హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మాజీ సీఎంకు నివాళి: ఆత్మీయంగా కేంద్రమంత్రి దత్తన్న, ఎంపీ జేసీ (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గొప్ప పరిపాలనాదక్షుడుగా స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డిని పలువురు పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. సీఎంగా, గవర్నర్‌గా, కేంద్రమంత్రిగా మర్రి చెన్నారెడ్డి చేసిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు. మర్రి చెన్నారెడ్డి 97వ జయంతి ఉత్సవాలు బుధవారం ఇందిరా పార్కు చెన్నారెడ్డి రాక్ గార్డెన్‌లో ఘనంగా నిర్వహించారు.

ఈ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ విషయంలో తలొగ్గకుండా రాష్ట్రానికి న్యాయం చేసేందుకు అహర్నిశలు కృషి చేశారని కొనియాడారు. ఈ సందర్భంగా రూపొందించిన నూతన సంవత్సరం క్యాలెండర్‌ను దిగ్విజయ్ సింగ్, నాయిని నరసింహారెడ్డి ఆవిష్కరించారు.

ఈ జయంతి ఉత్సవాల్లో ఏఐసీసీ నాయకులు, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్ సింగ్, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత కె. జానారెడ్డి, ఎంపీలు వీహెచ్, నంది ఎల్లయ్య, కొండా విశ్వేశ్వరరెడ్డి, టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గీతా రెడ్డి, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు.

వీరితో పాటు మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, అంజన్ కుమార్ యాదవ్, మాజీ మంత్రులు గడ్డం ప్రసాద్, దానం నాగేందర్, మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్యమ్య, మాజీ డిప్యూటీ మేయర్ గొల్కొండ రాజ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డిలతో పాటు నగర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మాజీ సీఎంకు నివాళి

మాజీ సీఎంకు నివాళి

గొప్ప పరిపాలనాదక్షుడుగా స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డిని పలువురు పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు.

మాజీ సీఎంకు నివాళి

మాజీ సీఎంకు నివాళి

సీఎంగా, గవర్నర్‌గా, కేంద్రమంత్రిగా మర్రి చెన్నారెడ్డి చేసిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు. మర్రి చెన్నారెడ్డి 97వ జయంతి ఉత్సవాలు బుధవారం ఇందిరా పార్కు చెన్నారెడ్డి రాక్ గార్డెన్‌లో ఘనంగా నిర్వహించారు.

మాజీ సీఎంకు నివాళి

మాజీ సీఎంకు నివాళి

ఈ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ విషయంలో తలొగ్గకుండా రాష్ట్రానికి న్యాయం చేసేందుకు అహర్నిశలు కృషి చేశారని కొనియాడారు.

మాజీ సీఎంకు నివాళి

మాజీ సీఎంకు నివాళి

ఈ సందర్భంగా రూపొందించిన నూతన సంవత్సరం క్యాలెండర్‌ను దిగ్విజయ్ సింగ్, నాయిని నరసింహారెడ్డి ఆవిష్కరించారు.

మాజీ సీఎంకు నివాళి

మాజీ సీఎంకు నివాళి

ఈ జయంతి ఉత్సవాల్లో ఏఐసీసీ నాయకులు, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్ సింగ్, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మాజీ సీఎంకు నివాళి

మాజీ సీఎంకు నివాళి

వీరితో పాటు కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత కె. జానారెడ్డి, ఎంపీలు వీహెచ్, నంది ఎల్లయ్య, కొండా విశ్వేశ్వరరెడ్డి, టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గీతా రెడ్డి, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు.

మాజీ సీఎంకు నివాళి

మాజీ సీఎంకు నివాళి

వీరితో పాటు మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, అంజన్ కుమార్ యాదవ్, మాజీ మంత్రులు గడ్డం ప్రసాద్, దానం నాగేందర్, మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్యమ్య, మాజీ డిప్యూటీ మేయర్ గొల్కొండ రాజ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డిలతో పాటు నగర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

English summary
Late CM Marri Chenna reddy Jayanthi at Indira park held on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X