హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏడు గంటల ఉత్కంఠకు తెర: ఎట్టకేలకు వలలో చిక్కిన చిరుత

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మెదక్ జిల్లా కొల్చారం మండలం చుక్కాపూర్‌లో మంగళవారం ఉదయం కలకలం సృష్టించిన చిరుతను ఎట్టకేలకు అటవీ సిబ్బంది బంధించారు. ఈరోజు ఉదయం నుంచి కూడా చుక్కాపూర్‌లోని ప్రజలను చిరుత ఆందోళనకు గురి చేసింది.

చిరుతను పట్టుకునేందుకు గ్రామస్తులు, అటవీశాఖ అధికారులు చేసిన రెండో ప్రయత్నంలో వలలో దానిని బంధించారు. మొదటి ప్రయత్నంలో భాగంగా అటవీ శాఖ అధికారులు నాసిరకం వలలో చిరుతను బంధించేందుకు ప్రయత్నించగా తప్పించుకున్న సంగతి తెలిసిందే.

Leopard creates Panic in medak district and attacked by woman

సుమారు ఏడు గంటల పాటు చిరతు అటవీ సిబ్బందిని ఆందోళనకు గురి చేసింది. అటవీశాఖ అధికారలను ముప్పుతిప్పలు పెట్టిన చిరుత మద్యాహ్నాం 2 గంటల ప్రాంతంలో వలలో చిక్కోవడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. చివరక చిరుతను పట్టుకోవడంతో 19 ఇళ్లు ఉన్న చుక్కాపూర్ గ్రామస్తులు హార్షం వ్యక్తం చేశారు.

వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నారు. గతంలో కూడా ఈ గ్రామంలో చిరుత సంచరించినట్లు సమాచారం. మంగళవారం ఉదయం నుంచి చిరుతను పట్టుకునే క్రమంలో చుక్కాపూర్ గ్రామంలోని గ్రామస్తులపై దాడి చేసింది.

Leopard creates Panic in medak district and attacked by woman

ఈ దాడిలో సుమారు ఎనిమిది మంది వరకు గాయపడ్డారు. గాయపడ్డ వారిని హైదరాబాద్‌లోని ఫీవర్ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

English summary
Leopard creates Panic in medak district and attacked by woman.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X