వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీఎస్ఆర్ఆర్టీసీ సమ్మె, బంద్‌కు సంఘీభావంగా వామపక్షాల ధర్నా

|
Google Oneindia TeluguNews

ఆర్టీసీ కార్మికులు అక్టోబర్ 19న చేపట్టిన తెలంగాణ రాష్ట్ర బంద్‌కు సంఘీభావంగా వామపక్ష పార్టీలు ఇందిరాపార్క్ వద్ద దీక్షను చేపట్టాయి. దీక్షను ప్రోఫెసర్ నాగేశ్వర్ ప్రారంభించారు. సంఘీభావ దీక్షలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని సీతారాంతో పాటు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడవెంకట్ రెడ్డి ఇతర నేతలు పాల్గోన్నారు.

డీజీల్ ధరలపై పన్నులు తగ్గిస్తే ఆర్టీసీ నష్టాలనుండి బయటపడుతోందని ప్రోఫెసర్ నాగేశ్వర్ రావు అన్నారు. నష్టాలు వస్తున్నా కూడ ఆర్టీసీపై పన్నులు వేస్తున్నారని ఆయన విమర్శంచారు. సీఎం కేసీఆర్ అధికార దాహంతో విర్రవీగుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడవెంకట్ రెడ్డి విమర్శించారు. ఈ నేపథ్యంలోనే పలువురు నేతలు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. వెంటనే ప్రభుత్వం సానుకూలంగా స్పందించి చర్చలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

మరోవైపు 19తేదీ రాష్ట్ర వ్యాప్త బంద్‌ను విజయవంతం చేసేందుకు ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున సన్నాహాలు చేయడంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నారు.దీంతో నిరసనలతో రాష్ట్రం అట్టుడుకుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఆర్‌టిసిని ప్రభుత్వంలో విలీనం చేయాలనే నినాదాలతో ఆర్‌టిసి డిపోల వద్ద చేపడుతున్న నిరసన కార్యక్రమాలతో డిపోలు దద్దరిల్లిపోతున్నాయి. అఖిలపక్ష నాయకులు, జెఎసి నాయకులు, విద్యార్థి సంఘాలతో కలిసి వందలాది మంది ఆర్‌టిసి కార్మికులు పాదయాత్రల్లో పాల్గొని ఆర్‌టిసిని పరిరక్షించాలని డిమాండ్లను లేవనెత్తుతున్నారు. నగరంలోని ప్రధాన డిపోల వద్ద నిరసన కార్యక్రమాలు రోజూవారిగా కొనసాగుతున్నాయి.

English summary
Left parties staged dharna at Indira Park in solidarity with the Telangana state bandh held by RTC strike on October 19
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X