వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యాదాద్రి భువనగిరి జిల్లాలో భూవివాదం .. మహిళలపై కర్రలతో దాడి .. కేసు నమోదు

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో భూ వివాదాలు ఘర్షణకు కారణమవుతున్నాయి. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాలో భూ వివాదం ఘర్షణలకు దారితీసింది. కర్రలతో దాడి చేసే వరకు వెళ్లింది. భూమి పంచాయతీలో భాగంగా మహిళలని కూడా చూడకుండా కర్రలు, రాడ్లతో దాడి చేయడంతో ఈ వ్యవహారం పోలీసులు కేసు నమోదు చేసే దాకా వెళ్లింది.

రాయలసీమ ఎత్తిపోతలపై సుప్రీం కోర్టుకు వెళ్ళండి ... హైకోర్టు పరిధిలోది కాదన్న ధర్మాసనంరాయలసీమ ఎత్తిపోతలపై సుప్రీం కోర్టుకు వెళ్ళండి ... హైకోర్టు పరిధిలోది కాదన్న ధర్మాసనం

సహజంగా భూతగాదాలు ఏవైనా ఉంటే వాటిని రెవెన్యూ పరిధిలోనే పరిష్కరించుకోవాలి . ఆర్టీవో పరిధిలో రెవెన్యూ వివాదాల పరిష్కారం జరగాలి . భూ తగాదాలలో శాంతిభద్రతల సమస్య నెలకొన్నప్పుడు, ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడుతున్నప్పుడు, ఎవరికైనా ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసినప్పుడు పోలీసులు జోక్యం చేసుకుంటారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోట కొండూరు మండల కేంద్రంలోని ఓ భూ వివాదంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Land dispute in Yadadri Bhuvanagiri district .. Attack on women .. Case registered

Recommended Video

#IndiaChinaFaceOff : డోక్లామ్ ట్రైజంక్షన్ వద్ద క్షిపణి ప్రయోగానికి అవసరమైన బేస్ స్టేషన్లు!!

సర్వేనెంబర్ 296 లో 1.9 గుంటల విస్తీర్ణం ఉన్న భూమి తనదంటే తనదంటూ ఇరు వర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలపై ఉద్రిక్తతలకు దారి తీసింది. మోటకొండూరు లోని సర్వేనెంబర్ 296 లో గల వ్యవసాయ పొలంలో జరిగిన ఈ ఘర్షణలో ఒక వర్గం వారు కర్రలు , రాడ్లతో మరో వర్గం వారిపై దాడికి పాల్పడ్డారు. బురదలోనే ఇరువర్గాల వారు ఘర్షణ కు దిగారు. మహిళలు అని కూడా చూడకుండా దాడి చేయడంతో మహిళలకు గాయాలయ్యాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహిళలని కూడా చూడకుండా, దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

English summary
Yadadri Police have registered a case following a clash between the two groups over a land dispute in yadadri bhuvanagiri district's Mota Kondur mandal center.Clashes between the two factions over the 1.9-acre plot of land on Survey No. 296 have led to tensions. One group attacked them with sticks and rods without even seeing the women, injuring the women.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X