వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పంజాబ్ తరహ ప్లాన్: కెసిఆర్‌కు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ ప్లాన్ ఇదే

పంజాబ్ తరహలో ప్లాన్‌ను అమలుచేయాలని కాంగ్రెస్ అమలుచేయనుంది.రిజర్వ్‌డ్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎల్‌డీఎంఆర్‌సి అమలుచేయనుంది.మధిరలో ఎల్‌డీఎంఆర్‌సి ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

ఖమ్మం: రిజర్వ్‌డ్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ వ్యూహరచన చేస్తోంది. పంజాబ్ రాష్ట్రంలో అనుసరించిన ఎల్‌డీఎంఆర్‌సీ వ్యూహం సత్పలితాలను ఇవ్వడంతో తెలంగాణలో కూడ ఈ తరహ ఎల్‌డీఎంఆర్‌సీ ప్రయోగాన్ని అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు

ఆయన ఎన్‌టిఆర్‌ను ముంచాడు, భట్టివిక్రమార్క తీవ్ర విమర్శలుఆయన ఎన్‌టిఆర్‌ను ముంచాడు, భట్టివిక్రమార్క తీవ్ర విమర్శలు

రిజర్వ్‌డ్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక ప్రణాళికను సిద్దం చేసింది. పంజాబ్‌ రాష్ట్రంలో ఈ తరహ ప్లాన్ సక్సెస్ అయింది.ఇదే ప్లాన్‌ను అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని ఎఐసిసి నిర్ణయించింది. తెలంగాణలో ఈ కార్యక్రమాన్ని తెలంగాణలోని మధిర నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు.

ప్రజలకు కాంగ్రెస్ పార్టీని మరింత చేరువ చేసేందుకు వీలుగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎల్‌డీఎంఆర్‌సీ వ్యూహన్ని అమలు చేయనుంది.ఈ వ్యూహన్ని అమలు చేసేందుకు కార్యాచరణను కాంగ్రెస్ పార్టీ సిద్దం చేసుకొంది.

రిజర్వ్‌డ్ నియోజకవర్గాలపై కాంగ్రెస్ కన్ను

రిజర్వ్‌డ్ నియోజకవర్గాలపై కాంగ్రెస్ కన్ను

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కూడ ఇదే తరహ ప్లాన్‌ను కాంగ్రెస్ పార్టీ అమలు చేసింది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి రిజర్వ్‌డ్ నియోజకవర్గాలపై కేంద్రీకరించడం కూడ ప్రధాన కారణంగా చెబుతారు రాజకీయ విశ్లేషకులు.ఇదే తరహ ప్రయోగాన్ని అమలు చేయడం ద్వారా పంజాబ్ రాష్ట్రంలో మంచి ఫలితాలు వచ్చాయని కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం భావిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో దీన్ని అమలు చేయనున్నారు.

మధిరలో ప్రయోగాత్మకంగా ఎల్‌డీఎంఆర్‌సీ అమలు

మధిరలో ప్రయోగాత్మకంగా ఎల్‌డీఎంఆర్‌సీ అమలు

ఎల్‌డీఎంఆర్‌సీని ఉమ్మడి ఖమ్మం జిల్లా మధిర అసెంబ్లీ నియోజకవర్గంలో అమలు చేయనున్నారు.ఈ మేరకు కొంతకాలం క్రితమే ఎల్‌డీఎంఆర్‌సీకి అవసరమైన బృందాన్ని రాష్ట్ర కాంగ్రెస్‌ ఎంపిక చేసింది. రిజర్వుడు నియోజకవర్గాల్లో అన్ని సామాజిక వర్గాల కూర్పుతో 10-15 మంది చొప్పున బృందాన్ని సిద్ధం చేసి అధిష్ఠానానికి వివరాలు తెలిపింది. దీనిని ర్యాప్‌ రాహుల్‌ యాక్షన్‌ టీమ్‌ అని కూడా పిలుస్తున్నారు.

ప్రతి ఇంటికి వెళ్ళి సమాచార సేకరణ

ప్రతి ఇంటికి వెళ్ళి సమాచార సేకరణ

ఎల్‌డీఎంఆర్‌సీ సభ్యులకు ప్రాథమిక శిక్షణ ఇస్తారు. నియోజకవర్గంలోని గ్రామాలకు పంపుతారు. టీపీసీసీ కమిటీతో కలిపి ప్రతి గ్రామంలో మొత్తం 10 కమిటీలు ఉంటాయి. గ్రామానికి 100 మంది కాంగ్రెస్‌ సభ్యులు ఉంటారు. వీరికి బూత్‌ కమిటీలు కూడా తోడవుతాయి. వీరు ఆ గ్రామంలోని ప్రతి ఇంటికీ వెళ్లి.. ఆ ఇంట్లోని ఓటర్లు, కుటుంబసభ్యుల వివరాలతోపాటు ప్రభుత్వం నుంచి వారు లబ్ధి పొందుతున్న పథకాల వివరాలు సేకరిస్తారు.

 టీపీసీసీతో అనుసంధానం

టీపీసీసీతో అనుసంధానం

ఎల్‌డీఎంఆర్‌సీని టీపీసీసీతో అనుసంధానం చేస్తారు.ప్రభుత్వం నుంచి ఏయే ప్రయోజనాలు అందుతున్నాయు? ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరాయా? ప్రభుత్వం నుంచి వాళ్లింకా ఏమి ఆశిస్తున్నారు? వంటి వివరాలు సేకరిస్తారు. దీనినిబట్టి ప్రభుత్వంపై ప్రజలకు ఎలాంటి అభిప్రాయం ఉందో, వారికింకేమి కావాలో రాష్ట్ర నాయకత్వం అంచనాకు వస్తుంది.. ఈ ఫీడ్‌ బ్యాక్‌ను అనుసరించి రాష్ట్ర నాయకత్వం అధిష్టానం సూచనల మేరకు ఆ నియోజకవర్గంలో అనుసరించాల్సిన వ్యూహాన్ని రూపొందించుకుంటుంది. స్థానిక ప్రజాప్రతినిధి గానీ, లేదా పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థిగానీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహన్ని రూపొందించుకొంటారు.

English summary
Tpcc will implement LDPC programme in Madhira assembly segment soon.Telangana congress party working president Mallu Bhatti vikramarka said that we will plan as per the LDPC information.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X