• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కబ్జాలపై కొరడా ...దేవుడి భూములు కబ్జా చేస్తే క్రిమినల్ కేసులు .. ఇదే లాస్ట్ వార్నింగ్

|
  దేవుడి భూములు కబ్జా చేస్తే క్రిమినల్ కేసులు .. ఇదే లాస్ట్ వార్నింగ్ || Oneindia Telugu

  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కబ్జారాయుళ్ళు రెచ్చిపోతున్నారు. దేవుడి మాన్యాలు సైతం వదిలిపెట్టకుండా కబ్జా చేస్తున్నారు. అయితే ఈ కబ్జారాయుళ్ల పై కొరడా ఝళిపించటానికి రంగం సిద్ధం చేసుకుంటుంది దేవాదాయశాఖ.

  చంద్రబాబునాయుడు ఈజ్ ఏ బచ్చా ... దేశంలో బీజేపీ గెలిస్తే చీకటే .. ఓ టీవీ షో లో కేఏపాల్ హంగామా

  దేవాలయ భూములను వదిలిపెట్టండి... కబ్జాదారులకు లాస్ట్ వార్నింగ్

  దేవాలయ భూములను వదిలిపెట్టండి... కబ్జాదారులకు లాస్ట్ వార్నింగ్

  రాష్ట్రవ్యాప్తంగా దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చే 12645 ఆలయాలు, మఠాలకు సంబంధించి ఉన్న 84 వేల 195 ఎకరాల భూములు ఉన్నట్టు లెక్క తేల్చారు అధికారులు. అయితే ఈ భూముల్లో నాలుగోవంతు కబ్జాలకు గురైనట్లుగా గుర్తించిన అధికారులు కబ్జారాయుళ్ల పై కొరడా ఝళిపించనున్నారు .

  దేవాదాయ శాఖ కమిషనర్ ఈ విషయంలో కబ్జాదారులకు లాస్ట్ వార్నింగ్ ఇచ్చారు .కబ్జా చేసిన ఆలయ భూములు తిరిగి వెనక్కి ఇచ్చేయాలని లేదంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కమిషనర్ అనిల్ కుమార్ హెచ్చరించారు.

  దేవాదాయ శాఖ భూముల పరిరక్షణ కోసం నడుం బిగించిన అధికారులు

  దేవాదాయ శాఖ భూముల పరిరక్షణ కోసం నడుం బిగించిన అధికారులు

  మియాపూర్ భూముల వ్యవహారంపై సీఎం కేసీఆర్ ఆరా తీసిన మరుసటి రోజునే దేవాదాయ భూముల విషయంలో కమిషనర్ కఠిన నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

  ఒక్క హైదరాబాద్లోనే దేవాదాయ శాఖకు చెందిన పది వేల కోట్ల విలువైన ఆలయ భూములు వివాదాల్లో ఉన్నట్లుగా గుర్తించారు అధికారులు. ప్రభుత్వం సమగ్ర భూ సర్వే నిర్వహించిన సమయంలో చాలావరకు ఆలయ భూముల లెక్క తేలింది. ఇప్పటివరకూ ఉన్న లెక్కల ప్రకారం కబ్జాలకు గురైన ఆలయ భూములన్నింటినీ తిరిగి రక్షించడం కోసం చర్యలు చేపట్టనున్నారు అధికారులు.

  ఆలయ భూములు కబ్జా చేసిన ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్న కమీషనర్

  ఆలయ భూములు కబ్జా చేసిన ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్న కమీషనర్

  ఇక ఆలయ భూములు కబ్జా చేసిన ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని తేల్చి చెబుతున్నారు. దేవాదాయ శాఖకు సంబంధించిన ఆస్తుల లీజుల విషయంలో కూడా కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నారు. నామమాత్రపు ధరకు దేవాదాయ శాఖకు సంబంధించిన షాపులను లీజుకు తీసుకొని తిరిగి వాటిని అధిక అద్దెకు సబ్ లీజుకు ఇస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇక ఎంతో కాలంగా ఉన్నటువంటి అద్దెలను సైతం పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. మొత్తానికి ఇంతకాలానికి దేవుడి మాన్యాలపై, దేవాదాయ శాఖకు సంబంధించిన ఆస్తుల పై దృష్టిసారించిన ప్రభుత్వం అధికారులను ఎంతటివారినైనా ఉపేక్షించవద్దని ఆదేశాలు జారీ చేసింది. అందుకే దేవాదాయ శాఖ అధికారులు కబ్జా చేస్తే క్రిమినల్ కేసులు పెడతామంటూ దేవాదాయశాఖ ఆస్తుల పరిరక్షణకు నడుం బిగించారు.

  ఆలయ భూములను వదిలిపోకుంటే క్రిమినల్ కేసులు తప్పవు .. కమీషనర్ అనిల్ కుమార్

  ఆలయ భూములను వదిలిపోకుంటే క్రిమినల్ కేసులు తప్పవు .. కమీషనర్ అనిల్ కుమార్

  గురువారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ, చాలా ప్రాంతాల్లో దేవాలయాల భూములను కొంతమంది ఆక్రమించుకున్నారన్నారు. దేవుడి భూములను ఆక్రమించుకున్న వారు వెంటనే ఈ భూములను వదిలి వేయాలని, సంబంధిత దేవాలయాల పాలక వర్గాలకు అప్పచెప్పాలని సూచించారు. దేవాదాయ శాఖ చేసిన సూచనలను పాటించని వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు చట్టరీత్యా చర్య తీసుకుంటామని హెచ్చరించారు. ఈ పరిస్థితిలో శిక్షనుండి తప్పించుకునేందుకు ఇప్పటికైనా దేవాలయాల భూములను అనుభవిస్తున్న వారు తమ అధీనంలో ఉన్న భూములను ఖాళీ చేసి, దేవాదాయ శాఖకు అప్పగించాలని ఆదేశించారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Those who occupy the land of endowment suggested that these lands should be immediately given to therelevant temples. The endowment Department has issued to file criminal cases against those who did not follow the instructions and who occupied the endowment lands. commissioner of endowment warned the land grabbers and announced to take action. In this situation, those who still enjoy the temple lands to escape punishment are ordered to evacuate the lands belonging to them and hand them over to the Department of the endowment.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more