హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వేధింపులు భరించలేకే న్యాయవాదిని సజీవ దహనం చేశా: లోకేష్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రెండ్రోజుల క్రితం జరిగిన న్యాయవాది ఉదయ్ కుమార్ సజీవ దహనం కేసును పోలీసులు ఛేదించారు. న్యాయవాది హత్యకు భూ వివాదమే కారణమని తేల్చారు. న్యాయవాదిని హత్య చేసిన గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన లోకేష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

కీసరలోని 5 ఎకరాల భూమిని ఉదయ్ కుమార్ గతంలో లోకేష్‌కు విక్రయించారు. ఆ తర్వాత ఆ భూమి తమకు కావాలని, డబ్బు తిరిగి చెల్లిస్తామని లోకేస్‌కు పలుమార్లు చెప్పారు. అతడు అంగీకరించకపోవడంతో ఉదయ్ కుమార్ అతనిపై తీవ్రంగా ఒత్తిడి చేశారు.

ge

ఈ నేపథ్యంలోనే ఒత్తిడి, వేధింపులు తట్టుకోలేక ఉదయ్ కుమార్‌ను కర్రతో కొట్టి ఆ తర్వాత కారులో బంధించి సజీవ దహనం చేసినట్లు లోకేష్ పోలీసులు ముందు అంగీకరిచాడు. లోకేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు సోమవారం సాయంత్రం మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. లోకేష్‌కు సహకరించిన అతడి స్నేహితుడిని కూడా అరెస్ట్ చేసినట్లు తెలిసింది.

దారుణం: కారుతో సహా న్యాయవాదిని సజీవదహనం చేశారు

గత శనివారం అర్ధరాత్రి కీసర సమీపంలో తన కారులోనే ఉదయ్ కుమార్ సజీవ దహనమైన విషయం తెలిసిందే. వేగంగా స్పందించిన పోలీసులు.. నిందితుడ్ని అరెస్ట్ చేశారు.

English summary
An accused arrested by Hyderabad police in lawyer murder case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X