హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'అవమానపరుస్తూ సంబరాలా, కవిత కోసమే మహిళలకు మంత్రి పదవి ఇవ్వడం లేదు'

జనాభాలో సగ భాగం ఉన్న మహిళలను ముఖ్యమంత్రి కెసిఆర్ అవమానపరుస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎమ్మేల్సీ షబ్బీర్ అలీ ఆరోపించారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్:జనాభాలో సగభాగం ఉన్న మహిళలను ముఖ్యమంత్రి కెసిఆర్ అవమానపరుస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎమ్మేల్సీ షబ్బీర్ అలీ ఆరోపించారు.మహిళకు మంత్రి పదవిని ఇస్తే కవితకు ప్రాధాన్యత తగ్గే అవకాశం ఉన్నందున మహిళలను క్యాబినెట్ లో తీసుకోలేదన్నారాయన.

అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన బుదవారం నాడు పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జనాభాలో సగ భాగం ఉన్న మహిళలకు మంత్రి పదవి ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు.

least priority for women in trs government

రాష్ట్రంలో మహిళ అంటే మీ కూతురు కవిత ఒక్కరేనా అని ఆయన ప్రశ్నించారు. మహిళలకు మంత్రి పదవులు ఇస్తే తన కూతురుకు ప్రాధాన్యత దక్కదనే కెసిఆర్ భయపడుతున్నారని ఆయన ఆరోపించారు.

ఆడవాళ్ళకు ఒక్క పదవి ఇవ్వకుండా సంబరాలు జరుపుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. కెసిఆర్ కు చిత్తశుద్ది ఉంటే ఒక్క ఎమ్మేల్సీ పదవైనా మహిళకు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. మహిళలకు అన్యాయం జరుగుతున్న రాష్ట్రంలో తెలంగాణ మాత్రమే ఉందని షబ్బీర్ అలీ చెప్పారు.

English summary
Least priority for women in trs government alleged congress leader shabbir ali.no right to celebrate international women's day celebrations.except kavitha no woman leader in the state he asked.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X