వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయాలి .. కాళేశ్వరంపై లక్ష్మణ్ సవాల్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. ఆ పార్టీ నేతలు తెలంగాణ ప్రభుత్వ గొప్పతనమని బీరాలు పోతుంది. దీంతో బీజేపీ నేతలు స్పందించారు. అంతా మీరే చేశారా అని ఎదురుదాడికి దిగారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేయడంలో రాష్ట్ర బీజేపీ నేతల పాత్ర లేదా అని ప్రశ్నించారు. అన్నీ తామే చేసినట్టు గొప్పలు చెప్పుకోవడం సరికాదన్నారు లక్ష్మణ్.

తగునా మీకిది ...?
కాళేశ్వరం ప్రాజక్టు నిర్మాణంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పాత్ర ఎంత ఉందో .. కేంద్ర ప్రభుత్వం పాత్ర కూడా అంతే ఉందని స్పష్టంచేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ విసిరారు. టీఆర్ఎస్ నేతలు చెప్పే మాటలను ప్రజలు విశ్వసించారని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు పూర్తయ్యేసరికి ఎంత వ్యయం అయ్యందో చెప్పాలని కోరారు. ఇందులో రాష్ట్ర వాటా ఎంత ? కేంద్రం ఎంతమొత్తంలో నిధులను సమకూర్చిందనే అంశాన్ని వివరించాలని సవాల్ విసిరారు.

laxman fire on trs party leaders

మీరే తీసుకొచ్చారా ..?
కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు తెచ్చింది రాష్ట్ర బీజేపీ నేతలు కాదా అని ప్రశ్నించారు లక్ష్మణ్. కానీ తాము ఏం చేయలేదని టీఆర్ఎస్ నేతలు చెప్తున్నారని విమర్శించారు. అలాగే రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ బలపడడాన్ని చూసి ఆ పార్టీ నేతలు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. కరీంనగర్‌లో కేసీఆర్ ముఖ్య అనుచరుడు వినోద్‌ను బండి సంజయ్ ఓడించిన విషయాన్ని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న నియంతృత్వ పోకడలను బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డాకు వివరిస్తామని తెలిపారు. ప్రజల ఆకాంక్షల వ్యతిరేకంగా జరగుతున్న పరిస్థితులను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తామని స్పష్టంచేశారు.

English summary
With the inauguration of the Kaleshwaram Project, the TRS series was engaging in celebrations. The leaders of that party are the greats of the Telangana government. BJP leaders responded. Did everything yourself. Asked whether the role of the state BJP leaders in granting permits for the Kaleshwaram project was questioned.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X