వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గులాబీ నేతలను పగబట్టిందా..? టీఆర్ఎస్ నాయకులను వెంటాడుతున్న ఆ గండం..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : రెండు సార్లు తిరుగులేని ఆదిపత్యాన్ని చూపించి అధికారంలోకి వచ్చి, అన్ని రాజకీయ పార్టీలను తోసిరాజంటూ దూసుకెళ్తోంది అధికార టీఆర్ఎస్ పార్టీ. ఇతర పార్టీ నేతలు కూడా పెద్ద ఎత్తున గులాబీ పార్టీలో చేరిపోయారు. దీంతో చాలా వరకు రాజకీయ పార్టీలు ఖాళీ ఐనంత పని అయ్యింది. తెలంగాణ రాజకీయాల్లో అప్రతిహతంగా దూసుకెళ్తున్న గులాబీ పార్టీ నేతలను ఓ గండం నీడలా వెంటాడుతోంది. పార్టీలో హుషారుగా చేరుతున్న కొన్ని రోజులకే ఆ గండం ప్రభావాన్ని సదరు నేతలు ప్రత్యక్షంగా చవిచూడాల్సి వస్తోంది. తాజాగా మంత్రిగా అవకాశం చేజిక్కించుకున్న కరీంనగర్ కు చెందిన గంగుల కమలాకర్ ను ఆ గండం వెంటాడింది. ఇంతకీ గులాబీ నేతలకే గుబులు పుట్టిస్తున్న ఆ గండం ఏంటి..? ఎందుకు..? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!

 గులాబీ పార్టీ నేతలకు చుక్కలు చూపిస్తోంది.

గులాబీ పార్టీ నేతలకు చుక్కలు చూపిస్తోంది.

ఇదో కొత్త గండం.. గులాబీ పార్టీ నేతలకు చుక్కలు చూపిస్తోంది.
గులాబీ నేతలకు ఓ గండం శరాఘాతంలా పరిణమించింది. అధికారిక, అనధికారిక కార్యక్రమాలకోసం హడావిడి చేసే నేతలకు ఆ గండం స్పీడ్ బ్రేకులను వేస్తోంది. అంతే కాకుంగా నలుగురు నవ్వుకునేలా కూడా చేస్తోంది. తెలుగుదేశం పార్టీ నుండి అధికార టీఆర్ఎస్ పార్టీలో 2015లో చేరిన చేవెళ్ల రాజకీయ నాయకుడు కేఎస్ రత్నం తో మొదలైన ఆ గండం తాజాగా మంత్రిని సైతం వెంటాడింది. దీంతో గులాబీ పార్టీ నేతలు ఒక్కసారిగా కలవరానికి లోనౌతున్నట్టు తెలుస్తోంది. ఒక్క టీఆర్ఎస్ నాయకులకే ఎందుకు ఇలా జరుగుతోందనే చర్చ ప్రగతిభవన్ లో కూడా చోటుచేసుకోవడం విశేషం.

 గులాబీ నేతలను పగబట్టిన లిఫ్ట్.. లిఫ్ట్ గుంతలో పడిపోతున్న నేతలు..

గులాబీ నేతలను పగబట్టిన లిఫ్ట్.. లిఫ్ట్ గుంతలో పడిపోతున్న నేతలు..

రాజకీయాల్లో గాని, ఇతర రంగాల్లో గాని కొన్ని సెంటిమెంట్లు అదే పనిగా వెంటాడుతూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కొత్తల్లో టీఆర్ఎస్ నేతల్ని తేనెటీగలు అదే పనిగా వెంటాడేవి. ఎక్కడికక్కడ వారి మీద విరుచుకుపడటం, వారు పరుగులు తీయటం కనిపించేది. తర్వాత తర్వాత ఆ సీన్లు తగ్గిపోయాయి. అదే సమయంలో మరో కొత్త ఇబ్బంది వారిని వెంటాడుతోంది. కొద్దికాలంగా టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులకు లిఫ్ట్ రూపంలో ఓ గండం తెగ ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో లిఫ్ట్ ఎక్కాలంటేనే సదరు నేతలు జడుసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది.

 టీఆర్ఎస్ నేతలు చాలా మంది లిఫ్ట్ బాదితులే.. మైనంపల్లి కూడా..

టీఆర్ఎస్ నేతలు చాలా మంది లిఫ్ట్ బాదితులే.. మైనంపల్లి కూడా..

గతంలో చేవెళ్ల టీఆర్ఎస్ నేత కేయస్ రత్నం ను వెంటాడిన లిఫ్ట్ గండం ఆగన ప్రాణాలమీదకు తెచ్చింది. కొద్ది నెలల క్రితం మల్కాజిగిరి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఒక ప్రైవేటు కార్యక్రమానికి హాజరై, తిరిగి వస్తుండగా లిఫ్ట్ లో చిక్కుకుపోయారు. ఆయన ప్రయాణిస్తున్న లిఫ్ట్ తీగ తెగిపోయింది. దీంతో.. ఆయన కాళ్లకు ఫ్యాక్చర్ కావటంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దీంతో క్రియాశీల రాజకీయాలకు ఆయన కొన్నాళ్లు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత మంత్రి జగదీశ్ రెడ్డి, ఈటల రాజేందర్, సెయింట్ థెరిస్సా హాస్పటల్ లిఫ్ట్ లో తలసాని శ్రీనివాస యాదవ్ ఇరుక్కున్న ఉదంతాలు సంచలనంగా మారాయి.

 గంగుల కమలాకర్ కు తాకిన లిష్ట్ సెగ.. లిఫ్ట్ బద్దలుకొట్టి బయటకు తెచ్చిన పరిస్థితి..

గంగుల కమలాకర్ కు తాకిన లిష్ట్ సెగ.. లిఫ్ట్ బద్దలుకొట్టి బయటకు తెచ్చిన పరిస్థితి..

తాజాగా కరీంనగర్ కు చెందిన ఓ తాజా మంత్రి కూడా లిఫ్ట్ గండంలో చిక్కుకున్నారు. మంత్రి గంగుల కమలాకర్ కొత్తగా నిర్మించిన న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లోని లిఫ్ట్ లో ఎక్కిన ఆయన సాంకేతిక లోపంతో లిఫ్ట్ లో చిక్కుకుపోయారు. దాదాపుగా 45నిమిషాల పాటు ఆయన లిఫ్ట్ లోనే ఉండిపోవాల్సి వచ్చింది. చివరకు సిబ్బంది లిఫ్ట్ డోర్లు పగులగొట్టి మంత్రిని బయటకు తీశారు. ఊహించని రీతిలో చోటు చేసుకున్న ఈ పరిణామానికి మంత్రి తీవ్ర అసౌకర్యానికి గురైనట్లు తెలుస్తోంది. కొత్తగా నిర్మించిన న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఇలాంటి ఘటన చోటు చేసుకోవటం పట్ల నాయకులు అవాక్కవుతున్నారు. మరోవైపు ఒక్క టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులనే లిఫ్ట్ గండం వెంటాడుతోందని రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి చర్చ జరుగుతోంది.

English summary
A new minister from Karimnagar was also caught in the Lift. Minister Gangula Kamalakar boarded the lift in the newly built new MLA quarters and he was trapped in the lift with a technical defect. He had to stay in the lift for nearly 45 minutes. Leaders are stunned about such an incident occurring in the newly built new MLA quarters. On the other hand, there is once again a debate across the state that the lift is haunting the representatives of TRS leaders only.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X