• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ప్రసాదం పెట్టి, రూ.1.33 కోట్లు కొట్టేసిన బాబా: రైస్ ఫుల్లింగే'లైఫ్‌స్టైల్' ఓనర్ కొంపముంచింది!

|

హైదరాబాద్: భాగ్యనగరంలో బుధవారం నాడు పూజల పేరుతో పరమాన్నం పెట్టిన ఓ దొంగ స్వామీజీ ప్రముఖ వ్యాపారవేత్త నుంచి రూ.1.33 కోట్లు కొట్టేసిన సంఘటన చోటు చేసుకుంది. బాధితుడు ప్రముఖ లైఫ్‌స్టైల్ భవనం యజమాని మధుసూదన్ రెడ్డి.

విల్లా కి'లేడీ'లో కొత్త ట్విస్ట్‌లు: సీఐ బెదిరిస్తున్నాడని లలిత ఫిర్యాదు

లైఫ్ స్టైల్ భవనం యజమాని మధుసూదన్ రెడ్డి బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే కాలనీలో ఉంటున్నారు. ఇటీవలే కర్నాటకలో పూజలు చేసే ఓ బాబా గురించి తెలుసుకున్నారు. ఇంట్లో పరిస్థితులు బాగాలేవని, శాంతి పూ జలు చేయించాలని బంధువులు చెప్పడంతో మధుసూదన్ రెడ్డి కుమారుడు సందేశ్ బాబాకు ఫోన్ చేశారు.

Lifestyle owner robbed of 1.33 crore by 'godman'

సదరు స్వామీజీ మంగళవారం నాడు హైదరాబాద్ వచ్చాడు. అతని కోసం ఓ లాడ్జి తీసుకున్నారు. బుధవారం ఉదయం పది గంటలకు ఆ బాబా.. మధుసూదన్ రెడ్డి డుప్లెక్స్ ఇంటికి వచ్చాడు. డఫస్ట్ ప్లోర్లో ముగ్గువేసి ఉదయం పదకొండు గంటల సమయంలో పూజలు ప్రారంభించాడు.

Lifestyle owner robbed of 1.33 crore by 'godman'

మధుసూదన్ రెడ్డి, ఆయన భార్య విద్యావతి(46), కుమారుడు సందేశ్ (28) పూజలో కూర్చున్నారు. కొద్దిసేపటికి ఇంట్లోని నగదంతా ఒక వస్త్రంలో ఉంచి ముగ్గు మధ్యలో ఉంచాలని చెప్పగా... రూ.1.33 కోట్ల నగదును వారు అందులో ఉంచాడు.

సాయంత్రం నాలుగు గంటలకు పూజ పూర్తయిందని ఆ బాబా చెప్పాడు. భోజనం తినకూడదని, ప్రత్యేకంగా తానే ప్రసాదంగా పరమాన్నం చేశానని ముగ్గురికీ ఇచ్చాడు. అది తిన్నవెంటనే వారు స్పృహ కోల్పోయారు. తర్వాత రూ.1.33 కోట్ల నగదుతో బాబా ఉడాయించాడు. తర్వాత చూసేసరికి అతను లేడు. దొంగ బాబా అని గుర్తించారు.

ప్రయాణికులే టార్గెట్: సెల్‌ఫోన్లు, పర్సులు క్షణాల్లో మాయం(పిక్చర్స్)ఫోన్‌ చేసినా స్పందించలేదు. మధుసూదన్ రెడ్డి బంధువు ఒకరు రాత్రి ఏడుగంటల ప్రాంతంలో ఇంటికి వచ్చి వారిని అపోలో ఆసుపత్రికి తరలించారు. విద్యావతి, సందేశ్ కోలుకున్నారు. మధుసూదన్ రెడ్డి ఐసీయులో చికిత్స పొందుతున్నారు.

