వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సింధుకు ఇష్టమైన తియ్యని గడ్డ పెరుగును తినొచ్చు: ఆంక్షలు ఎత్తివేసిన గోపిచంద్

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు రజత పతకం సాధించిన బ్యాడ్మింటన్ స్టార్, తెలుగుతేజం పీవీ సింధుపై ఆంక్షలు ఎత్తివేస్తున్నానని లెజెండరీ కోచ్ గోపీచంద్ తెలిపారు. సింధు రజత పతకం సాధించిన అనంతరం గోపీచంద్ మీడియాతో మాట్లాడుతూ గత మూడు నెలలుగా సింధుపై కఠిన ఆంక్షలు అమలులో ఉన్నాయని అన్నారు.

సింధుకు 5 కోట్లు, గోపీకి కోటి: చంద్రబాబును మించి కేసీఆర్ నజరానా

అత్యుత్తమ ప్రదర్శన ప్రదర్శించాలంటే కొంత ఒత్తిడి తప్పదనే తాము నమ్మే సిద్ధాంతంగా ఆయన చెప్పారు. సైనా నెహ్వాల్ నుంచి సింధు వరకు ఇదే ఫార్ములాని తాను అప్లై చేశానని తెలిపారు. మూడు నెలలు క్రితం సింధు ఫోన్ తీసేసుకున్నానని ఆయన అన్నారు.

For last 3 months PV Sindhu's phone was with coach Gopichand

ఇప్పుడు ఆ ఫోన్ ఇచ్చి, తన స్నేహితులతో వాట్సప్ ద్వారా ఛాట్ చేసుకోమని చెబుతానని అన్నారు. అదే విధంగా రియోకు బయల్దేరడానికి ముందు నుంచే సింధుని ఏదీ సరిగ్గా తిననివ్వలేదని ఆయన తెలిపారు. రియో మిషన్ పూర్తి అయినందున సింధుకు ఎంతో ఇష్టమైన తియ్యని గడ్డపెరుగును తిననిస్తానని ఆయన తెలిపారు.

3 కోట్లు, అమరావతిలో 1000 గజాలు: సింధుకు ఏపీ ప్రభుత్వం భారీ నజరానా

దీంతోపాటు ఐస్ క్రీం కూడా ఆమెను తిననివ్వలేదని, ఇకపై ఆమెకు నచ్చినది తినొచ్చని, సాధారణ యువతిలా ఇప్పుడు జీవితాన్ని ఆస్వాదించవచ్చని ఆయన చెప్పారు. ఒలింపిక్స్‌లో సింధు ఆటతీరు తాను గర్వించేలా ఉందని అన్నారు. ఫైనల్ మ్యాచ్‌లో కోర్టులో సింధు కదిలిన తీరు, పోరాట పటిమ అద్భుతమని కొనియాడారు.

తమ కష్టానికి ఫలితం దక్కిందని, సింధు అత్యుత్తమంగా ఆడిందని కితాబిచ్చారు. మారిన్ కూడా ఎంతో అద్భుతంగా ఆడిందని, తన కంటే బాగా ఆడిన క్రీడాకారిణి చేతిలో సింధు ఓడిందన్నారు. ఒలింపిక్స్‌లో రజతం సాధించిసాధించిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.

English summary
When it boils down to matters of discipline, Pullela Gopichand has no peers with PV Sindhu learning it the hard way since her formative years at the legendary coach's academy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X