హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'గ్రేటర్' దేవుడిచ్చిన వరం: కెసిఆర్ ఫ్యామిలీపై రేవంత్, లాయర్ల ఫిర్యాదు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ యువ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ లాయర్ల జేఏసీ మంగళవారం నాడు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచార సందర్భంలో భాగంగా రేవంత్ రెడ్డి మంత్రి కెటి రామారావు పైన అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.

తెలంగాణ సాధనలో పాల్గొని, ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మంత్రి పైన ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేశారని లాయర్ల జేఎసి పేర్కొంది. ఫిర్యాదు చేసిన వారిలో న్యాయవాదులు గోవర్ధన్ రెడ్డి, ఉపేంద్ర, నరేందర్, రవిమోహన్ తదితరులు ఉన్నారు.

కాగా, సోమవారం నాడు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం పైన విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కుటుంబ పాలన చేస్తోందని, ఆ కుటుంబాన్ని ఒడించేందుకు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు దేవుడు ఇచ్చిన వరమని అన్నారు.

టిడిపి, బిజెపి బహిరంగ సభ

టిడిపి, బిజెపి బహిరంగ సభ

మల్కాజిగిరిలో సోమవారం నాడు సాయంత్రం టిడిపి - బిజెపి బహిరంగ సభ జరిగింది. ఈ సభలో ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, టిడిపి తెలంగాణ చీఫ్ ఎల్ రమణ, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ బిజెపి చీఫ్ కిషన్ రెడ్డి, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, ఎంపీ మల్లారెడ్డి పాల్గొన్న దృశ్యం.

టిడిపి, బిజెపి బహిరంగ సభ

టిడిపి, బిజెపి బహిరంగ సభ

హైదరాబాదును విశ్వనగరంగా మార్చడం తమకే సాధ్యమని, భాగ్యనగరం అభివృద్ధికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు.

టిడిపి, బిజెపి బహిరంగ సభ

టిడిపి, బిజెపి బహిరంగ సభ

హైదరాబాద్ నుంచి బెంగళూరు, హైదరాబాద్ నుంచి అమరావతికి నాలుగు లేన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశామని నితిన్ గడ్కరీ చెప్పారు.

టిడిపి, బిజెపి బహిరంగ సభ

టిడిపి, బిజెపి బహిరంగ సభ

మల్కాజిగిరిలోని ఆనంద్ బాగ్‌లో టిడిపి - బిజెపి మిత్రపక్షాల ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి.

కెసిఆర్‌ను కలిసిన నితిన్

కెసిఆర్‌ను కలిసిన నితిన్

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును క్యాంప్ కార్యాలయంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సోమవారం కలిసిన దృశ్యం.

English summary
Lawyers jac complaint against revanth Reddy for his comments on Minister KTR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X