India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పది మందితో కలుసుడు కాదు..! ప్రాణాలు ముఖ్యం..! సీఎం కేసీఆర్ సంకల్పానికి జోహార్ అంటున్న ప్రజలు..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : దేశంలో ఏదైనా విపత్తు సంభవించినప్పుడు ఆదేశాన్ని పరిపలించే పాలకుడు తీసుకునే కీలక నిర్ణయాల మీద దేశ మనుగడ ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం భారత దేశం ఇలాంటి విపత్తునే ఎదుర్కొంటోంది. ముఖ్యంగా సకల సంస్కృతుల సమాహారంగా విరాజిల్లుతున్న హైదరాబాద్ మహానగరంలో కరోనా మహమ్మారి తన విశృంఖలత్వాన్ని చాటకముందే దాని మీద విజయం సాధించాలన్నది తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సంకల్పంగా తెలుస్తోంది. అందులో భాగంగా గత రెండు వారాలుగా స్వీయ నియంత్రణ పాటిస్తున్న ప్రజలు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. ఈనెల 14తో లాక్ డౌన్ ముగుస్తున్నందున, మరో రెండు వారాల పాటు స్వీయ నియంత్రణ పాటిస్తే కరోనా మహమ్మారి మీద విజయం సాధించొచ్చిని సీఎం భావిస్తున్నారు.

<strong>వగలమారి కరోనా, కయ్యాల కరోనా.. విరహాల కరోనా... కరోనా కమామిషులో దాగున్న ఎన్నో కథలు..!!</strong>వగలమారి కరోనా, కయ్యాల కరోనా.. విరహాల కరోనా... కరోనా కమామిషులో దాగున్న ఎన్నో కథలు..!!

Lockdown : Telangana CM KCR Favours Extension Of National Lockdown
ప్రజల సంక్షేమమే లక్ష్యం..

ప్రజల సంక్షేమమే లక్ష్యం..

దేశ ప్రజలతో పాటు తెలంగాణ ప్రజల సంక్షేమం, శ్రేయస్సే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. దేశంలో తలెత్తిన కరోనా విపత్తును అధిగ మించేందుకు ప్రజలందరూ ఏకాభిప్రాయానికి రావాలని పిలుపినిస్తున్నారు. సరైన ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో సభ్య దేశాలు కొన్ని కరోనా బారిన పడి విలవిలలాడుతున్నాయని సీఎం చంద్రశేఖర్ రావు ఆవేదన వ్యక్తం చేసారు. భారతదేశానికి గాని, తెలంగాణ ప్రజానికానికి గాని అలాంటి పరిస్థితులు తలెత్తకూడదని సీఎం చంద్రశేఖర్ రావు భావిస్తున్నారు. అందులో భాగంగా ప్రజలు ఇలాంటి కీలక సమయంలో మరింత బాద్యతగా వ్యవహరించాలని గుర్తు చేస్తున్నారు.

 ప్రాణం పోయిన తర్వాత ఏం చేయలేం..

ప్రాణం పోయిన తర్వాత ఏం చేయలేం..

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని కోరుతూ దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ విధించిన లాక్ డౌన్ గడువు పూర్తి కాబోతోంది. మరో వారం రోజుల తర్వాత ఆంక్షలు సడలిపోనున్నాయి. అయితే దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి, రోగుల సంఖ్య, మరణాలను దృష్టిలో ఉంచుకుని లాక్ డౌన్ నిబంధనలపై ప్రధాని మరోసారి ప్రకటన చేయనున్నారు. ఐతే ఇదే అంశం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. ప్రజల ప్రాణాలకంటే ఏదీ ముఖ్యం కాదని, కరోనాను తరిమికొట్టేందుకు మరింత అప్రమత్తంగా ఉంటూ ప్రభుత్వం నిర్ధేశించిన మార్గదర్శకాలను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచిస్తున్నారు.

కరోనా పై విజయం సాదించే సమయం ఇదే..

కరోనా పై విజయం సాదించే సమయం ఇదే..

ఇదిలా ఉండగా తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని సమర్ధవంతంగా అడ్డుకోగలిగామని సీఎం చంద్రశేఖర్ రావు స్పష్టం చేస్తున్నారు. ప్రజలందరూ ఏక తాటిపై రావడమే కాకుండా క్లిష్ట సమయంలో ఎంతో స్పూర్తివంతంగా వ్యవహరించారని గుర్తు చేైసారు. కరోనా వైరస్ కు మందు కనిపెట్టలేదు కాబట్టి స్వీయ నియంత్రణే పెద్ద ఔషదంగా అభివర్ణించారు చంద్రశేఖర్ రావు. అగ్ర దేశం అమెరికా కరోనా పట్ల ముందు జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు తగు మూల్యం చెల్లించుకుంటోందని, మరికొన్ని దేశాలు కూడా అదే సమస్యను తీవ్రంగా ఎదుర్కొంటున్నాయని విశ్లేషించారు. కాని 130కోట్ల ప్రజలున్న భారతదేశం అప్రమత్తంగా వ్యవహరించింది కాబట్టి కరోనా వ్యాప్తిని నిలువరించగలిగి ప్రాణనష్టాన్ని అదుపుచేయగలిగిందని అభిప్రాయపడ్డారు.

లాక్ డౌన్ పొడిగిస్తేనే శ్రేయస్కరం..

లాక్ డౌన్ పొడిగిస్తేనే శ్రేయస్కరం..

కాగా ఈనెల 14తో లాక్ డౌన్ ఆంక్షలు ముగిసిపోనుండడంపై సీఎం చంద్రశేకర్ రావు కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రజా శ్రేయస్సు దృష్టిలో ఉంచుకుని ఇవే ఆంక్షలను ఒకటి లేదా రెండు వారాలు పొడిగించాలని ఆకాంక్షించారు. ఇదే అంశాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లనున్నట్టు వివరించారు. ఒకవేళ లాక్ డౌన్ ఆంక్షలను సడలిస్తే ప్రజలందరూ మళ్లీ సమూహాలుగా ఏర్పడతారని, వారి దైనందిక కార్యకలాపాలను అడ్డుకోడం సరైన చర్యకాదని, అందుకోసం లాక్ డౌన్ ఆంక్షలను పొడిగిస్తేనే శ్రేయస్కరంగా ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ప్రజలు సహనంగా ఉండాలని, మరి కొద్ది రోజులు ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యం, సంక్షేమం పట్ల సీఎం చంద్రశేఖర్ రావుకు ఉన్న కృతనిశ్చయాన్ని ప్రజలు ప్రశంసిస్తున్నారు. సీఎం తీసుకున్న ముందు చూపు నిర్ణయానికి జోహార్ అంటున్నారు తెలంగాణ ప్రజలు.

English summary
CM Chandrasekhar Rao has made key comments about the end of the lockdown. These restrictions are intended to be extended by one or two weeks for public welfare. CM said Prime Minister Narendra Modi will address the same issue soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X