రంగారెడ్డి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వామ్మో .. చిరుత ... రంగారెడ్డి జిల్లా కడ్తాల్ లో సంచారం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : అటవీ తగ్గడం .. ఆహార కొరతతో మూగజీవాలు జనారణ్యంలోకి వస్తోన్నాయి. ప్రతి ఊరిలో కోతుల బెడద తప్పడం లేదు. కోతులంటే ఓకే కానీ ఏనుగు .. చిరుతలు వస్తే ఏం చేయాలి. శ్రీకాకులం జిల్లాలో తరచుగా చిరుతల సంచారం ఉండగా .. హైదరాబాద్ శివారులో చిరుత సంచారంతో స్థానికులు వామ్మో అని బెంబేలెత్తిపోతున్నారు.

కడ్తాల్ లో చిరుత సంచారం
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలో చిరుతపులి సంచరిస్తోంది. ఇక్కడ చిరుత సంచరిస్తుందని స్థానికులు సమాచారం ఇవ్వడంతో అటవీ అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వారం రోజుల క్రితం యాచారం మండలం మేడిపల్లిలో సంచరించగా .. మూడురోజుల నుంచి కడ్తాల్ మండలం గోవిందాయపల్లి, చరికొండ, ముద్దిన్, ఎక్వాయిపల్లి, పల్లెచెలుకతండా గ్రామాలను ఆనుకొని ఉన్న ఫార్మాసిటీ అడవుల్లో సంచరించింది.

leopard wandering rangaredy dist

లేగదూడలపై దాడి ..
గురువారం తెల్లవారుజామున గోవిందాయపల్లి శివారులో నిట్ట శ్రీశైలం, మల్లయ్య రైతులకు చెందిన లేగ దూడలపై దాడి చేసింది. అవి చనిపోవడంతో గ్రామస్తులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. వారు అక్కడ సెన్సార్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయగా ఆ రోజు రాత్రి 10.30 గంటలకు మరో లేగదూడపై చిరుతపులి దాడిచేసిన దృశ్యాలు కనిపించాయి. దీంతో దానిని పట్టుకునేందుకు అటవీ అధికారులు రంగంలోకి దిగారు. చిరుతను పట్టుకునేందుకు బోనులు ఏర్పాటు చేశారు.

English summary
The leopard is rounds in the Kadtal Mandal district of Ranga Reddy. as locals informed the leopard that the leopard was here ..Forest officials set up c c cameras. A fortnight ago, the yacharam mandalam maddipalli wandered in three days from Kadtal Mandalam Govindialapalli, Chirangoda, Mudin, Ekwoppally, villages of Pallhekkulthantha in the forest of the pharmacy forests.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X