha Jewelers Gundubass also missed the TV. Now that deficit seems to have been replaced by the megastar Chiranjeevi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X