
ఏమీ రాంబాబు.. లెక్చరర్ అయితే మాత్రం..?, డ్రెస్ గురించి తల గోడకోసి కొడతావా
టీచర్/ లెక్చరర్లు.. విద్యా బుద్దులు చెప్పాలి. మంచి నడవడిక అలవాటు చేయాలి. కానీ ఈరోజుల్లో కొందరు అలా చేయడం లేదు. స్టూడెంట్స్పై ప్రతాపం చూపిస్తున్నారు. అవును చేయి చేసుకుంటున్నారు. వాస్తవానికి ట్రైన్డ్ టీచర్లు/ లెక్చరర్లు చేయి చేసుకోకూడదు.. కొందరికీ మాత్రం అలాంటి నియమ, నిబంధనలు ఏమీ వర్తించడం లేదు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ లెక్చరర్ ఇలానే ప్రవర్తించాడు.

డ్రెస్ గురించేనా..?
ఆ విద్యార్థిని లెక్చరర్ కొట్టడానికి సరయిన కారణం కూడా లేదు. అవును.. డ్రెస్ సరిగా లేదని చితక్కొట్టాడు. డ్రెస్ గురించి కొట్టడం ఏంటీ అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. వాస్తవానికి కాలేజీ అంటే టీనేజీలో యువత డ్రెస్సులు అలానే ఉంటాయి. వారికి సరిగ్గా పాఠం చెప్పాలి.. కానీ ఇలా చేయడం ఏంటీ అనే చర్చ జరుగుతుంది. డ్రెస్ వేసుకోవడంతో తలను గోడకోసి కొట్టాడు. దీంతో అతని చిన్న మెదడు వాచిందని వైద్యులు తెలిపారు.

లెక్చరర్ రాంబాబు
లెక్చరర్ పేరు రాంబాబు కాగా.. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థి కార్తీక్, డ్రెస్ గురించి దారుణంగా కొట్టడంతో.. అతని పరిస్థితి సీరియస్ అయ్యింది. కొత్తగూడెంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఇప్పటికీ అతని సిచుయేషన్ సీరియస్ అని వైద్యులు అంటున్నారు. చిన్న మెదడు వాయడంతో ఆపరేషన్ అవసరం అవుతుందని చెబుతున్నారు. తమ బిడ్డపై దాడి చేసిన లెక్చరర్‌పై చర్యలు తీసుకోవాలని అతని పేరంట్స్ కోరుతున్నారు.

డ్రెస్ కోడ్ ఉండదే.. మరీ
కాలేజీలో అయితే డ్రెస్ కోడ్ ఏమీ ఉండదు. ఏవో కొన్ని కాలేజీలు.. అవీ కూడా ప్రొఫెషనల్ కోర్సులు అయితే మాత్రమే ఉంటాయి. కానీ డ్రెస్ అని.. దారుణంగా బాదడం మాత్రం సరికాదు. ఇదే విషయాన్ని తోటి విద్యార్థులు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు అంటున్నాయి. లెక్చరర్ అయితే అతను హద్దు మీరి ప్రవర్తించొద్దు అని కొందరు సూచిస్తున్నారు. విద్యార్థి ప్రాణానికి ఏమైనా అయితే ఎవరూ బాధ్యులు అని కోరుతున్నారు. తమ కుమారుడికి జరిగిన నష్టానికి బాధ్యులు అయిన రాంబాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని అడుగుతున్నారు. కాలేజీ నుంచి తొలగించాలని.. మరో విద్యార్థి బాధ పడకూడదని అని మరికొందరు అంటున్నారు.