Lifestyle owner robbed of 1.33 crore by 'godman'

శక్తిమంతమైన నిద్రమాత్రల వల్లే వీరంతా అపస్మారక స్థితిలోకి వెళ్లుంటారని పోలీసులు చెబుతున్నారు. ఇంట్లో, లాడ్జిలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నామని, లాడ్జిలో శివ పేరుతో డ్రైవింగ్‌ లైసెన్స్‌ దొరికిందని, ఆ చిరునామా ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నామని డీసీపీ వెంకటేశ్వర రావు వివరించారు. సీసీ కెమెరాల దృశ్యాల్లో ఇద్దరు కనిపించినట్లు చెప్పారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం.

రూ.లక్షకు రూ.2 లక్షలు.. రైస్ ఫుల్లింగ్ కొంప ముంచిందా?

బుధవారం నాడు పూజల పేరుతో ప్రసాదం పెట్టి, లైఫ్ స్టైల్ భవనం యజమాని మధుసూదన రెడ్డిని మోసం చేసిన దొంగ స్వామీజి కేసులో మరో కొత్త ట్విస్ట్. మధుసూదన్ రెడ్డి.. దొంగ స్వామీజీ రైస్ పుల్లింగ్ మాయలో పడి డబ్బులు కోల్పోయారని తెలుస్తోంది.

రూ.1 లక్ష తెస్తే రూ.2 లక్షలు చేస్తానని మధుసూదన్ రెడ్డిని దొంగ స్వామీజీ నమ్మించాడు. అంతేకాదు, లక్షన్నర రూపాయలను రూ.3 లక్షలు చేసి చూపించాడు. మధుసూదన్ రెడ్డి అతని బుట్టలో పడిపోయాడు. దీంతో, స్నేహితుల నుంచి, ఇతరుల నుంచి రూ.1.33 కోట్లు తెచ్చాడు.

రూ.1.33 కోట్లను రూ.2.66 కోట్లు చేస్తానని దొంగ బాబా చెప్పాడు. మధుసూదన్ రెడ్డి అతనిని నమ్మి, బోల్తా పడ్డాడు. స్నేహితుల నుంచి, ఇతరుల నుంచి తెచ్చిన సొమ్ము కూడా పోయింది. ధనాన్ని రెండింతలు చేస్తాననే వారి మాటలు నమ్మి మోసపోవడంపై ఇప్పుడు వారు పశ్చాత్తాప పడుతున్నారు.

బాబాను సంప్రదించగా.. తొలుత కోటి రూపాయలు తయారు చేసుకోమని సదరు దొంగ బాబా చెప్పాడని తెలుస్తోంది. వాటిని డబుల్ చేస్తానని చెప్పాడు. ఆ దొంగ బాబా.. పూజ తర్వాత వారికి ప్రసాదం మత్తులో ఉంచేసి, రూ.1.33 కోట్లు తీసుకొని వెళ్లిపోయాడు. ఒకటికి రెండు వస్తాయని బాధితులు అనుకుంటే.. ఉన్న మొత్తం పోయింది.

ఇదీ దొంగ బాబా వ్యవహారం..

మధుసూదన్ రెడ్డి నుంచి రూ.1.33 కోట్లు తీసుకెళ్లిన దొంగ బాబా అసలు పేరు బుడ్డప్పగారి శివ అని పోలీసులు గుర్తించారు. గతంలోను ఇతను పలువురి నుంచి డబ్బులు కొట్టేసినట్లుగా తెలుస్తోంది. నెల్లూరులో ఆనంద్ రెడ్డి అనే వ్యక్తి నుంచి రూ.40 లక్షలు కొట్టేశాడని చెబుతున్నారు. అలిపిరిలో రూ.1 కోటితో ఉడాయించాడు. అలిపిరి సహా పలు ప్రాంతాల్లో ఇతని పైన కేసులు ఉన్నాయి.

English summary
A thief, posing as a godman, stole Rs 1.33 crore cash from the house of Lifestyle building owner, sedating the victim and his family members after performing a puja at their house at Banjara Hills on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more