హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేజ్రీవాల్ కావొద్దని కేసీఆర్‌కు హెచ్చరిక: కేంద్రమంత్రి సదానందకు షాకిచ్చారు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడకు జడ్డిలు, న్యాయవాదులు బుధవారం నాడు షాకిచ్చారు. ఏకంగా వారు కేంద్రమంత్రి పైనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ రోజు పలువురు రంగారెడ్డి న్యాయవాదులు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఆయన పైన ఫిర్యాదు చేశారు.

'తెలంగాణని ఏలేందుకు బాబు కొత్త కుట్ర!', ఆ జడ్జిలు వీరే (పిక్చర్స్)

గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా హైకోర్టు విభజన పైన హామీ ఇచ్చారని, ఇప్పుడు దానిని నెరవేర్చడం లేదని ఫిర్యాదు చేశారు. ఆయన మాట తప్పారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసీఆర్ జంతర్ మంతర్ వద్ద మరో కేజ్రీవాల్ కావొద్దని సదానంద హెచ్చరించిన విషయం తెలిసిందే.

datta

కాగా, తెలంగాణ న్యాయాధికారుల సంఘం నేతలను సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తూ మంగళవారం ఉమ్మడి హైకోర్టులో తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల జేఏసీ చేపట్టిన మొదటి కోర్టు విధుల బహిష్కరణ ఉద్రిక్తంగా మారింది.

వాటిని చూడండి, హైకోర్టు తర్వాతే ఏదైనా: కేంద్రానికి కేసీఆర్ చురక

హైకోర్టు ప్రాంగణంలోకి న్యాయవాదుల ప్రవేశాలపై అంక్షలు విధించడం, కోర్టు హాల్‌లోకి వెళ్తున్న సహాయ ప్రభుత్వ న్యాయవాదులు(ఏజీపీ)లను నిరోధించడంతోపాటు తెలంగాణ న్యాయవాదులను అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్తత కనిపించింది.

భద్రత మధ్య తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ దిలీప్ బీ భోసలే ఆధ్వర్యంలోని ద్విసభ్య ధర్మాసనం విధులను నిర్వహించింది. ఏజీపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పుడు అడ్వకేట్ జనరల్ జోక్యం చేసుకోవడంతో వివాదం కొద్దిగా సద్దుమణిగినప్పటికీ, మిగతా న్యాయవాదులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

datta

మరోవైపు మంగళవారం మరికొందరు తెలంగాణ న్యాయాధికారులసంఘం నేతలను హైకోర్టు సస్పెండ్ చేయడంపై న్యాయవాదులు మండిపడ్డారు. సస్పెన్షన్ నిర్ణయాలకు వ్యతిరేకంగా బుధవారం పూర్తిస్థాయిలో హైకోర్టు విధులను బహిష్కరించాలని సంఘం నిర్ణయం తీసుకున్నది. నగరంలోని న్యాయవాదులు హైకోర్టుకు తరలిరావాలని సంఘం అధ్యక్షుడు గండ్ర మోహన్‌రావు పిలుపునిచ్చారు.

English summary
Lawyers complaint against Union Minister Sadananda Gowday in Saroor Nagar police station.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X