వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫేస్‌బుక్‌ పరిచయంతో వివాహితపై లైంగిక వేధింపులు, లాయర్ అరెస్ట్

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఈవెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న ఓ వివాహితను వేధించిన లాయర్‌ను హైద్రాబాద్ పోలీసులు మంగళవారం నాడు అరెస్ట్ చేశారు.బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన వివాహితను లైంగిక వేధింపులకు పాల్పడడంతో బాధితురాలు ఫిర్యాదు చేసింది.

ఫేస్‌బుక్ ద్వారా మహిళలతో పరిచయాలు పెంచుకోవడం వారిని మోసం చేయడం వంటి ఘటనలను తరచూ వింటూనే ఉన్నాం. ఇదే తరహ ఘటన ఒకటి వెలుగు చూసింది. వివాహిత వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకొని ఆమె పట్ల అసభ్యంగా స్నేహితుల సహయంతో ఫేస్‌బుక్‌లో పోస్టులు పెడుతున్నాడని బాధితురాలు ఆరోపిస్తోంది.

నిందితుడి వేధింపులు భరించలేక బాధితురాలు చివరికి పోలీసులను ఆశ్రయించింది. లాయర్‌గా పనిచేస్తున్న నిందితుడు ఓ రాజకీయపార్టీలో యువజన విభాగంలో కూడ పనిచేస్తున్నాడని బాధితురాలు చెబుతున్నారు.

వివాహితను వేధించని కేసులో లాయర్ అరెస్ట్

వివాహితను వేధించని కేసులో లాయర్ అరెస్ట్

హైద్రాబాద్ నగరంలో ఈవెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న ఓ వివాహితను వేధించిన లాయర్‌ను లంగర్‌హౌజ్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పాతబస్తీకి చెందిన బేగ్‌పై లంగర్‌హౌజ్‌కు చెందిన 33 ఏళ్ల మహిళ ఫిర్యాదు చేసింది. మొదట ఫేస్‌బుక్‌లో పరిచయమైన బేగ్,ఆ తర్వాత వ్యక్తిగతంగా కలిశాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పుడు తనను లైంగికంగా వేధిస్తూ వెంటాడుతున్నాడని ఆమె ఫిర్యాదులో తెలిపింది.ఈ ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేశారు.

పార్టీలకు వెళ్ళాను

పార్టీలకు వెళ్ళాను


ఈవెంట్‌ మేనేజర్‌ కావడం వల్ల వృత్తిపరంగా తాను బేగ్ తో కలిసి కొన్ని పార్టీలకు హాజరయ్యానని బాధితురాలు చెప్పారు.ఈ క్రమంలో అతను తన వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకోవడం ప్రారంభించాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తన స్నేహితులతో కలిసి ఫేస్‌బుక్‌లో తనకు అసభ్య మెసేజ్‌లు పంపిస్తున్నాడని ఆమె తెలిపింది.

లైంగిక వేధింపులు

లైంగిక వేధింపులు

తన వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని నిందితుడు తనను వేధింపులకు గురిచేస్తున్నాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు

భర్తకు తప్పుడ ప్రచారం

భర్తకు తప్పుడ ప్రచారం

నిందితుడు తన స్నేహితుల ద్వారా తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు ఈ తప్పుడు ప్రచారాన్ని తన భర్తకు కూడ చేరవేశారని ఆమె చెబుతున్నారు ఈ వేధింపులు భరించలేకే నిందితుడిపై ఫిర్యాదు చేసినట్టు ఆమె చెప్పారు.

English summary
The Langar Houz police on Tuesday arrested a lawyer on charges of stalking a woman working as an event manager in the city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X