హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆన్‌లైన్‌లో మారణాయుధాల కొనుగోలు: 12మంది అరెస్ట్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఆన్‌లైన్‌ ద్వారా మారణాయుధాలు కొనుగోలు చేసిన 12 మందిని హైదరాబాద్‌ నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్ని నుంచి 12 మారణాయుధాల్ని స్వాధీనం చేసుకున్నారు. వీరందరిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకృష్ణరావు తెలిపారు.

నేర రహిత హైదరాబాద్‌ కోసం అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని చెప్పారు. చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరో నేరం చేయడానికే ఈ ఆయుధాలు కొనుగోలు చేసినట్లు తెలుస్తోందన్నారు డీసీపీ.

 Lethal weapons seized, 12 arrested

వాహన పూజలో అపశృతి: ముగ్గురికికి గాయాలు

ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడలోని రాజరాజేశ్వరి స్వామి ఆలయంలో వాహన పూజలో అపశృతి చోటు చేసుకుంది. రాజన్న ఆలయం ముందు వాహన పూజ చేస్తుండగా నిలిపి ఉంచిన బొలెరో వాహనం ఒక్కసారిగా ముందుకు దూకి క్యూలైన్‌లోకి దూసుకెళ్లింది. దీంతో దర్శనం కోసం వేచి ఉన్న ముగ్గురు భక్తులకు తీవ్రగాయాలయ్యాయి.

మరో ద్విచక్ర వాహనం ధ్వంసమైంది. బాధితులను ఆసుపత్రికి తరలించారు. హైద్రాబాద్‌ మియాపూర్‌కు చెందిన లక్ష్మి, నరసింహస్వామి దంపతులు గాయపడగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీరిని ఆలయ అధికారులు పరామర్శించారు.

English summary
The Hyderabad city police on Monday arrested 12 persons and seized lethal weapons from them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X