నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విద్యుత్ స్తంభం ఎక్కి.. కరెంట్ షాక్‌తో చిరుతపులి మృతి

విద్యుత్‌ స్తంభం ఎక్కిన ఓ చిరుతపులి కరెంట్‌షాక్‌కు గురై మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. నిజామాబాద్‌ మండల కేంద్రంలోని మల్లారం అటవీ ప్రాంతం నుంచి దారితప్పి శనివారం ఓ చిరుతపులి.

|
Google Oneindia TeluguNews

నిజామాబాద్‌: విద్యుత్‌ స్తంభం ఎక్కిన ఓ చిరుతపులి కరెంట్‌షాక్‌కు గురై మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. నిజామాబాద్‌ మండల కేంద్రంలోని మల్లారం అటవీ ప్రాంతం నుంచి దారితప్పి శనివారం ఓ చిరుతపులి జనావాసాల్లోకి వచ్చింది.

స్థానికులు గుర్తించి అటవీ అధికారులకు సమాచారం అందించారు. అంతలోపే చిరుత విద్యుత్‌ స్తంభం ఎక్కింది. అయితే ఆ సమయంలో విద్యుత్‌ సరఫరా జరుగుతుండటంతో కరెంట్‌షాక్‌కు గురై తీగలపైనే మృతి చెందింది.

Leopard Die Due To Current Shock

కాగా, నిజామాబాద్ ఫారెస్ట్ ఆఫీసర్ రవిమోహన్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ వెటర్నరీ ఆస్పత్రికి చిరుత మృతదేహాన్ని తరలించారు. చిరుత ఊర్లోకి రావడంతో ఒక్కసారిగా జనమంతా భయాందోళనలకు గురయ్యారు. అయితే, ఈ విధంగా మృతి చెందడంతో వారంతా బాధను వ్యక్తం చేశారు.

English summary
A Leopard Died Due To Current Shock in Nizamabad district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X