• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఎలక్ట్రానిక్‌ విప్లవానికి ఆధ్యుడు,గొప్ప దార్శనికుడు.!ప్రధానిగా రాజీవ్‌ గాంధీ దేశ సమగ్రతను కాపాడారన్న భట్టి.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : కాంగ్రెస్‌ పార్టీ మాజీ జాతీయ అధ్యక్షులు, మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్‌ గాంధీ గొప్ప దార్శనికుడు, రాజనీతిజ్ఞుడని సీఏల్పీ నేత భట్టి విక్రమార్క కొనియాడారు. శనివారం పంజాగుట్ట సర్కిల్ లో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆ తర్వాత హైదరాబాద్ గాంధీభవన్ లో రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు మాజీ పార్లమెంటు సభ్యులు వి హనుమంత రావు తో కలిసి రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు భట్టి విక్రమార్క.

 దేశ సమైక్యత,సమగ్రతను కాపాడిన గొప్ప ప్రధాని రాజీవ్ గాంధీ.. వర్ధంతి కార్యక్రమంలొ సీఎల్పీ నేత భట్టి

దేశ సమైక్యత,సమగ్రతను కాపాడిన గొప్ప ప్రధాని రాజీవ్ గాంధీ.. వర్ధంతి కార్యక్రమంలొ సీఎల్పీ నేత భట్టి


అనంతరం గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.1985 నుంచి 1991 వరకు ఎఐసిసి అధ్యక్షులుగా, 1984 నుంచి 1989 వరకు భారత ప్రధానిగా అటు కాంగ్రెస్‌కు ఇటు దేశానికి ఎనలేని సేవ చేసారని స్వర్గీయ రాజీవ్ గాంధీ సేవలను భట్టి విక్రమార్క గుర్తు చేసారు. జాతి నిర్మాణంలో యవతకు ప్రాధాన్యత కల్పించాలన్న ఉద్దేశంతో ఓటు కనిష్ట వయోపరిమితిని 21 నుంచి 18 సంవత్సరాలకు తగ్గించిన ఘనత రాజీవ్‌ గాంధీకి దక్కుతుందని భట్టి అన్నారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించి మహిళా సాధికారతకు కృషి చేసిన మహిళా పక్షపాతి రాజీవ్ గాందీ అని భట్టి అన్నారు.

 ఎలక్ట్రానిక్‌ విప్లవానికి ఆధ్యుడు రాజీవ్ గాంధీ.. గాంధీభవన్,పంజాగుట్టలో వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొన్న భట్టి

ఎలక్ట్రానిక్‌ విప్లవానికి ఆధ్యుడు రాజీవ్ గాంధీ.. గాంధీభవన్,పంజాగుట్టలో వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొన్న భట్టి


అంతే కాకుండా దేశంలో సమాచార, ఎలక్ట్రానిక్‌ విప్లవానికి రాజీవ్‌ ఆద్యుడని పేర్కొన్నారు. ప్రపంచంలో పేరుగాంచిన ఐటీ రంగ సంస్థలకు మన దేశస్థులు సీఈవోలుగా నేడు కొనసాగడానికి రాజీవ్ గాంధీ దేశంలో వేసిన ఐటీ పునాదులే దోహదపడ్డాయని భట్టి గుర్తు చేసారు. రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన టెక్నాలజీ ద్వారానే మన దేశంలో కి సెల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయని వివరించారు. దేశ సమైక్యత సమగ్రతను కాపాడిన గొప్ప ప్రధాని అని కొనియాడారు భట్టి విక్రమార్క కొనియాడాలు.

 జాతిని మతపరంగా విభజన చేసేందుకు బీజేపి కుట్ర.. అప్రమత్తంగా ఉండాలన్న భట్టి

జాతిని మతపరంగా విభజన చేసేందుకు బీజేపి కుట్ర.. అప్రమత్తంగా ఉండాలన్న భట్టి

జాతి సమైక్యత కోసం రాజీవ్ గాంధీ దేశం మొత్తం సద్బావన యాత్ర చేసిన మహనీయుడు అని భట్టి పేర్కొన్నారు. దేశంలో మానవవనరుల సంపదను గొప్పగా వినియోగించుకుని అభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో మొట్టమొదటిసారిగా హ్యూమన్ రీసోర్సెస్ మంత్రిత్వ శాఖను సృష్టించి ఈ శాఖకు అపార అనుభవం కలిగిన పీవీ నరసింహారావును మంత్రిగా నియమించారని తెలిపారు. అధికార వికేంద్రీకరణ ద్వారా గ్రామ స్వరాజ్యం తీసుకువచ్చిన ఘనత రాజీవ్ గాంధీకి దక్కుతుందన్నారు. కేంద్రం నుంచి నేరుగా గ్రామాలకు నిధులు విడుదల చేసి గ్రామాల అభివృద్ధికి రాజీవ్ గాంధీ బాటలు వేశారని భట్టి వివరించారు

 రాజీవ్ ఆశయాలకు తూట్లు పొడిచే విధంగా బిజెపి వ్యవహారం.. తిప్పికొట్టాలని పిలుపునిచ్చిన సీఎల్పీ నేత భట్టి..

రాజీవ్ ఆశయాలకు తూట్లు పొడిచే విధంగా బిజెపి వ్యవహారం.. తిప్పికొట్టాలని పిలుపునిచ్చిన సీఎల్పీ నేత భట్టి..

జాతిని ఐక్యం చేయడంతో పాటు దేశ సమగ్రత కోసం పాటు పడిన రాజీవ్ ఆశయాలకు తూట్లు పొడిచే విధంగా బిజెపి వ్యవహరిస్తున్నదని భట్టి మండిపడ్డారు. జాతిని మతపరంగా విభజన చేసి అధికారం చెలాయించేందుకు బిజెపి చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ దేశ సమైక్యత, సమగ్రత కోసం రాజీవ్ గాంధీ ఆశయాలను, ఆలోచలను ప్రజల్లోకి భారత్ జోడో నినాదంతో తీసుకు వెళ్లడమే రాజీవ్ గాంధీ కి మనం ఇచ్చే ఘనమైన నివాళి అని పేర్కొన్నారు. భట్టి విక్రమార్క తో పాటు మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, సుధీర్ రెడ్డి, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

English summary
CLP leader Bhatti Vikramarka hailed Rajiv Gandhi as a great philosopher and statesman. On Saturday, wreaths were laid at the Rajiv Gandhi statue in Panjagutta Circle. He later attended the Rajiv Gandhi Vardhanthi function at the Gandhi Bhavan in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X