వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎస్సై కాదు రాబంధువు: రాజోలులో ఖాకీ భూ సెటిల్‌మెంట్లు, బంధువుల పేరుతో రిజిస్ట్రేషన్..

|
Google Oneindia TeluguNews

అమాయకులే లక్ష్యంగా ఖాకీ రెచ్చిపోతున్నాడు. వారి భూములను తన బంధువుల పేరుతో రిజిస్ట్రేషన్ చేయిస్తున్నాడు. విషయం తెలుసుకొని బోరుమంటోన్న బాధితులు.. ఆ పోలీసు వద్దకు వెళ్తున్నారు. తమ భూమి ఎలాగైనా తమకే దక్కాలని వేడుకోవడంతో.. ముందు చేయనని, తర్వాత భారీగా నగదు తీసుకొని పని చేయిస్తున్నాడు. గద్వాల జిల్లా రాజోలి ఎస్సై శ్రీనివాసులు భూ దందాకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది.

భూములపై ఎస్సై కన్ను..

భూములపై ఎస్సై కన్ను..


రాజోలి పరిధిలోని విలువైన భూములపై ఎస్సై శ్రీనివాసులు కన్నుపడింది. ఇంకేముంది భూముల జాబితా తీసి తన పని ప్రారంభించాడు. తన అనుయాయుల పేరుతో ఏకంగా రిజిష్ట్రేషన్ చేసేవాడు. తమ భూమి ఇతరుల పేర్లతో ఉండటంపై భూ యాజమానులు విస్తుపోయారు. తమ భూమి రిజిష్ట్రేషన్ అయిన వారిని సంప్రదించారు. ఇదేంటనీ నిలదీయగా.. సీన్‌లోని రాజోలు ఎస్సై శ్రీనివాసులు ఎంటరయ్యారు. అలా ఒక భూ యాజమానిని బెదిరిస్తోన్న వీడియో ఒకటి నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది.

రిజిస్ట్రేషన్ అయ్యిందే..?

రిజిస్ట్రేషన్ అయ్యిందే..?

అలా భూ యాజమానులకు ఎస్పై వద్దకొస్తే.. రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఇక మీరు భూమిపై ఆశలు వదులుకోవాలని చెప్తుంటారు. వారు ఎలాగైనా భూమిని వదులుకొనేందుకు సిద్ధంగా ఉండనందున.. వారి అవసరాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. తొలుత భూమి వారి పేరుతో ఉందని.. పది పైసలు ఎక్కువకో తక్కువకో రిజిస్ట్రేషన్ చేయిస్తామని చెబుతాడు. వారు కాదు.. కూడదని బతిమిలాడటంతో.. చివరకు భారీగా నగదు వసూల్ చేస్తున్నారు. ఎస్సై శ్రీనివాసులు వ్యవహారం పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి కూడా వచ్చింది. దీనిపై విచారణ జరిపేంచేందుకు సిద్ధంగా ఉన్న క్రమంలో.. వీడియో వెలుగులోకి రావడం విశేషం.

న్యాయం చేయరు..?

న్యాయం చేయరు..?

లేని వివాదం సృష్టించి.. యాజమానులను ఎస్సై శ్రీనివాసులు ఇబ్బందికి గురిచేస్తున్నారు. వారు తమ భూమి తమకే కావాలని చెప్పడంతో.. డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు. ఇలా ఇప్పటివరకు భారీగా నగదు కూడబెట్టినట్టు తెలుస్తోంది. తమ భూమిని అనుయాయులకు రిజిస్ట్రేషన్ చేసి, ముక్కుపిండి వసూల్ చేసి శ్రీనివాసులుపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.

English summary
Gadwal district razole si srinivasulu land settlements in town.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X