వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

73ఛానెళ్ల లైసెన్స్ రద్దు చేసిన కేంద్రం: ‘మా టీవీ’ కూడా

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: గత కొంత కాలంగా నిబంధనలు ఉల్లంఘించి ప్రసారాలను కొనసాగిస్తున్న 73 టీవీ చానళ్లు సహా 24 ఎఫ్ఎం ఛానళ్లు, 9 పత్రికలపై నిషేధం విధిస్తున్నట్టు సమాచార, ప్రసారాల శాఖ తెలిపింది. అప్ లింకింగ్ గైడ్ లైన్స్ పాటించనందుకు ఇంతవరకూ 73 ఛానళ్ల అనుమతులు రద్దు చేసినట్టు రాజ్యసభకు ఐఅండ్ బీ(ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్) శాఖ సహాయమంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ వెల్లడించారు.

ఈ ఛానళ్లలో.. జస్ట్ టీవీ, ఖాస్, మోహువా పంజాబీ, మోహువా తెలుగు, విజన్ ఎంటర్ టెయిన్మెంట్, కీ టీవీ తదితరాలు ఉన్నాయి. గడచిన ఏడాది వ్యవధిలో వీటిని నిషేదించినట్టు ఆయన వివరించారు.

వీటితో పాటు ఫోకస్ ఎన్ఈ, ఫోకస్ హర్యానా, ఎస్టీవీ హర్యానా, లెమన్ టీవీ తదితరాలకు హోం మంత్రిత్వ శాఖ సెక్యూరిటీ క్లియరెన్స్ ఇవ్వని కారణంగా వాటిని కూడా నిషేధించినట్టు పేర్కొన్నారు.
ఆరు ప్రైవేటు ప్రసార సంస్థలకు చెందిన 24 ఎఫ్ఎం ఛానళ్లు పర్మిషన్ ఒప్పందాలు అతిక్రమించిన కారణంగా నిషేదించినట్టు తెలిపారు.

Licences of 73 TV channels, 24 FM stations cancelled: Government

ప్రింట్ మీడియాలో నిబంధనలకు కఠినతరం చేయనున్నామని, ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్ అండ్ పబ్లికేషన్స్ చట్టం 1897ను సవరించనున్నామని రాజ్యవర్థన్ వివరించారు. కాగా, దేశంలో 42 ప్రైవేటు ఛానళ్లకు, 196 కమ్యూనిటీ రేడియో స్టేషన్లకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు.

మా టీవీ ఛానళ్లు కూడా రద్దు

మా టీవీ నెట్‌వర్క్ లైసెన్స్ రెన్యూవల్స్‌ను కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ నిరాకరించింది. మా టీవీ, మాగోల్డ్, మా మూవీస్, మా మ్యూజిక్ లైసెన్స్‌లను రద్దు చేశారు. తాజాగా రెన్యువల్ చేసిన లైసెన్స్‌‌ల జాబితా నుంచి మా టీవీ నాలుగు చానెల్స్‌ను కేంద్రం తొలగించింది.

మా సంస్థ డైరెక్టర్‌పై ఉన్న ఆర్థిక నేరాల అభియోగాల కారణంతో క్లియరెన్స్‌ను హోంశాఖ సెక్యూరిటీ నిరాకరించింది. ప్రసారమంత్రిత్వ శాఖ అప్‌ లింకింగ్‌, డౌన్‌ లింకింగ్ నిబంధనలకు అనుగుణంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మా టీవీ చానెల్స్‌ను స్టార్‌గ్రూప్‌ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. కేంద్ర నిర్ణయంతో లైసెన్స్‌లను తమ పేరిట మార్చుకునేందుకు స్టార్‌గ్రూప్‌ సిద్ధమైనట్లు తెలుస్తోంది.

English summary
The Information and Broadcasting (I&B) Ministry has cancelled the "permission" of 73 TV channels, 24 FM channels and nine newspapers periodicals for violations in recent years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X